సద్గురు ఒక కార్యక్రమంలో తాను భక్తిని ఎందుకు ప్రచారం చేయడం లేదో వివరించారు. ఆధునిక విద్యను అభ్యసించిన వ్యక్తి ప్రతి విషయాన్ని విశ్లేషించడానికి అలవాటుపడినందు వల్ల సాధారణంగా భక్తికి దూరంగా ఉంటాడు. ఈ రోజుల్లో ప్రజలకు భక్తి అసాధ్యమని కాదు, కానీ సరైన అవగాహన లేకపోతే, అది భ్రమలకు దారితీయవచ్చు. ఒక వ్యక్తి తన ఆలోచనా పరిమితులను దాటినప్పుడు, భక్తి సహజంగానే వస్తుంది.
Subscribe