సద్గురు: అందరికీ నమస్కారం. సద్గురు స్పాట్ కి సమయమైంది, కానీ తీరికలేని కార్యక్రమాల కారణంగా, ఇవాళ నేను కాస్తంత ఆలస్యంగా వచ్చాను. మాస్కోలో మరియు సెయింట్ పీటర్స బర్గ్ లో జరిగిన వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ కారణంగా నాకు నిజంగా విరామం లభించడమే కాకుండా మాస్కోలో అనేక కార్యక్రమాలు చేశాను. రష్యాలో మనం కొన్ని కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాము. ఎందుకంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆసక్తి మరియు నిబద్ధతను చూస్తుంటే, రష్యాలో మన కార్యకలాపం సహజంగా పెరుగుతుందని అనిపిస్తోంది. వాళ్ళ యొక్క బ్రహ్మాండమైన గ్రహణశీలత కారణంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాస్కోలో ఆగస్టు మొదటి వారంలో ఇండియా డేలో ఈశా సంస్కృతి పిల్లలు మరియు మ్యుజీషియన్స్ మరియు డేన్సర్స్ టీమ్ కూడా పాల్గొంటారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. గతంలో జరిగిన మూడు రోజుల కార్యక్రమంలో దాదాపుగా అయిదు లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. మాస్కోలో ఇంత పెద్ద సంఖ్యలో జనం పాల్గొనడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సారి మన పిల్లలు అక్కడికి వెళ్ళి ప్రదర్శనలో పాల్గొంటారు. టీచర్లు యోగాలోని వివిధ అంశాలను నేర్పిస్తారు. ఇక్కడి ప్రజల్లో చాలా ఉత్సుకత మరియు శక్తి ఉన్నాయి.

ఇక వరల్డ్ కప్ విషయానికొస్తే ఇది ఒక గొప్ప కార్యక్రమం. అనేక కారణాల రీత్యా ఈ సారి ఈ పోటీలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పోటీల్లో ప్రధాన టీమ్ లన్నీ ఓడిపోగా, ఫుట్ బాల్ లో మంచి పేరున్న ఆటగాళ్ళను పక్కకు నెట్టేసి కొత్త చాంపియన్లు మరియు హీరోలు ఆవిర్భవించారు. ఈ విధంగా నవ తరం యువ ఆటగాళ్ళు రావడం, వాళ్ళల్లో ఒక ఆటగాడు కేవలం పందొమ్మిదేళ్ళ ప్రాయంలో సూపర్ స్టార్ అవ్వడం ఈ పోటీల ప్రత్యేకత. నేను మీకు ఫుట్ బాల్ గురించి ఎందుకు చెబుతున్నానంటే, ఇది సద్గురు స్పాట్. మీకు తెలుసు ఫుట్ బాల్ లో స్పాట్ కిక్ అనే ముఖ్యమైన అంశం ఉందని. లక్ష్యాన్ని చేరుకోవడానికి స్పాట్ కిక్ చాలా మంచి అవకాశం. కాబట్టి స్పాట్ లో ఉండటం మనిషికి అత్యంత ముఖ్యం, అంటే నిర్ణీత సమయంలో భౌగోళికంగా కాకుండా, మీ అంతరాత్మలో మీరు ఎక్కడ ఉన్నారనేది కాకుండా, మీరు ఎక్కడ ఉండవలసిన అవసరం ఉందన్నది ముఖ్యం. నిర్ణీత సమయంలో మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి తీరాలి. మీ జీవితంలో నిర్దిష్ట పనిచేయాలంటే, ఏదైనా పొందగలగాలంటే మీరు తప్పకుండా స్పాట్ లో ఉండాలి. జీవితంలో సమయం మరియు లయ పరంగా ఇది అత్యంత ముఖ్యమైన అంశం.

ఇప్పుడు గురు పూర్ణిమ రాబోతోంది మరియు లక్ష్య సాధనం కోసం మీరు స్పాట్ లో ఉంటారనుకుంటున్నాను ఎందుకంటే జీవితం అనేది మీరు స్పాట్ కిక్ చేయడం లాంటిది. ఈసారి చాలా ఎక్కువ మంది ఉన్నప్పటికీ, ప్రత్యేకించి లయనెల్ మెస్సీ మరియు రోనాల్డో స్మిత్ లాంటి బాగా పేరు ప్రతిష్టలు ఉన్న గొప్ప ఆటగాళ్ళు స్పాట్ కిక్ చేయలేకపోయారు. ఇవాళ పెనాల్టీ కిక్ గా పిలవబడుతున్నప్పటికీ వాస్తవానికి గోల్ ముందు చేసే కిక్ కి అసలు పేరు ఇది. దీన్ని స్పాట్ కిక్ అంటారు, ఎందుకంటే మీరు స్పాట్ నుంచి కొడుతున్నారు కాబట్టి.

మున్ముందు ఎప్పుడైనా యుద్ధం జరిగితే విజేతలు మరియు పరాజితులు అంటూ ఎవ్వరూ ఉండరు.

మీరు సరైన స్పాట్ లో ఉండటమనేది ముఖ్య విషయమా? మీ లోపల మీరు ఎక్కడ ఉన్నారు? మీ జీవిత పరిస్థితి ఏమిటన్నది ముఖ్యం కాదు. మీ లోపల మీ విషయానికొస్తే మీరు స్పాట్ లో ఉన్నారా? ఈ ఒక్క విషయాన్ని మీరు మేనేజ్ చేయగలిగితే, జీవిత అనుగ్రహం మీ మార్గంలోకి వస్తుంది, మీకు ఏదీ నిరాకరించబడదు. రేపు గురుపూర్ణిమ, మీరందరూ స్పాట్లో ఉంటారనుకుంటున్నాను.

మన భద్రతా దళాల శక్తి అమోఘం

గత వారమంతా బిజీగా ఉన్నాను- నేను మాస్కో నుంచి తిరిగొచ్చిన వెంటనే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక కార్యక్రమం జరిగింది. వాయు సేన సభ్యులు మనతో మమేకమైన తీరు అద్భుతం. వాయు సేన సభ్యులకు సేవలందించడం మనకు దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. సరిహద్దు భద్రత దళంతో (బిఎస్ఎఫ్) కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. త్వరలోనే ఇండియన్ ఆర్మీతో కూడా క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి తీరుతాం. ఇప్పుడు వాయు సేనతో క్రియాశీలంగా ఉన్నాం. మరుసటి రోజు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుతో కూడా కార్యక్రమం నిర్వహించాం. టిబెట్ సరిహద్దుల్లో గల పర్వత ప్రాంతాల్లో దాదాపు 4000 కిలోమీటర్ల ప్రాంతానికి వీళ్ళు పహారా కాస్తున్నారు. ఇది 1962 తరువాత ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పోలీసు విభాగం. శారీరక ఫిట్ నెస్ పరంగా ఇది దేశంలోనే అత్యంత ఎక్కువగా ఫిట్ నెస్ గల విభాగమనే విషయం నేను ఇండో టిబెటన్ బోర్డరులో పర్యటించినప్పుడు గమనించాను. ఈ విభాగంలో ఉన్న స్త్రీ పురుషుల్లో అనేక మంది ఎవరెస్ట్ పర్వతం ఎక్కారు.

నాకు ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఐటిబిపి (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులో) లోని ఒక మహిళా అధికారి ఆక్సిజెన్ లేకుండా ఎవరెస్ట్ పర్వతం ఎక్కినట్లుగా నాకు గుర్తు. మేము ఐటిబిపితో కూడా మాట్లాడాము. సమీప భవిష్యత్తులో సమిష్టిగా ఏదైనా కార్యక్రమం జరపాలనుకుంటున్నాము. ఇది నిజంగా గొప్ప ఫోర్స్, చేరుకోలేని మరియు జీవించడం కష్టంగా ఉండే పర్వత ప్రాంతాల్లో సైతం వీళ్ళు పనిచేయగలుతున్నారంటే దీనికి కారణం ధైర్య సాహసాలు, అత్యున్నత క్రమశిక్షణ, ఫోకస్ మరియు ఫిట్ నెస్. కాబట్టి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చాలా మంచి కార్యక్రమం నిర్వహించాం, చాలా ముఖ్యమైన పరిణామం ఏమిటంటే మీలో అనేక మందికి బోలెడంత పని ఉందని అర్థం.... ప్రధాన మంత్రి అధ్యక్షతన హోమ్ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి మరియు మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు మరియు మహాత్మా గాంధీ కార్యక్రమాలను చేస్తున్న కొంతమంది ప్రముఖులతో కూడిన ఇరవై మంది సభ్యుల ప్యానల్ లో నన్ను కూడా నియమించారు. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీని మహాత్మా గాంధీ నూట యాభైయవ జయంతిగా జరుపుకుంటున్నందున ఈ ప్యానల్ ని ఏర్పాటు చేశారు. అహింసా మార్గంలో సమస్యలను పరిష్కరించిన గాంధీని తిరిగి శాంతిదూతగా మరియు ఆశాకిరణంగా తీసుకొచ్చేందుకు మనం ఏం చేయవచ్చో తెలుసుకునేందుకే ఈ ఇరవై మంది సభ్యుల ప్యానల్ ఏర్పాటు చేశారు.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఆయుధాలను పరిగణనలోకి తీసుకుంటే శాంతి మంత్రం జపించవలసిన ప్రాముఖ్యత నేడు చాలా ఉంది. మనం తగవులాడుకోకుండా శాంతియుతంగా జీవించవలసిన అవసరం ఉంది. మున్ముందు ఎప్పుడైనా యుద్ధం జరిగితే విజేతలు మరియు పరాజితులు అంటూ ఎవ్వరూ ఉండరు. వివిధ దేశాల్లో ఉన్న ఆయుధ సంపత్తి కారణంగా యుద్ధమంటూ జరిగితే ఆయా పక్షాలకు నష్టమే కలుగుతుంది. ఒక రకంగా ఇది మంచి విషయమే అనుకోవచ్చు, ఎందుకంటే ప్రశాంతంగా జీవించేందుకు మనం ముందుకు రాకపోతే, కనీసం ఆయుధాలైనా మనం ప్రశాంతంగా ఉండేలా చేయవచ్చు. ఇది మంచి పద్ధతి కాకపోయినప్పటికీ మరొక మార్గం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశాంత సంస్కృతిని ఎలా ప్రారంభించాలనే విషయం మేము చూస్తున్నాము. దీనికి అవసరమైన ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. శాంతిస్థాపన కోసం మనం ఏం చేయవచ్చనే విషయంలో నేను అక్కడ చేసిన ఈ సమర్పణలకు ప్రశంసలు రాగా, సవివరమైన సమర్పణలు సిద్ధమవుతున్నాయి. మేము మూడు విషయాలపై ద్రుష్టిపెడుతున్నాం. ఒకటి అహింస మరియు శాంతి. దీని కోసం మేము ప్రపంచవ్యాప్త ప్రచారం ప్రారంభిస్తాం. మరొక విషయం... మహాత్మాగాంధీ సహజమైన ఫైబర్ ని ఉత్పత్తిచేయడంపై ద్రుష్టిసారించారు కాబట్టి, మీలో భారతదేశ చరిత్ర తెలియని వారికి, ఈ తరంలో చాలా వేగం పెరిగిన కారణంగా, వాళ్ళు చారిత్రక సంఘటనలను మరియు మనం ఇప్పుడు ఇలా ఉండటానికి కారణమైన దాన్ని మరచిపోయారు.
 

మన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలి

ఒకప్పుడు భారతదేశ వస్త్ర ఎగుమతుల వాటా ప్రపంచంలో తొంభై శాతంగా ఉంది. వస్త్ర ఎగుమతుల్లో తొంభై శాతం భారతదేశం నుంచి వచ్చేవి. యూరప్ మరియు యుకెలో మరియు ఆసియాలోని ఇతర ప్రాంతాలతో పాటు ప్రపంచంలో ప్రతి రోజూ డిమాండు ఎక్కువగా ఉండేది. 1800 మరియు 1860 మధ్య అరవై సంవత్సరాల కాలంలో ఈ ఎగుమతులు తొంభై ఎనిమిది శాతం పడిపోయాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఖజానాకు ప్రయోజనం చేకూర్చుకునేందుకు, అనేక రకాల వస్త్రాన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థ మొత్తాన్ని పగడ్బందీగా నాశనం చేసింది. చేనేత కార్మికుల ఎముకలతో భారతదేశంలోని పీఠభూములు తెల్లబడ్డాయని, దీంతో చేనేతను క్రమపద్ధతిలో ధ్వంసం చేశామని వాళ్ళ గవర్నర్ జనరల్స్ లో ఒకరు తన రచనలో పేర్కొన్నారు. దీనివల్ల ఉపాధి కోల్పోయిన మిలియన్ల మంది ప్రజలు జీవించడానికి మరొక మార్గం లేక చనిపోయారు. నేటికీ దాదాపుగా 4.4 మిలియన్ ల మంది ప్రజలు ఈ రంగంలో పనిచేస్తున్నారు. భారతదేశంలో పదిహేను శాతం వస్త్రం మాత్రమే తయారుచేయబడుతున్నప్పటికీ భారతదేశంలో 4.4 మిలియన్ల కుటుంబాలు చేనేత పరిశ్రమల్లో పనిచేస్తుండటం బాధాకరం. వస్త్రాన్ని నేయగలిగిన స్థితిలో ఉండేందుకు శరీరం మరియు మెదడును వినియోగించవలసిన అవసరం ఉండే స్రుజనాత్మక యాక్టివిటిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించే అవకాశాలు ఈ రంగంలో చాలా ఉన్నాయి. ఈ రంగంలో భారతదేశం చాలా ప్రత్యేకమైనది.

మన దేశంలో ఇప్పటికీ దాదాపుగా నూట ఇరవై విలక్షణమైన నేతలు ఉండగా వీటిల్లో యాభై అయిదు నుంచి అరవై అంతర్దానమయ్యే స్థితిలో ఉన్నాయి. దీనికి కారణం ఆ పనులు చేస్తున్న వారిలో ఆఖరి తరం ఇది మరియు తదుపరి తరం అంతా కంప్యూటర్ సాఫ్ట్ వేర్ చేస్తున్నారు. కాబట్టి బహుశా పది పదిహేను సంవత్సరాల్లో దాదాపు యాభై నుంచి అరవై వీవ్స్, విలక్షణమైన వీవ్స్ అంతరించిపోవచ్చు. కనుక ఇప్పుడు మేము నేతను ఎలా వెనక్కి తీసుకురావాలి, దీన్ని ఎలా కాపాడాలి అనే విషయం మేము చూస్తున్నాము, ఎందుకంటే ఈ పనుల వెనుక క్రాఫ్ట్స్ మన్ షిప్ మరియు మేధస్సు గణనీయమైన మొత్తంలో ఉంటుంది. చాలా సేంద్రీయ మేధస్సుతో ఇవి దేశీయంగా రూపొందించబడ్డాయి. వీటిని భద్రపరచడం చాలా ముఖ్యం. అన్నిటికీ మించి ప్రస్తుతం మనం సింథటిక్ వైపు వెళుతున్నాం. భూమిపై ఉత్పత్తిచేసే మొత్తంలో తొంభై ఎనిమిది శాతం సింథెటిక్. దీనిలో దాదాపు తొంభై అయిదుశాతం నిజానికి పాలిమర్స్. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు. ప్రముఖ మూడు కాలుష్య పరిశ్రమలను మీరు తెలుసుకోవాలి- మొదటిది ఆయిల్ పరిశ్రమ, రెండోది వ్యవసాయం, మూడోది ఫ్యాషన్. మీరు ఈ విషయం ఆలోచించివుండరు ఎందుకంటే ఫ్యాషన్ పరిశ్రమలో ఫైబరుకు డైస్ ని అతికించేందుకు ఉపయోగించే కెమికల్స్ మరియు మోడరేట్స్ ని పెద్ద మొత్తంలో  ఉపయోగిస్తారు. అంతే కాదు పాలియెస్టర్ అతిపెద్ద కాలుష్యకారిణి. పాలియెస్టర్ మైక్రోఫైబర్లు మీ బట్టలు, గాలితో సహా ప్రతి చోటా ఉంటాయి.

సమాజంలో అనేక కేన్సర్లకు పాలియెస్టర్ దుస్తులు ప్రధాన కారణం అయివుండొచ్చునని మరియు మన పిల్లల జీవితాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తున్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

ఇవి మీ చర్మంలోకి, నీటి వ్యవస్థలోకి, మట్టిలోకి మరియు ఆహారంలోకి వెళతాయి, కాబట్టి మీరు భూమండలంపై మూడవ అతిపెద్ద కాలుష్యం అయిన పాలియెస్టర్ గల ప్లాస్టిక్ మెటీరియల్ ని తింటుంటారు. అందువల్ల భవిష్యత్తులో దీని స్థానంలో సహజమైన ఫైబర్ ని మార్చవలసిన అవసరం ఉంది. కాటన్, ఫ్లాక్స్, జ్యూట్, నెటిల్ లాంటి సహజమైన ఫైబర్ ని పెంపొందించవలసిన అవసరం ఉంది. భారతదేశంలో ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, కాబట్టి ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్న ఈ పరిశ్రమను పెద్దదిగా చేసేందుకు మేము ఒక ఉద్యమం ప్రారంభిస్తున్నాం. నేత పరిశ్రమను కాపాడేందుకు అక్టోబరులో న్యూయార్కులో రెండు ఫ్యాషన్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నాం. నన్ను ర్యాంపుపై చూసేందుకు సిద్ధంగా ఉండండి. దీన్ని ఎలా చేయబోతున్నామన్నది కాదు, కానీ ఫేషన్ ఫర్ పీస్ లేదా కాన్షస్ ఫ్యాషన్ గా పిలవబడే ఫ్యాషన్ కోసం మేము ఏదైనా చేస్తాం. త్వరలోనే రెండు ఈవెంట్స్ నిర్వహించబోతున్నాం. పాలియెస్టర్ దుస్తులు కలిగిస్తున్న పర్యావరణ మరియు ఆరోగ్య  అపాయాల కారణంగా ప్రపంచాన్ని సహజ ఫైబర్ వైపు మనం తీసుకెళ్ళవలసి ఉంది. పాలియెస్టర్ కలిగిస్తున్న అపాయాలు దురద్రుష్టవశాత్తూ అత్యధిక మంది ప్రజలకు తెలియడం లేదు.

సమాజంలో అనేక కేన్సర్లకు పాలియెస్టర్ దుస్తులు ప్రధాన కారణం అయివుండొచ్చునని మరియు మన పిల్లల జీవితాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తున్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అందువల్ల సహజమైన ఫైబర్ ని కనీసం భారతదేశంలోని స్కూలు పిల్లల యూనిఫామ్ కి ఎలా తీసుకురావాలా అని మేము చూస్తున్నాము. నేను చేసిన ఈ మొదటి సూచన అమలుజరుగుతుందని నేను అనుకుంటున్నాను. కేరళ ఇప్పటికే దీన్ని అమలుచేస్తుండగా భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా కనీసం ప్రభుత్వ స్కూళ్ళలో దీన్ని ప్రవేశపెడతాయనుకుంటున్నాను. ప్రైవేటు స్కూళ్ళలో కూడా దీన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మన పిల్లలు తప్పకుండా చాలా ఆరోగ్యకరమైన సహజ ఫైబర్ ని ధరించడం చాలా ముఖ్యం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా చేయవలసిన అవసరం ఉంది.

ఇది హ్యాండ్లూమ్ పరిశ్రమను కూడా తిరిగి తీసుకొస్తుంది. ఇది మార్కెట్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది మరియు స్కూలు యూనిఫామ్ లను వాపసు తీసుకొచ్చేందుకు తక్కువ స్థాయిలో మేము అవలంబించే రెండు మార్గాలు ఇవే. పెద్ద లేదా ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు సహజ ఫైబర్ ని పెద్ద స్థాయిలో చేపడితే, ఎక్కువ ఖరీదైన దుస్తులు ధరించేవారు దీన్ని ఎంచుకుంటారు. దీనివల్ల క్రాఫ్ట్స్మన్ కి అద్భుతమైన మార్కెట్ కల్పిస్తుంది మరియు ఇది భారతదేశం ఒక్కదానికే పరిమితం కాకుండా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నేత అయినా లేదా మెషీన్ తో నేచినా మనం ఆరోగ్యంగా మరియు కులాసాగా ఉండాలంటే అది తప్పకుండా సహజ ఫైబర్ అయివుండాలి. మరొక విషయం ఏమిటంటే మహాత్మా గాంధీ జీవితం ఎల్లప్పుడూ గ్రామీణ జీవితంతో ముడిపడి వుండేది. భారతదేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అని నమ్మిన ఆయన గ్రామీణ జీవితంపై దృష్టిపెట్టారు. కానీ దురద్రుష్టవశాత్తూ మనం ఈ విషయంపై దృష్టిసారించలేదు. గ్రామాల్లో జీవితాన్ని మనం నిజంగా అందంగా చేయలేదు. కాబట్టి ఆదర్శ గ్రామాలను ఎలా నెలకొల్పాలనే విషయం మేము ఆలోచిస్తున్నాం.

నదుల రక్షణ ఉద్యమం వేగంగా ముందుకు సాగుతోంది

అందరికీ విద్య అందించడం, అందరినీ ఏక తాటిపైకి తీసుకురావడంతో పాటు పోషణ, ఆరోగ్యం, ఫిట్ నెస్, ఆర్థిక కార్యకలాపాలు మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తూ ఆదర్శ గ్రామాన్ని ఎలా నెలకొల్పాలనే విషయంలో టెంప్లేట్ సృష్టించేందుకు గత నాలుగైదు నెలలుగా మేము పనిచేస్తున్నాము. దీనివల్ల గ్రామాల్లో జీవనం అద్భుతంగా ఉంటుంది. ఎవ్వరూ పట్టణాలకు, నగరాలకు వెళ్ళి మురికివాడల్లో జీవించడానికి ముందుకు రారు. ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచినందున మేము చేపట్టే వివిధ కార్యక్రమాలకు మీరంతా నాకు అండగా ఉండాలి. ఈ బృహత్తర కార్యక్రమాన్ని పూర్తిచేయడం గొప్ప మహద్భాగ్యంగా భావిస్తున్నాను. గత వారం జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటన ఒకటి నేను మీకు చెబుతాను. ర్యాలీ ఫర్ రివర్స్ బోర్డు మీటింగ్ నిర్వహించాము. మాది చాలా ప్రముఖ, గొప్ప ప్రతిభావంతులు, బోలెడంత అనుభవం ఉన్న పారిశ్రామికవేత్తలు, జీవితంలో విజయం సాధించినవారు, నీటిపారుదల రంగంలో బాగా అనుభవం గల వారు, రైతు సంఘాలు ఉన్న అద్భుతమైన బోర్డు. వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ సిఇఒ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మాజీ చైర్మన్ కూడా దీనిలో పాల్గొన్నారు.
నిజంగా, ఇది భారతదేశం సగర్వంగా ధరించగలిగిన బ్యాడ్జ్. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు తక్కువ నిధులతో ఎన్నో ఘన విజయాలు ధరించారు, చాలా తక్కువ ఖర్చుతో అంగారక యాత్ర కూడా చేపట్టారు. అనేక పెద్ద, ముఖ్యమైన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపినప్పుడు నేను అక్కడే ఉన్నాను.

ఇది నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. మన శాస్త్రవేత్తలు ఎంతో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఇస్రో సంస్థ చైర్ పర్సన్ గా పనిచేసిన వ్యక్తి ఇక్కడ ఉండటం నిజంగా మన అదృష్టం. దేశంలో ఆర్థిక కార్యకలాపాల ప్రణాళిక మరియు అమలు బాధ్యతలను చూసే నీతీ ఆయోగ్, మనం ర్యాలీ ఫర్ రివర్స్ డాక్యుమెంటులో చేసిన సిఫారసులను ఈశా ఫౌండేషన్ పేరుతో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అడ్వయిజరీ పంపింది. నదుల గురించి చేయవలసిన ప్రతి దానికీ ఇది దాదాపుగా అంబ్రెల్లా పాలసీ లాంటిది. బహిరంగ కాల్వలు లేకుండా పైపులు వేసేలా ప్రభుత్వానికి మేము నచ్చజెప్పగలిగాము. ఉష్టమండలమైన మన దేశానికి నదుల అనుసంధానం ఆచరణాత్మక పరిష్కారం కాదనే విషయం మేము రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా వరకు నచ్చచెప్పగలిగాము. మేము సూచించిన విషయాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో మేము కూడా కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాం.

మేము మహారాష్ట్రలోని ఒక ఉప నది నుంచి పైపుల గుండా వ్యవసాయానికి మరియు ఇతర రంగాలకు నీటిని అందించే పని ప్రారంభించాం. కావేరి నది పరివాహక ప్రాంతాల్లో మేము 25కోట్ల మొక్కలు కూడా నాటాము. కర్ణాటక మరియు తమిళనాడు ప్రజల మధ్య వివాదానికి కేంద్ర బిందువు కాబట్టి, మేము దీని సంరక్షణ చూడటం చాలా ముఖ్యం. అడవులు మరియు వ్యవసాయ భూముల కోసం దేశం మొత్తానికి మేము సవివరమైన ప్రాజెక్టు రిపోర్టులు కూడా తయారుచేస్తున్నాము. ప్రాథమికంగా ఏం చేయాలనే విషయంపై మేము టెంప్లేట్ని తయారుచేస్తున్నాము. మా టీమ్ చేస్తున్న ఈ పని పూర్తయితే వివిధ వివరాల్లోకి వెళ్ళి దీన్ని చాలా సులభంగా చేయవచ్చు.

ఇక్కడ మన వద్ద గొప్ప టీమ్ ఉంది- దేశ వ్యాప్తంగా దాదాపు వంద మంది యువకులకు ఇక్కడికి వచ్చారు. మూడు సంవత్సరాల పాటు వాళ్ళు నదులపై మాత్రమే దృష్టిపెడతారు. వీళ్ళలో అనేక మంది ఆకర్షణీయమైన ఉద్యోగాలు మానుకొని మూడేళ్ళ పాటు పూర్తి కాలం పనిచేసేందుకు ఇక్కడికి వచ్చారు. నదుల యొక్క పర్యావరణ సంబంధ వాస్తవాలు, నేల పరిస్థితులు, దేశంలో జరుగుతున్న వ్యవసాయం మరియు ఏ విధమైన పనులు లేదా జోక్యాలు అవసరం, ప్రభుత్వ పాలసీల గురించి తెలుసుకోవలసిన వివిధ అంశాల గురించి మేము వాళ్ళకు గత ఆరు నెలలుగా శిక్షణ ఇస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు సవివరమైన ప్రాజెక్టు రిపోర్టులు తయారుచేస్తున్నారు. యువకులు ఈ పని చేయడం నిజంగా అబ్బుపరుస్తోంది. దేశానికి అవసరమైంది ఇదే. గొప్ప అవకాశాలను కల్పించడానికి ప్రజలు బద్ధులై ఉన్నప్పుడు, వాళ్ళను ఎవ్వరూ ఆపలేరు. ఇవన్నీ దేశవ్యాప్తంగా నదుల ప్రాజెక్టుల కోసం చాలా విజయవంతమైన ర్యాలీకి దారితీస్తుందనే విశ్వాసం నాకు ఉంది.

ఇక్కడ మనం ఈశా యోగా కేంద్రంలో ఉన్నాం, దీన్ని మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, వర్షా కాలంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. దాదాపుగా తొమ్మిదేళ్ళ తరువాత మనకు వర్షాలు మామూలుగా కురుస్తున్నాయి. ఎనిమిది, తొమ్మిదేళ్ళకు ముందు నాలుగు నుంచి అయిదు నెలల పాటు వాతావరణం మబ్బుగా ఉండేది, ప్రతి రోజూ చినుకులు పడేవి. మరొకసారి మనకు ఆ పరిస్థితి వచ్చింది. ఏం జరిగినా కూడా, ప్రకృతి దయగా ఉండేది మరియు వాతావరణం నిజంగా అద్భుతంగా ఉంటోంది. రేపు గురు పూర్ణిమ. సుమారుగా 15,000 మంది పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇక్కడికి రాలేకపోతే, వెబ్ స్ట్రీమ్ లో లైవ్ చూడండి మరియు గురువు అనుగ్రహానికి అందుబాటులో ఉండండి. ఈ రోజున ఆదియోగి ఆదిగురుఉగా మారారు, ఇది మీ రోజు, స్పాట్ లో ఉండండి, మీరు మీ లక్ష్యాలను మిస్ అవ్వరు. రేపు గురు పూర్ణిమ, నేను మీతో ఉంటాను. మీకు ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారం.
 

ప్రేమాశీస్సులతో