ప్రశ్న:సద్గురు, పంచభూతాలలో ఒకటైన ఆకాశం అంటే అంతరిక్షం. నేను  మీ యూట్యూబ్ వీడియోస్ లో మీరు 'ఈదర్' అని అంతరిక్షం గురించి చెప్పడం విన్నాను. మీరు ఒకసారి సమయం యొక్క ప్రయాణం గురించి చెబుతూ ఆకాశం గురించి మాట్లాడారు. నాకు  ఈ 'ఈదర్' , ఆకాశం అన్నదాని గురించి కొంచెం అయోమయంగా ఉంది. దీన్ని ఒకసారి స్పష్టం చేయగలరా సద్గురు?

సద్గురు: మీరు అయోమయంలో ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. మీరు ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసేదాని కంటే అయోమయంలో ఉండడం అనేది మంచి స్థితే. అయోమయం అంటే మీరు ఇంకా అది  ఏమిటో తెలుసుకోవాలని వెదుకుతున్నారు. నా ఉద్దేశ్యం అదే, మిమ్మల్ని అయోమయంలో ఉంచాలనే. ఎందుకంటే, మీరు ఎప్పుడు అన్వేషిస్తూ ఉండాలన్నదే నా కోరిక. ఎవరూ ఆకాశం అంటే అంతరిక్షం అని చెప్పలేదు. ఆకాశం అంటే 'ఈదర్' అనే ద్రావకం. ఇది సరైన అనువాదం కాదు, కానీ ఇంచుమించుగా అంతే. ఈదర్ అంటే అంతరిక్షం కాదు. ఇది మన మనుగడకు సంభందించిన ఒక రకమైన అంశం. ఇది ఎంతో సూక్ష్మమైనది. మనం ‘స్పేస్’ అన్నప్పుడు 'కాలం' గురించి మాట్లాడుతున్నాం.

ఏదయితే లేదో దాని గురించి. 'శి వా' అంటే 'నాస్తి',  లేనిది. మనం ఆకాశం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఏదైతే  ఉన్నదో, దాని గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ మీరు ఒక మానవులుగా ఉన్నారు. ఇందులో స్థూలం నుండి సూక్ష్మం వరకు ఎన్నో రకాలైన అంశాలున్నాయి. మీకు మలబద్దకం ఉందనుకోండి మీలో ఏదో స్థూలమైనది ఉందని అర్ధం.. అవునా?  దాని కంటే పైన ఇంకొంచెం మెరుగైన శారీరక అంశాలు ఉన్నాయి. దాని కంటే పైన మీ ఊపిరి తిత్తుల  నిండుగా గాలి ఉంది. దానిపైన మీ మనసు,ఆలోచనలు ఎన్నో  ఉన్నాయి.వీటన్నిటికీ మించి జీవితం. లోపలకు బయటకు కొనసాగుతోంది 'శ్వాస'. నీరుంది,భౌతికమైన పదార్ధం ఉంది,గాలి ఉంది. ఉష్ణోగ్రత, అగ్ని ఉంది ఇంకా ఆకాశం ఉంది.

మీరు ఈ బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకుందాం అని ప్రయత్నించకండి. మిమల్ని మీరు తెలుసుకోండి. ఇదీ ఒక బ్రహ్మండమే. మిమల్ని మీరు  సరిగ్గా తెలుసుకున్నారు అనుకోండి, మీకు ఈ బ్రహ్మాండం కూడా అర్ధమవుతుంది. ఈ రోజుల్లో ఇందుకు అనుమానమే లేదు. ఇది యోగ విజ్ఞానంలో ఎప్పుడూ చెబుతూనే ఉన్నాము. కానీ ఇప్పుడు భౌతికశాస్త్రం ఏం చెబుతోందంటే 'ఈ ప్రపంచంలో ఉన్న రూపకల్పన అంతా అది అణువైనా కావచ్చు, బ్రహ్మండమైన కావచ్చు, ఇదంతా ఒక్క విధంగానే  ఉంది' అని . మీరు మానవులుగా ఈ రూపం లో ఉన్నా, ఒక మిడతైనా, ఒక వానపామైనా , ఒక పక్షయినా , ఏదయినా పాకే జంతువైనా మీ అందరికి ప్రాధమికంగా ఒకే విధమైన రూపకల్పన, డిజైన్ ఉంది. ఇది అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఒకే రకమైన డిజైన్. కాకపొతే ఈ రూపకల్పన ఎలా మారింది అనేదాని సంక్లిష్టత వివిధ రూపాలతో మారుతూ వచ్చింది. మీ డిజైన్ మరింత మెరుగైనది. అమీబా కంటే మరింత మెరుగైనది. మరింత సంక్లిష్టమైనది. కానీ ప్రాథమికమైన రూపకల్పన ఒకటే. కాకపొతే దీని సంక్లిష్టత పెరిగింది. అందుకని మీరు ఈ బ్రహ్మాండాన్ని  గ్రహించాలని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు బ్రహ్మాండాన్ని  అంతా చూడలేకపోతున్నారు, కదా. ఎక్కడో కూర్చుని బ్రహ్మాండాన్ని చూసే అవకాశమేమీ లేదు. నిజానికి మీరు మీలో ఏం జరుగుతోందో అది తప్ప మిగతా ఏమి గ్రహించలేరు కదా. మీరు ఒక టెలిస్కోప్ తీసుకొని ఒక నక్షత్రాన్ని చూసినా సరే, ఆ నక్షత్రం మీరెలా అవగాహన చేసుకుంటున్నారో అలాగే కనిపిస్తుంది. అంతేకదా ..! నిజానికి మీరు నక్షత్రాన్ని చూడట్లేదు. అందుకే మీరు ఇంకా మనుగడలో లేని నక్షత్రాలను కూడా చూస్తున్నారు. నిజానికి  సృష్టిలో అవి లేవు. కానీ అవి ఉన్నట్టుగా మీకు కనిపిస్తున్నాయి. అది మీ మనసులో ఒక విధంగా కనిపిస్తుంది. మీకు అదే విధంగా అది ఏమిటో తెలుస్తుంది.

 నిజానికి మీరు మీలో ఏం జరుగుతోందో అది తప్ప మిగతా ఏమి గ్రహించలేరు కదా.

ఇంకో మాటల్లో చెప్పాలంటే మీరు కేవలం మీలో జరిగేది  మాత్రమే అనుభూతి చెందగలరు. ఇది ఒక్కటే మీకున్న అవకాశం, మీకున్న ద్వారం. మీరు తిన్న ఆహారాన్ని అనుభూతి చెందాలన్నా సరే, మీరు పీల్చే గాలిని అనుభూతి చెందాలన్నా సరే, మీ చుట్టూరా ఉన్న వారిని అనుభూతి చెందాలన్నా సరే, మీ చుట్టూతా ఉన్న బ్రహ్మాండాన్ని అనుభూతి చెందాలన్నా సరే  మీరు కేవలం ఇది ఎలా ఉందో ఆ విధంగా మాత్రమే  చూడగలరు. ఇప్పుడు ఇందులో స్పష్టత  ఉందనుకోండి మీరు దాన్ని సవ్యంగా చూడగలుగుతారు. ఇప్పుడు ఇది సవ్యంగా లేదనుకోండి, మీరు చూసేది ఎన్నో విధాలుగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అద్దాలు చాలా వరకు చదునుగా బానే వస్తున్నాయి అనుకుంటా. కానీ ఇప్పటికీ కూడా చవకబారు అద్దం కొన్నారనుకోండి మీరు 'ఇలా' కనిపిస్తారు. కానీ మీరు కొన్ని రకాల అద్దాలు కొన్నారనుకోండి మీరు మీ బరువు ఒక్క రోజులో తగ్గించేసుకోవచ్చు. మీరు వెళ్లి అద్దం ముందు నిల్చుంటే చాలు మీరు చాలా సన్నగా కనిపిస్తారు.అందుకని ఈ అద్దాలు 'మీరెవరు?' అన్నది  మీకు ఎన్నో రకాలుగా కనిపించేలా చేస్తాయి. మీరు కొంచెం సరిగ్గా లేని అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారనుకోండి కొన్ని రోజుల  తరువాత నేను ఇలానే ఉంటానేమో అనుకుంటారు. అవునా కాదా? మీరు, 'నేను  ఇలానే కనిపిస్తానేమో' అనుకుంటారు. ఎందుకంటే  ప్రతిరోజూ మిమల్ని  మీరు అలానే చూసుకున్నారు కాబట్టి,  'నేను ఇలానే ఉంటానేమో' అని మీరు అనుకుంటున్నారు.

ఇప్పుడు కూడా ప్రపంచం మీకు ఇలానే ఎందుకు అనిపిస్తోందంటే ఇది మీ మనసులో ఆ విధంగానే మీకు అవగాహన అవుతోంది. మీరు ఈ మనసుని  ఇంకొంచెం  మెరుగు పరచగలిగారనుకోండి ఇక్కడ ఎటువంటి చలనం లేకుండా ఇంకొంచెం మెరుగు పరచగలిగారనుకోండి, ఎలా అంటే  - ఒక స్పష్టమైన అద్దం లాగ. అప్పుడు అదంతా ఉన్నది ఉన్నట్టు మీకు అవగాహన కలిగేలా చేస్తుంది. కానీ అది కూడా తిరగవేసే ఉంది. ఇప్పుడు అద్దంలో మీకు తిరగేసే కదా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న సమస్య ఏమిటంటే ఇప్పుడు దీన్ని మీరు మార్చకుండా తిరగవేయగలగాలి. ఇప్పుడు దీన్ని సరిచేయడానికి అవసరమైన మేధస్సు మీకు కావాలి. చాలామంది దోసెనే సరిగా తిరగేయలేరు. వాళ్ళు దోసెని తిరగేయాలంటే అది 'ఇలా' అయిపోతుంది. ఒకదాన్ని ఇలా తీసుకోని ఇలా తిప్పగలగాలంటే దానికి కొంత ప్రతిభ కావాలి. ఇది మనసుతో ఉన్న సమస్య. ఒక విషయం ఏమిటంటే దానికి స్థిరత్వం లేదు. మీ మనసుని  కొంచెం అస్థిరంగా ఉంది . మీరు ఈ అస్థిరంగా ఉన్న అద్దంలో నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు.అది ఒకవిధంగా కనిపిస్తుంది.చాలా మందికి దీన్ని తిప్పాలి అన్న ఆలోచనే లేదు. ఎందుకని అంటే ఇలానే కనిపిస్తుందేమో అని అనుకుంటున్నారు. మీరు దీన్ని తిప్పాలనుకోండి దీనికి కొంచెం ప్రతిభ కావాలి. మీరు ఇది పాడైపోకుండా తిప్పడానికి కొంత ప్రతిభ కావాలి. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి.ఒకటి ఏమిటంటే మీ అద్దాన్ని సరిగ్గా పెట్టుకోవాలి  అప్పుడు మీకు సరైన రూపం కనిపిస్తుంది.  ఇప్పుడు ఇంతకంటే పెద్ద విషయం ఏమిటంటే మీరు దీన్ని అలా తిరగవేయాలని అనుకుంటున్నారు - ఎటువంటి మార్పు లేకుండా. ఇంకా మీరు మీ జీవితంలో ఇక్కడ వరకు రాలేదు. మొదటి విషయం  ఏమిటంటే, మీ అద్దాన్ని స్పష్టంగా కనిపించేలాగా చేసుకోవాలి.

 ఈ ఆకాశాన్ని మనం తీసేశామనుకోండి మీరు ఇక్కడ ఉండలేరు.మీ మనుగడ లేదు.

ఇప్పుడు ఇక్కడ ఉన్న గాలి ఇది మీలో ఒక జీవంగా భాగమేనా ..? అవునా?  మీ జీవితం ఇక్కడ అంతా ఇలా పరచబడి ఉంది. ఇది భౌతికమైనది. ఇందులో కూడా ఎన్నో స్థాయిలు ఉన్నాయి. ఎన్నో స్థూలమైనవి, సూక్ష్మ మైనవి ఉన్నాయి. ఎన్నో స్థూలమైనవి మీ శరీరంలో ఉన్నాయి. ఎన్నో  సూక్ష్మమైనవి ఉన్నాయి. మీ ఆలోచనలు, మీ భావావేశాలు, మీరు పీల్చే గాలి  ఒకవిధంగా చెప్పాలంటే జీవితం ఒక రకమైన స్థూలత్వం నుంచి ఎంతో సున్నితమైన సూక్ష్మత్వం వరకు. మీరు మిమ్మల్ని ఎంతవరకు విస్తరించుకోగలిగారు అంటే మీలో ఎంత సూక్ష్మత్వం ఉందో అంత. మీరు మీ రెక్కల్ని ఎంతవరకు విప్పగలిగితే అంత సూక్ష్మత్వం మీలో ఉంటుంది.  ఇప్పుడు మనం  ఆకాశం అని దేనైతే అంటున్నామో అది మీ జీవితంలో ఒక సూక్ష్మమైన అంశం. ఈ ఆకాశాన్ని మనం తీసేశామనుకోండి మీరు ఇక్కడ ఉండలేరు.మీ మనుగడ లేదు. మీరున్న చోటు నుంచి గాలిని తీసేసామనుకోండి, మీ మనుగడ లేదు కదా. మీరు దాన్ని చూడలేకపోయినా సరే  ఇది మీ జుట్టు కంటే ఎంతో కీలకమైనది. నేను ఇలా ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు మీ జుట్టును సంరక్షించుకోవడానికి ఎంతో ఎక్కువ  ఖర్చు పెడుతున్నారు.. కదా! మీ మనసుని సరిగ్గా అట్టేపెట్టుకోవడం కంటే ఎక్కువ..! దీన్నీ బట్టి మన విలువలు ఎంతలో ఉన్నాయో మనకు అర్ధమవుతోంది. మీరు మీ జుట్టుని అంతా తీసేసినా మీరు  జీవించి ఉండగలరు. నేను మీ చెవులను తీసేసినా  మీరు ఇంకా జీవించే ఉండగలరు, నేను మీ ముక్కు కోసేసినా మీరు ఇంకా జీవించే ఉండగలరు. కానీ నేను -  మీరు కనీసం చూడలేని గాలిని తీసేసాననుకోండి....! మీలో చాలామందికి ఇది ఉందా, లేదా అన్న ఎరుక కూడా లేదు...! కానీ నేను దీనిని తీసేసాననుకోండి మీరు ఒక క్షణం కూడా జీవించి ఉండలేరు కదూ. ఇప్పుడు అలానే ఈ ఆకాశాన్ని  తీసేసినా సరే మీరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. దక్షిణ భారత దేశం లో ఒక ఆలయం ఉంది. దీన్ని అన్నపూర్ణేశ్వరి ఆలయం అంటారు. ఎవరైనా కర్ణాటక నుండి వచ్చారా? అన్నపూర్ణేశ్వరి ఆలయానికి వెళ్ళారా? ఈ ఆలయం వెనుకాల  భాగంలో 'హలే గన్నడ' అంటే పురాతన కన్నడలో కొన్ని  సూచనలు రాసి ఉన్నాయి.

ఇది 3,000 సంవత్సరాల పురాతనమైనదై  ఉంటుంది. ఇక్కడ దేని గురించి రాసుంది అంటే -  ఎయిర్ ప్లేన్ ని ఎలా తయారు చేయాలి అన్నది రాసుంది. వాటిని ఏ విధంగా రూపకల్పన చేయచ్చో ఉంది. కానీ మీరు ఇలాంటి వాటిల్లో ఎగురుతున్నారు అంటే ఇది ఈ భూగోళంలోని ఉన్న ఈ ఈదర్ అనే ద్రావకాన్ని కొంచెం తారుమారు చేస్తుంది' అని కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ ఆకాశం అని దేన్ని అంటున్నారు అంటే, అది అంతరిక్షం కాదు..! 'మీరు ఈ ఆకాశాన్ని కదిలిస్తే, అపుడు మానవులకు శాంతి అనేది వారి జీవితంలో తెలీదు' అని రాస్తున్నారు. ఒకసారి ఆకాశం అన్నది మారిస్తే అపుడు మానసికంగా నిలకడ లేకుండా ఉంటుంది.  దీనికి మీరు సజీవ ఉదాహరణ కదా..!

మనం ఇక్కడ ఉన్న ఆకాశమంతా తీసేసామనుకోండి ఈ భౌతిక శరీరం ఒక్క క్షణం కూడా ఇలా ఉండలేదు. మనం ఆకాశం అన్నప్పుడు ఈ పంచభూతాల్లో ఒకటిగానే మాట్లాడుతున్నాము. ఈ పంచభూతాల్లో ఆకాశం ఒకటి. మనం పంచభూతాలు అన్నప్పుడు  మనం అంతరిక్షం గురించి మాట్లాడటం లేదు. .భూమి,నీరు,అగ్ని,గాలి తో పాటుగా మరో పదార్ధం, మరో అంశమే ఆకాశం.  అది ఈ పంచభూతాలలోని ఒక  పదార్ధం. అందుకని ఆకాశం అంటే అంతరిక్షం అని అనుకోకండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు