ఢమరు - సౌండ్స్ ఆఫ్ ఈశా అందిస్తున్న సరికొత్త ఆల్బం
మొట్ట మొదటి యోగి అయిన ఆదియోగి వాయిద్య పరికరమే ఢమరు.. ఆయనే ఆది గురువు లేక మొదటి గురువు. గురు పూర్ణిమ రోజున శివుడు యోగ శాస్త్రాన్ని ఆయన శిష్యులైన సప్తఋషులకు అందించడం మొదలుపెట్టాడు అని యోగ కథనం చెబుతోంది.
"ఢమరు” సౌండ్స్ అఫ్ ఈశా అందిస్తున్న సరికొత్త ఆల్బమ్. మొట్టమొదటి యోగి అయిన ఆదియోగి శివునికి సంస్కృత స్తోత్రాలు ఇంకా పాటలతో కలగలిసిన సమర్పణే ఇది. ఈ “ఢమరు” మీలో ప్రతిధ్వనించి ప్రతీ సాధకుడిని ముక్తి మార్గం వైపు ప్రేరేపించాలని ఆశిస్తున్నాము.
1. ఆదియోగినమ్ ప్రణమామ్యహం
ఈ పాట ఆది యోగి, మొదటి యోగి, ఇంకా ఎవరైతే పంచభూతాలను జయించారో అటువంటి శివునికి వందనాన్ని సమర్పిస్తుంది. సప్తఋషులకు యోగ శాస్త్రాన్ని ప్రసరించిన మొదటి గురువుకి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము.
2. చంద్రశేఖర అష్టకం
ఈ అష్టకాన్ని మార్కండేయ మహర్షి రాసారని చెబుతారు. తన ఆరవ ఏటనే మృత్యువుకి అధిపతి అయిన యముడి నుండి శివుడు రక్షించాడని, మార్కండేయుడు శివుడిని “చంద్రశేఖర” అని స్తుతిస్తూ ఆశ్రయిస్తాడని చెబుతారు. “శివుడే నా వైపు ఉన్నప్పుడు, యముడేమి చేయగలడు” అని ప్రకటిస్తాడు.
3. గౌరాంగా..
శివుని వివిధ అంశాలను ఈ పాట కీర్తిస్తుంది. ఒక గొప్ప యోగి, ఎవరు అర్ధనారీశ్వరుడు అని పిలవబడతాడో, ఎవరికైతే సుందర శరీరం కలదో, ఎవరు డమరుని వాయిస్తారో అతనికి ఈ పాట అంకితం.
4. న హీ శివ స్నేహ..
యోగేశ్వర లింగ ప్రాణ ప్రతిష్టకు ముందు దీనిని సద్గురు స్వయంగా ఆంగ్లంలో రాసారు, వీటిని సంస్కృతంలో తర్జుమా చేయడం జరిగింది. దేనికైతే రూపం లేదో, ఏదైతే నిశ్చలమో, ఏది సంపూర్ణమో, ఏది దారి లేని అంతమో అటువంటి మర్మజ్ఞమైన ఆ రూపం లేని దివ్యత్వం గురించి వివరిస్తోంది.
5. గుర్వష్టకం
మనిషి జీవితంలో గురువు ప్రాముఖ్యతని ఎంతో గొప్పగా వివరిస్తుంది ఈ భారత సంస్కృతి. అదే నాగరికత సిద్ధాంతాన్ని ఈ గుర్వష్టకం చెబుతుంది. ఈ అష్టకంలో, ఆది శంకరులు మనుషుల గొప్పతనం, పేరు, ప్రఖ్యాతలు, అందం, ఆస్తి, జ్ఞానం, కుటుంబం వల్లనే అవి ఉండడంలోనే అని అనుకుంటారో వాటిని తుచ్చంగా పరిగణించి “ ఒకరి మనస్సు గురవు పాదాల చెంత లొంగకుంటే ఎన్ని ఉన్నా లాభమేమిటి..??” అని ప్రశ్నిస్తున్నారు.
6. ఉమా మహేశ్వర స్తోత్రం
యోగ సంస్కృతి జీవిత ద్వంద్వాలైన స్త్రీ – పురుష, సృష్టి – సృష్టికర్త, ప్రకృతీ పురుషులు, శివ – శక్తి ని గుర్తిస్తుంది. ఒక కోణంలో ఆది శంకరులు రాసిన ఉమా మహేశ్వర స్తోత్రం శివ పార్వతులకు నమస్కరిస్తూనే మరో కోణంలో సృష్టిలోని రెండు పార్శ్వాల గురించి చెబుతోంది.
7. పార్వతీ వల్లభ అష్టకం ( కొన్ని ఎంపిక చేసినవి)
పార్వతీ వల్లభుడైన శివుడిని ఈ శ్లోకం కీర్తిస్తుంది. శివుడిని ప్రస్తావిస్తూ చెప్పిన ఋషులు, వేదాల గురించి ఇంకా ఆయన అనుగ్రహ స్వరూపుడని, పిశాచాలకు కూడా అతనంటే ఇష్టమని అదే సమయంలో సుందర స్వరూపుడనీ వివిధ గుణాలను ఈ శ్లోకం చెబుతోంది. ఈ సృష్టిలోని అన్ని గుణాలు ఆయనవే అని, ఆయన అన్నిటినీ కలుపుకుపోయేటువంటి వాడని, సంపూర్ణ జీవితం అని వర్ణిస్తుంది.