FILTERS:
SORT BY:
కాలభైరవుడు అంటే కేవలం మరణం గురించే కాదు - కాలం గురించి కూడా. మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందనేది, మీరు మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
మీ అంతరంగం నిశ్శబ్దంగా మారినప్పుడు, మీరు ఊహించని రీతిలో జీవితాన్ని గ్రహిస్తారు - అత్యంత లోతుగా.
మీ హృదయంలో ప్రేమ ఉంటే, దయ అవసరం లేదు. ప్రేమే మిమ్మల్ని నడిపిస్తుంది.
పైకెక్కడానికి ఒక వెల ఉంటుంది, కాని కిందికి పడడం ఉచితం. మీరు అందమైన ప్రదేశాల్లోకి పడడం నేర్చుకోవాలి అంతే– మరి అన్నింటి కన్నా అందమైన ప్రదేశం మీలోనే ఉంది.
ఒక పువ్వుకు సువాసన ఎలాంటిదో, మనిషికి ప్రేమ అలాంటిది.
మీరు చేసే ప్రతి పనిలో విజయం, ఆనందం కావాలనుకుంటే, అత్యంత ముఖ్యమైన విషయం 'స్పష్టమైన అవగాహన'.
ధ్యానం అంటే ఏదో జయించడమో లేక సాధించడమో కాదు - అది సొంత గూటికి చేరుకోవడం. అది ఎక్కడికో చేరుకోవడం గురించి కాదు - అది కేవలం మీలోకి మీరు పడిపోవటం.
మీరెవరన్నది మీ అంతరంగంలో స్పష్టంగా స్థిరపడితే, ఇతరుల మాటలు ఇక మిమ్మల్ని కదిలించలేవు.
మీ జీవితానికి కావలసిన ముడిసరుకు మాత్రమే మీకు ఇవ్వబడింది. దానితో మీ జీవితాన్ని ఎలా మలచుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది.
మీ జీవిత పరిస్థితి ఎలా ఉన్నా, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు వట్టి చేతుల్తోనే వచ్చారు, కాబట్టి మీరు ఎప్పుడూ లాభంలో ఉన్నట్టే.
మీ పిల్లల పట్ల మీ హృదయంలో ఏమైనా ప్రేమ ఉంటే, మీరు చేయగలిగే ఉత్తమమైన పని వారికి బోధించడం కాదు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం.
మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులను మనం అన్నివేళలా మార్చలేకపోవచ్చు. కానీ వాటిని మనం అనుభూతి చెందే విధానాన్ని మార్చుకోకుండా ఎవరూ మనల్ని ఆపలేరు.