ఈ వారం లేఖలో, సద్గురు తన మూడురోజుల "లాప్ అఫ్ ద మాస్టర్" సత్సంగం ఇంకా అమెరికాలోని ఈశా ఇన్ష్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ పర్యటన గురించి వివరించారు.

ఇక్కడ ఐఐఐ (ఈశా ఇన్ష్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్, టెన్నెసీ, అమెరికా) లో, రాత్రి ఉష్ణోగ్రతలు -10 ° C కన్నా తక్కువకు పడిపోతున్నాయి.  ఈ చలికాలం వల్ల వచ్చిన వెలితిని మా వాలంటీర్ల ఉత్సాహం, శక్తి పూడ్చింది. 1100 పైగా వాలంటీర్లు ఇక్కడ జరిగే 3 రోజుల సత్సంగ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈశా భాగ్యం ఏమంటే మనం ఎల్లపుడూ అత్యంత సజీవంగానూ, ఉత్సాహంగానూ  ఉండేవారిలో ఒకరం. తక్కువ ఉత్సాహంతో ఉన్న వాతావరణంలో నేను ఉండలేను, కానీ మన వాలంటీర్లు “దావాగ్నిలా” ఎప్పుడూ ఉత్సాహమైన పరిస్థితిని ఏర్పరుస్తారు. ఉత్సాహం లేని, జీవితం, అది ఏదైనా, నెమ్మదిగా చేసుకునే ఆత్మహత్య వంటిదే. నేను ఎప్పుడూ వేగం, దక్షత కలిగిన జీవితాన్నే కావాలనుకుంటాను,

 ఉత్సాహంలేని జీవితం నెమ్మదిగా చేసుకునే ఆత్మహత్య వంటిదే

ఒకవారం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో, తరువాత 2 రోజులు ఈశాయోగా సెంటర్ లో, ఆ తరువాత 2 రోజులు ముంబైలో, ఇప్పుడు ఇక్కడ ఐఐఐలో, ఆగకుండా ప్రయాణాలు, కార్యక్రమాలతో తుఫానులా సాగిన రెండువారాల తరువాత, ఇక్కడ ఐ ఐ ఐ లో కాస్త సమయం దొరికింది. అలా కూర్చుని లోయలు,దూరంగా ఉన్న కొండల అద్భుత దృశ్యాన్ని చూడగలుగుతున్నాను. నిరంతర పని వల్ల, ఇటువంటి భాగ్యాలు నాకు ఎన్నడో దూరమయ్యాయి. నాకు శ్వాస తీసుకొనే మధ్యలో దొరికే ఈ కొద్దిపాటి సమయంలో,  కొంచం కవిత్వ ఆకాంక్షలు గురించీ ఆలోచించాను. కేవలం మరొక్క రోజే,  మరలా ప్రయాణాలే .

గడచిన కొన్ని రోజుల్లో, ఈ "లాప్ ఆఫ్ ది మాస్టర్" కార్యక్రమంలో పాల్గొన్నవారు చాలా అద్భుతంగా ఉన్నారు. అన్నింటికీ మించి, చాలా మంది ఎంతో సామర్ధ్యం, తీవ్రతగల  నిజమైన సాధకులుగా మారుతున్నారు. వారితో కొంత సమయం గడపటానికి ఇదే సరైన అదను. అమెరికా ప్రజలలో ఆధ్యాత్మిక  సంస్కృతి నేపథ్యం లేన్నప్పటికీ, వారు గొప్ప అవకాశాలు కలవారిగా అధ్బుతంగా  మారుతున్నారు.

ఈ 2016 సంవత్సరంలో ఈశా అమెరికా వైపు ఎక్కువ దృష్టి పెట్టబోతోంది - ప్రత్యేకంగా అమెరికా కోసం ఉద్దేశించన  మొదటి పుస్తకం ఈ సెప్టెంబర్ లో వస్తోంది. ఇదే కాకుండ ఇక్కడ జరగబోయే అనేక కార్యక్రమాలు, అన్నింటికి మించి ఆ ఆదియోగి నిలయం ఉత్తర అమెరికాలోని ప్రజలపై తన ప్రభావం చూపించడం మొదలైంది.

ఇక మీరందరూ నా కవితా సాహసాల బాధకు లోనుకావాలి.

సద్గురు రాసిన కవిత(ఆంగ్లంలో):

Seasons of Slumber

Though the flowerless winter
makes the Sun sad, denied
of colourful reception. Still
chooses to shine bright as
he knows that he is the source
of the leaf and the flower.
Colour and colourlessness are
just features of the passing season
like the sweetness of life is devoid of reason.
Bare and cold only lie in preparation
for the bright and warm spring.
As leaf and flower shall spring
back from their seasonal slumber,
One who shines through the winter
shall for sure find flower and fruit.

The very bareness shall blossom.
Succumb not to seasons of slumber.

(తెలుగు అనువాదం)

 కునుకుతీసే కాలాలు

పూలు లేని చలి కాలం రవిని బాధ పెట్టినా,

రంగుల స్వాగతంతో రంజింప చేయకపోయినా,

తనే దిక్కు అనుకున్న ఆకులకై , పూవులకై,

తనకు తెలిసిన ఉజ్వల కాంతితోనే ఉంటాడు,

తానే పూల, దళాల మూలం కావున.

జీవితంలోని మాధుర్యం నిష్కారణంగా వచ్చి పోయేలాగా

వర్ణం  - వర్ణహీనతలు అనేవి వచ్చిపోవు కాలాల లక్షణాలే,

చలి, దిగంబరతలతో నున్న కాలంవెచ్చని కాంతి వసంతం కోసమే,

 నిదురించే ఋతువు నుండి చిగురు టాకులు, పూలు  వసంతంలో వచ్చినట్లే ,

చలికాలం  కృషిఫలితం  తప్పక దొరుకు సాధకునికి పూవు, పండుగా

                        ఆ దిగంబరతే చిగురించు, ఓడిపోకు కాలం కునుకుపాటుకు!

ప్రేమాశీస్సులతో,
సద్గురు