Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
కామం ఒక బలమైన అవసరం. ప్రేమ అనేది అవసరం కాదు, అది ఒక తపన. మీరు ప్రేమతో ఉన్నప్పుడు, స్థిమితంగా ఉంటారు; ఇంకేమీ అవసరం ఉండదు.
మరణించడానికి సిద్ధంగా ఉన్న వారే సంపూర్ణంగా జీవించగలరు
భక్తి లేకుండా పని చేస్తే, అది బంధనానికి దారితీస్తుంది. గాఢమైన భక్తితో చేస్తే, అది విముక్తి వైపు నడిపిస్తుంది.
మీ తర్కాన్ని దాటి వెళ్ళడం స్వేచ్ఛనిస్తుంది, కానీ దానిని పూర్తిగా వదిలేయడం మూర్ఖత్వం అవుతుంది.
పూర్తిగా జీవత్వంతో ఉండటం అనేది అద్భుతం. సగం జీవత్వం ఒక చిత్రహింస.
పారవశ్యం అనేది ఒక లక్ష్యం కాదు –అది బాధపట్ల భయాన్ని తొలగిస్తుంది. ‘నాకేమౌతుందో’ నన్న భయం తొలగితేనే మీరు జీవితాన్ని శోధించేందుకు సాహసిస్తారు.
ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, మీ అంతర్గత మేధ మేల్కొనడమే. కాలం పరిమితం. ఏదైతే జరగాలో అది ఇప్పుడే జరగాలి.
మీలో భయాన్ని సృష్టించుకోవాలంటే, ఇంకా జరగని దాని గురించి మీరు ఊహించుకోవాలి. భయం నుండి విముక్తి పొందడానికి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
మీ జీవితం మీ కర్మ, అది మీరు చేసుకునేది. ఇది మీరు చూసేంతవరకు, మీ జీవితం నిజంగా మీది కాదు.
మనశ్శరీరాలు అనేవి జీవితంలో పైకి ఎదగడానికి సోపానాలుగా ఉండాలి. కానీ దానికి భిన్నంగా, మనుషులు జీవితాంతం కూరుకుపోయే ఊబిలా మారిపోయాయి.
ప్రేమగా మారండి. ఇది జీవించడానికి ఒక తెలివైన మార్గం.
గురువు మీలోని చీకటిని పారద్రోలుతాడు. ఆయన లోపలి నుంచి జ్వలిస్తాడు. మీరూ ఆ జ్వాలతో ప్రజ్వరిల్లి, మిమ్మల్ని వెనక్కి లాగే వాటన్నింటినీ దాటి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.