వంటచెయ్యడం పట్ల సద్గురుకున్న అభిరుచి అందరికీ తెలిసినదే. అరుంధతి సుబ్రమణియన్ సద్గురు జీవితచరిత్ర (సద్గురు, మోర్ దాన్ అ లైఫ్) లో ఇలా అంటారు: "జీవితం పట్ల ఆయన ప్రేమ అన్ని రంగాలకూ విస్తరించి ఉంటుంది. ఆయనకి సమయం చిక్కినపుడు వంటచెయ్యడానికి బాగా ఇష్టపడతారు. ఈ భూమ్మీద అతి పలుచని మసాలా దోశ తనే వెయ్యగలనని చెబుతుంటారు. వాళ్లమ్మాయి దీని వత్తాసు పలుకుతుంది (దానితో బాటే చాలా ఉత్సాహంగా నవ్వుతూ 'ప్రపంచంలో తన తండ్రిని మించి వంటబాగా చెయ్యగలవాళ్ళులేరు" అంటుంది.) మాటలపోగు, ఇంగ్లండుకి చెందిన ప్రముఖ చెఫ్ గోర్డాన్ రామ్సే (Gordon Ramsay) ఈషా కేంద్రాన్ని ఆయన సందర్శించినపుడు, సద్గురు చేసిన వంట గురించీ, ఆశ్రమంలోని ఆహారం గురించీ చాలా మంచిమాటలే చెప్పారు.

అయితే, సద్గురు మాత్రం, ప్రస్తుతం తనకున్న కార్యక్రమాల వల్ల, దోశ తయారు చెయ్యడానికి సమయం చిక్కడం లేదని అంటారు.

సద్గురు: ఒకప్పుడు నేను రోజూ ఏదో ఒక పూట వంట చేసే వాడిని, ముఖ్యంగా మా అమ్మాయికి. ఆమె ఎప్పుడు ఇంట్లో ఉన్నా నేనే వండే వాడిని. కానీ ఈమధ్య ఉదయం పూట నియంత్రణ లేకుండా పోతున్నది. చెయ్యవలసిన పనులు చాలా ఉంటున్నాయి. అప్పటికీ నేను సాయంత్రం పూట వండడానికి ప్రయత్నిస్తుంటాను. అది కూడా ఈ మధ్య అరుదైపోతోంది.