Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
మీకు మరణం ఉందన్న విషయాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఎరుక కలిగిన వారు అవుతారు. లేదంటే పూర్తిగా ఎరుక లేకుండా జీవించేస్తారు.
సంతోషం అనేది మీరు సంపాదించుకునేది కాదు.అది తిరిగి ఇంటికి చేరుకోవడం లాంటిది.
భారత దేశీయత అన్నిమతాల కంటే ముందు నుంచే ఉన్నది. మనది అప్పుడూ, ఇప్పుడూ ఒకే దేశం. ముక్తి – మోక్షం– కోసం మన అన్వేషణ మనల్ని ఎల్లవేళలా ఒకటిగా కలిపి ఉంచింది.
యౌవ్వనం అనేది వయసుకు సంబంధించినది కాదు. అది మీలోని సజీవతకు, నిమగ్నతకు సంబంధించినది.
మీరు ఎంత ఎక్కువగా నిర్ధారణలు ఏర్పరచుకుంటారో, అంతగా నిర్జీవంగా అవుతారు.
నిశ్చలత్వం, ఉత్సాహం, మైకము, ఇవన్నీ ఒకేసారి మీ అనుభవంలో ఉన్నట్లయితే - అప్పుడు జీవితం పరమోన్నత స్థితిలో ఉందని.
నా ఆధ్యాత్మికత ఒక గుహ అవసరమైనంత దుర్బలమైనది కాదు. నేను సంతలో కూడా అదే విధంగా ఉండగలను.
మీకు మరీ ఎక్కువ అహంభావం ఉంటే, జీవితం మిమ్మల్ని మర్దించాల్సిందే. వేరే చికిత్స లేదు.
ప్రేమ అనేది మీలోని ఒక ఆహ్లాదకరమైన మనోభావం. ఆ అవతలి వ్యక్తి దూరమైనా సరే, మీరు ప్రేమని అనుభూతి చెందవచ్చు.
మీరు బాధపడుతున్నది నిన్న జరిగిన దాని గురించి అయితే, మిమ్మల్ని బాధ పెడుతున్నది మీ జ్ఞాపకాలు కానీ మీ జీవితం కాదు.
సుఖ దు:ఖాలు రెండూ మీలోనే సంభవిస్తాయి. ఎంపిక మీదే.
పొగడ్తలకు పొంగిపోయేలా, నిందలకు కుంగిపోయేలా నన్ను నేను తయారు చేసుకోలేదు. ఆ హక్కును నేను ఎవరికీ ఇవ్వలేదు.