నా జీవితమనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించా!
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి U.N(United Nations) లో జూన్ 20,21 న వేడుకల సన్నాహానికి తేర తీసేందుకు గత కొద్ది వారాల్లో ఎక్కువ శాతం మీడియా వారితో గడిచింది. అన్నీ రాష్ట్రాల నుంచి, భాషల నుంచి, సంస్కృతుల నుంచి, వచ్చిన మీడియా వారితో ముఖాముఖిలు ఎంతో ఆసక్తికరంగా జరిగాయి. చాలా తెలివైన వారి నుంచి, పెద్దగా తెలివి తేటలు లేని వారి వరకు, మంచి ప్రవర్తన కలిగిన వారినుంచి, దుష్ప్రవర్తన కలిగిన వారి వరకు, మంచి ఉద్దేశాలు కలిగిన వారు, వక్ర బుద్ధి కలవారు, అన్ని రకాల వారు వచ్చారు. ఇంకా కొంతమంది మంచి పాత్రికేయులు మిగిలే ఉన్నందుకు ఆనందంగా అనిపించింది. రోజు మొత్తం లైట్ల వెలుతురు (shootings) లో, అంతులేని ఒకే విధమైన ప్రశ్నల పరంపరతో గడిచిన తరువాత తెల్లవారు జాము 2 గంటలకు ఎయిర్ పోర్ట్ లో ఉండవలసి వచ్చింది.
మనం చిన్న విషయాలను పెద్దగా, నిజంగానే పెద్ద విషయాలను ప్రాధాన్యత లేని వాటిగా చేసే తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను కిందటి సంవత్సరం జరిగిన వేల కొద్ది పిల్లల ఆత్మహత్యలను పెద్ద విషయాలుగా మీడియా వారితో చెప్పదలచుకుంటే, వారు కేవలం ఉత్తర ప్రదేశ్ లో గత సంవత్సరం ఒక మనిషి చనిపోయిన దాని గురించే ఆసక్తి చూపిస్తున్నారు లేదా నన్ను "భారత దేశానికి సహనశీలత లేదు" అన్న అంశం గురించి మాట్లాడించాలని చూస్తున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్నవారు ఒకసారి ప్రపంచంలోని వేరే దేశాలకు ప్రయాణం చేసి చూడాలి. సోమాలియా లాంటి దేశానికి అక్కరలేదు, ఎంతో ఆధునిక దేశాలు అన్న దేశాలకు వెళ్ళినా వారికి అర్ధమవుతుంది.
నిన్న నేను ఢిల్లీ ట్రాఫిక్ లో కార్ నడుపుతూ ఉండగా ఔరంగజేబ్ రోడ్డుకి చాల దగ్గరలో ఎంతో సాధువులుగా కనిపించే ఒక చిన్న సిక్కుల సమూహాన్ని చూసాను. వీరు బాబా బంద సింగ్ బహద్దూర్ స్మారకోత్సవాన్ని చేస్తున్నారు. ఈయన ఒక సిఖ్ సాధువు, మొఘల్ రాజ్యంపై పోరాడిన ఒక గొప్ప యోధుడు. మొఘలులు ఈయనని మరి కొంత మంది సిక్కు యోధులను బంధించారు. అప్పటి మహారాజైన ఫారుక్ సియర్ ఆజ్ఞ మేరకు వీరు మతం మార్చుకోవడానికి నిరాకరించారు, అందుకని మొఘలులు బంద సింగ్ కళ్ళు పీకేసి సజీవంగా ఉండగానే చర్మాన్ని వలిచేసి అవయవాలు ఖండించి శిరస్సుని ఖండించి వేసారు. ఈయనతో పాటుగా వందల కొద్ది సిక్కు యోధులను హింసించి హతమార్చారు, అదంతా కూడా ఈ ప్రాంతంలోనే జరిగి ఉంది ఉండవచ్చు. నేను ఒక సిఖ్ దంపతులని కలిసాను, వారికి ఈ విషాద కరమైన చరిత గురించి తెలుసా? అవును! తెలుసు. వారికి కోపంగా ఉందా? లేదు, కాని ఎంతో తీవమైన బాధ. వారి గురువైన తేజ్ బహద్దూర్ ను హతమార్చిన కసాయి పేరు మీద ఒక రోడ్డు పేరు ఉండడం పట్ల వారికి క్రోధం కలుగుతోందా? వారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. మీ ఉద్దేశంలో సహనం లేని దేశమంటే ఇదేనా?
నాకు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు ఆయన నలుగురు పిల్లలమైన మాకు - నేను అందరికంటే చిన్న వాడిని, అలీన (Non-Allied) దేశం యొక్క విశిష్టతను గురించి చెబుతున్నారు. "అంటే మనకి మిత్రువులు లేనట్టా? " అని నేను అడిగిన ప్రశ్నకి ఆయన నిర్ఘాంత పోయారు. శశి తరూర్ ఒకసారి బాధపద్దట్టుగా మన విదేశి విధానాలు, వేరే దేశాలకు నీతి సూత్రాలు బోధిస్తున్నట్టుగా ఉంటాయి. ఇప్పటి మన ప్రధానమంత్రి మొట్ట మొదటి సారిగా భారతదేశాన్ని భాగస్వామ్యానికి అనుకూలమైన దేశంగా, పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక అవకాశంగా మారుస్తున్నారు. పేదరికం అంటే ఒక విశిష్టమైన లక్షణం అని అనుకోవడం మనం మానేయాల్సిన సమయం వచ్చింది, నిరాడంబరత విశిష్టతే కాని పేదరికం కాదు.
ఉగాండా దేశానికి వెళ్ళడానికి ఫ్లైట్ లో ఉన్నాను, తొమ్మిది రోజుల పాటు మూడు దేశాలలో ఎడతెగని పనులలో చివరిగా కంపాలా లో ఇన్నర్ ఇంజనీరింగ్ రిట్రీట్ తో ముగుస్తుంది.
నా జీవితమనే కొవ్వొత్తిని రెండు వైపుల నుండి వెలిగిస్తున్నాను. మీ అందరికీ ఉపయోగా పడుతున్నాను అనుకుంటా!