FILTERS:
SORT BY:
ఈ శరీరం కేవలం భూమిలోని ఒక భాగం మాత్రమే. ఈ గ్రహం ఆరోగ్యంగా లేకపోతే, మనిషికి మంచి జీవితం అనేది ఉండదు.
మూర్ఖులు మాత్రమే పుకార్లను విని బాధపడతారు. అయితే పుకార్లు పుట్టించేవారు తమకు తామే ఎక్కువ హాని చేసుకుంటున్నారు.
ప్రేమ స్వేచ్ఛనిస్తుంది. కానీ మమకారం బంధిస్తుంది.
నేల మీద బలమైన పాదముద్రలను వదిలి వెళ్లాలనుకునే వారు, ఎప్పటికీ ఎగరలేరు.
నమ్మకం అంటే ఇతరులు మీరు ఆశించిన విధంగానే నడుచుకోవాలని కాదు. నమ్మకం అంటే ఎరుకతో కూడిన సున్నితత్వాన్ని కలిగి ఉండటం.
సాంకేతికత మనుషులకంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనం సాంకేతికత కంటే వేగంగా పరిణామం చెందకపోతే, దానిని ఎప్పటికీ వివేకవంతంగా ఉపయోగించుకోలేము.
యోగా ఒక వ్యాయామం కాదు. అది ఒక జీవన విధానం.
మీరు ఒకరి నుండి సంతోషాన్ని పిండుకోవాలని చూస్తే, వారు కూడా మీ నుండి సంతోషాన్ని పిండుకోవాలని చూస్తే, కాలక్రమేణా ఆ బంధం బాధాకరంగా మారుతుంది.
ఒకే సమస్య పదే పదే ఎదురవుతుందంటే, సమస్య మీలోనే ఉందని అర్థం.
చాలా మంది మనుషులు తమలో ఉన్న అంతర్గత మేధస్సును ఎప్పుడూ స్పృశించకుండానే జీవించి మరణిస్తారు.
తమిళ నూతన సంవత్సరంతో సూర్యుని శక్తి మనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది, జీవితాన్ని భారంగా లాక్కెళ్ళకండి – ఓ సరికొత్త ఉత్తేజంతో, తీక్షణతో అందులోకి దూకండి.
చేసేది ఎలా కర్మ అవుతుందో, చేయకపోవడం కూడా కర్మే అవుతుంది.