ఈ వారం సద్గురు న్యూయార్క మహానగరంనుండి ఇటీవలే ఉత్తర అమెరికాలో విడుదల చేసిన తన సరికొత్త పుస్తకం : "Inner Engineering: A Yogi’s Guide to Joy" అన్న పుస్తకం గురించి వివరిస్తారు.  ఆ పుస్తకం లక్ష్యమూ, అది అందించగల బలమూ, వారు ఇంతవరకు రాసిన పుస్తకాలన్నిటిలో ఈ పుస్తక ప్రాధాన్యత వివరిస్తారు. ఈ అంశంపైనే వచ్చిన అనేక పుస్తకాలతోబాటు, బైట దొరికే ఇతరపుస్తకాలకీ దీనికీ ఉన్న తేడాను గురించి విశదీకరిస్తారు. "ఇది ఒక బోధన కాదు. ఇది ఆధిభౌతిక పరిమితులకు అతీతమైన ఒక నూతన పరిమితిని మీకు పరిచయం చేస్తుంది."

Sadhguruఅధికారికంగా ఇన్నర్ ఇంజనీరింగ పుస్తకం విడుదలచేసిన రోజున, నేను న్యూయార్క లో ఉన్నాను. ఈ పుస్తకం గత 20 సంవత్సరాలుగా నా మనసులో మెదులుతోంది. ఇది ఈషా సమర్పణలలో మరొక అడుగు. ఇదంతా ముందుగా వేసుకున్న ఒక ప్రణాళికా క్రమం  ప్రకారం జరిగింది. మొదట 14 రోజులు ఈషా యోగా శిక్షణా శిబిరంతో, సమర్థవంతమైన స్వయంసేవకుల పునాది వేసుకోవడం జరిగింది. అదే ఈషా ఫౌండేషనుకి వెన్నెముకలాంటిది. అక్కడనుండి ఒక వారం రోజులు ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం, అదే కార్యక్రమం ఇంటర్ నెట్ ద్వారానూ నేర్పి, ఇపుడు ఈ పుస్తకము తీసుకురావడం ద్వారా, ఎవరి సమర్థతలనుబట్టి వారు అందుకోగలిగేలానూ, ఎక్కువమందికి ఈ విషయం అందుబాటులో ఉండడానికి అనువుగా తీసుకురావడమూ ఒక క్రమ ప్రణాళిక ప్రకారం జరిగింది. ఇన్నర్ ఇంజనీరింగ్ లో కొన్ని భాగాలని మొదటి సారిగా ఈ పుస్తకంలో చేర్చాము. ఇలా ఇంతకుముందు ఎన్నడూ చేయలేదు. ఈ పుస్తకమే ఒక శిక్షణా  కార్యక్రమంలా పనిచేస్తుంది. మా ఇతర పుస్తకాలన్నీ మీలో స్ఫూర్తిని కలిగిస్తే, ఈ పుస్తకం మీలో పరిణామాన్ని తీసుకురాగలదు.

నేను ఒక నెలరోజులపాటు, ఉత్తర అమెరికాలో  పెద్ద పెద్ద నగరాలలో, విశ్వవిద్యాలయాల్లో అనేక కార్యక్రమాలకై పర్యటిస్తున్నాను. సమయాభావం వల్ల అటువంటి సంచారయాత్ర మరొకసారి జరిగే అవకాశం లేదు. ప్రజలందరూ కార్యక్రమాలకై ఎన్నో ఆశలుపెట్టుకుని ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు, వాళ్ళు ఊహించనివి జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు అనుకోవచ్చు. ఏదీ ముందుగా ఇలా జరగాలని మేము ప్రణాళిక వేసుకో లేదు. ఏదీ ఖచ్చితంగా నిర్ణయించబడలేదు. కార్యక్రమాలకు హాజరయిన మనుషుల్ని చూసి ఏది చెయ్యాలన్నది నేను నిర్ణయిస్తాను. ఇది కేవలం పుస్తకావిష్కరణ గురించే కాదు. ఇది ఆ కార్యక్రమాలకు వచ్చిన ప్రతివాళ్ళకీ ఒక అనుభూతిని కలిగించే విషయం. పాశ్చాత్య పాఠకులనుద్దేశించి, ఇది నా మొదటి పుస్తకం. అక్కడి ప్రజలు ఈ పుస్తకాన్ని చదివి, నేను వాళ్ళ భాషలో, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ సంస్కృతి దృష్టిలోనుంచుకుని మాటాడడం విన్నపుడు, వాళ్ళు అందులోని విషయంతో వెంటనే ఏకీభవించడానికి అవకాశం ఉంది. అప్పుడే అది ఆశించిన మార్పు తీసుకురాగలదు. ఈ పుస్తక యాత్రలో ముఖ్యోద్దేశము ఏమిటంటే,  అమెరికాలోని వారందరిని వీలైనంతవరకు స్ప్రుశించాలని. అమెరికా గనుక ఈ అంతర్ముఖం వైపు దృష్టి మళ్లిస్తే, మిగతా ప్రపంచమంతా కూడా అమెరికాని అనుసరిస్తుంది.

ఇది ఏ ధార్మిక గ్రంధము మీదగాని, మతం మీదగాని, తాత్త్విక చింతన మీదగాని ఆధారపడి రాసినది కాదు. ఇది నా జీవితానుభవంలోంచి వచ్చింది, అందువల్ల ఇదొక ప్రత్యేక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది.

బజారులో లభించే వ్యక్తిత్వ వికాస పుస్తకాలకంటే, ఇతర భారతీయ ఆధ్యాత్మిక గురువుల పుస్తకాలకంటే - విషయాల్లోనూ, వాటిని వివరించిన తీరులోనూ ఈ పుస్తకం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఏ ధార్మిక గ్రంధము మీదగాని, మతం మీదగాని, తాత్త్విక చింతన మీదగాని ఆధారపడి రాసినది కాదు. ఇది నా జీవితానుభవంలోంచి వచ్చింది, అందువల్ల ఇదొక ప్రత్యేక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక సంస్కృతినుండో, ఒక సంప్రదాయంనుండో కాకుండా అంతర్ముకంలోనుంచి  రావడం వలన దానితో ఎవరైనా మమేకమవవచ్చు. ఇది కేవలం తూర్పు దేశాలకు గాని, కేవలం పశ్చాత్య దేశాలకో చెందిన తాత్త్విక చింతన కాదు. ఇది ప్రతివ్యక్తీ శోధించవలసిన అంతరంగ పరిమితి. ఇది దేవుడి గురించి కాదు. ఇది మిమ్మల్ని ఎందులోకో మార్చే ప్రయత్నమూ కాదు. ఇది నిజంగా మీరు ఏమిటో అన్నది మీకు తెలియ చెప్పేది. ఈ క్షణంలో మీరు, మీ జాతీయత, మతం, జాతి, స్త్రీ, పురుషుల వంటి ప్రత్యేకతల సమాహారం ద్వారా "మీరు" అన్న అస్తిత్వాన్ని ఊహించుకుంటున్నారు. కాని, మౌలికంగా "మీరు"  ఒక "ప్రాణి". మీలో జీవం ఉంది. కానీ, మీరు దాన్నెప్పుడూ అనుభూతిచెంది ఉండకపోవచ్చు. నా పని మీరు తిరిగి ఆ పరిపూర్ణమైన "ప్రాణి" గా మారేటట్టు సహకరించడమే.

అమెరికా అనగానే పాలూ, తేనే పుష్కలంగా లభించే దేశంగా ప్రతీతి. పాలూ, తేనె ఈ రెండూ మితంగా తీసుకున్నపుడు మాత్రమే ఒంటికి మంచిది, కానీ వాటిలో మునకలేసినపుడు కాదు. ఆనందాన్వేషణ అమెరికా రాజ్యాంగంలో ప్రతిష్ఠించబడింది. ఈ అన్వేషణస్థాయి ఇప్ప్పుడు ఎక్కువలో ఉన్నప్పటికీ, ఎక్కడ వెతకాలన్నది  తెలీకుండా చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా అమెరికాలోని జీవితం లాంటి జేవితం కావాలని కలగంటోంది. ఈ కల వినాశకరమైనది. ట్రావెల్లింగ్ ప్లానెట్ నివేదిక ప్రకారం, ప్రపచంలోని 7.2 బిల్లియన్ల జనాభా అంతా ఓ సాధారణ అమెరికనులాగే జీవితం గడపదలుచుకుంటే, మన అవసరాలు తీరడానికి తగిన వనరులున్న భూమివంటి గ్రహాలు ఒకటి కాదు, 4 కావలసి వస్తుంది. కానీ మనకి అందుబాటులో మిగిలి ఉన్నది "భూమి" లో సగం మాత్రమే. ఒక సమాజం బాహ్యప్రకృతిని నియంత్రించడం ద్వారా అన్నీ చక్కబడతాయన్న విశ్వాసం ఆధారంగా తన జీవితాన్నీ, తన లక్ష్యాలనీ నిర్ణయించుకోవడం వలన కలిగిన సహజ పరిణామం.

మనం బాహ్య ప్రకృతిని సాధ్యమైనంతవరకు మనకి అనుకూలంగా చక్కదిద్దుకోగలిగాము. ఇక చెయ్యవలసినదల్లా... మన అంతరంగాన్ని చక్కదిద్దుకోచడమే.

మనిషి సంక్షేమాన్ని కేవలం బాహ్య ప్రకృతిని చక్కదిద్దినంత మాత్రంచేత సాధించలేమన్న విషయం గుర్తించవలసిన సమయం ఆసన్నమయింది. మీరు ఏ.సీ. రూములో కూర్చున్నప్పటికీ, లోపల కుతకుత ఉడికిపోతుండవచ్చు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశమైన అమెరికాలాంటి దేశంలో ప్రజలు దేనికీ భయం లేకుండా,  స్వేఛ్ఛగా ఉంటారని మీరు ఆశించడం సహజం. దురదృష్టవశాత్తూ, వాస్తవం అలా లేదు. ప్రజలు అనుభవిస్తున్నది కేవలం రాజకీయస్వేఛ్ఛనే. కానీ ప్రజల అంతరాంతరాల్లో భయం, బాధా వేళ్ళూనుకుని ఉన్నాయి. వాళ్ళు కావాలని కలలుగన్న కార్లు నడుపుకుంటూ పోతూ ఉండవచ్చు, కానీ, వాళెప్పుడూ ముళ్ళ మీద కూచున్నట్టు ఉంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా వాళ్ల సమతుల్యం దెబ్బతింటుంది. ఇది అమెరికాలోనే కాదు, సంపన్నులందరి విషయంలోనూ యదార్థమే. అందుకనే "ఇన్నర్ ఇంజనీరింగ్”, ఈ సందర్భంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. మీరు మీ అంతరంగాన్ని చక్కదిద్దుకున్నపుడే, మీరు భౌతికంగా సంపాదించుకున్న సౌఖ్యాలనన్నిటినీ అనుభవించి ఆనందించగలరు.

మనం బాహ్య ప్రకృతిని సాధ్యమైనంతవరకు మనకి అనుకూలంగా చక్కదిద్దుకోగలిగాము. ఇక చెయ్యవలసినదల్లా... మన అంతరంగాన్ని చక్కదిద్దుకోచడమే. బాహ్యప్రపంచాన్ని మార్చడానికి చాలా సమయం పడుతుంది... కానీ అంతరంగాన్ని మార్చడానికి ఒక క్షణం చాలు. మనకి కావలసిందల్లా మారాలన్న గాఢమైన ఆకాంక్ష. ఇది బోధన కాదు. ఇది మీ భౌతిక పరిమితులకు అతీతమైన ఒక పరిమితిని మీకు పరిచయం చెయ్యడం. ఇప్పటివరకు, మీ జీవితానుభవమంతా మీ అస్తిత్వపు భౌతిక అవసరాలకి పరిమితమై ఉంది. మీ భౌతిక అవసరాలకి చెందిన అన్ని వస్తువులూ మీరు సమకూర్చుకోగలిగారు. ఈ భూప్రపంచం మీద 99 శాతం మనుషులకి వాళ్ల జీవితమంతా వాళ్ళు సంపాదించుకున్న వస్తువుల చుట్టూ తిరుగుతుంది. ఆ వస్తువు ఒక పురుషుడో, ఒక స్త్రీయో, సౌష్ఠవమైన మీ శరీరమో, మీ ఇల్లో, మీ విద్యార్హతలో, మీ సంపదో ... మరొకటో మరొకటో కావచ్చు. మీరు ఏది సంపాదించినా, సమకూర్చుకున్నా అది మీ వస్తువు అవుతుంది తప్ప "మీరు" కాలేదు. ఈ ఒక్క సత్యం మీరు తెలుసుకుంటే, అది మిమ్మల్ని సమూలంగా మారుస్తుంది.

రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో బలీయమైనదేదో ఒకటి చేసి, మనుషుల వివేకాన్నీ, చైతన్యాన్నీ సరియైన మార్గంలోకి మళ్ళించలేకపొతే, 95 శాతం ప్రపంచ జనాభా మత్తుపదార్థాలకీ, మాదకద్రవ్యాలకీ బానిస అయిపోతుంది.

ఈ సమయంలో, దురదృష్టవశాత్తూ, అమెరికా జీవ-వ్యతిరేక కార్యకలాపాలకి ప్రేరణగా ఉంది. అమెరికా అంటే ప్రపంచం అంతా ఎంతో అట్టహాసంగా ఉంటుందని ఊహిస్తుంటారు. అమెరికా ఇపుడు మంచి కార్యక్రమాలు చేపట్టడానికి నాయకత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నాను. అపుడు ప్రపంచం అంతా మంచిపనులు చెయ్యడం ప్రారంభిస్తుంది. మనమందరమూ ఈ ప్రపంచానికి రెండు విషయాలు ఏదోరకంగా ఋణపడి ఉన్నాము. మొదటిది మనం మరణించేటపుడు ఈ ప్రపంచం మనం చూసినదానికంటే మెరుగైనదిగా విడిచిపెట్టడం. ఈ విషయంలో మనం ఘోరంగా విఫలం అవుతున్నాము.  పర్యావరణానికి ఇప్పటికే చాలా తీవ్రమైన హానిచెయ్యడం జరిగిపోయింది. మన జీవితకాలంలో దాన్ని సరిదిద్దలేము. కానీ, ఆ దిశలో పనిచెయ్యడం మాత్రం ప్రారంభించవచ్చు. రెండవది, మన తర్వాతి తరాన్ని మనకంటే మెరుగైనదిగా తీర్చిదిద్దిడం. రాబోయే పది పదుహేను సంవత్సరాల్లో ఆ లక్ష్య సాధన దిశలో తీవ్రమైన కృషి చెయ్యకపోతే, ఈ విషయంలో కూడా మనం విఫలమవుతాము.

ఒక టీవీ కార్యక్రమాన్ని గానీ, ఒక నాటకాన్ని గాని, సినిమాని గాని చూడకుండా, ప్రక్కన స్నేహితులుగాని, మత్తు పానీయంగాని లేకుండా  ఈ న్యూయార్క మహానగరంలో ఎంతమంది అమెరికన్లు ఒంటరిగా నిశ్చింతగా, ప్రశాంతంగా కూర్చోగలరు? బహుశా 95 శాతానికి తక్కువలేకుండా అమెరికనులు మనశ్శాంతిగా ఉండడానికి ఏదో ఒక రసాయనిక పదార్థం వాడుతున్నారు. మీరు ఆనందంగా ఉండాలంటే అంతకంటే ఎక్కువ మొతాదులో మరేదో కావాలి. బ్రహ్మానందం సాధించడానికి అన్నిటికంటే బలమైనదేదో మరొకటేదో  కావాలి. ఇది చాలా శోచనీయమైన విషయం. రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో బలీయమైనదేదో ఒకటి చేసి, మనుషుల వివేకాన్నీ, చైతన్యాన్నీ సరియైన మార్గంలోకి మళ్ళించలేకపొతే, 95 శాతం ప్రపంచ జనాభా మత్తుపదార్థాలకీ, మాదకద్రవ్యాలకీ బానిస అయిపోతుంది. మనుషులకి జీవితంలో ఆనందాన్నిచ్చే అనుభవాల్ని వెదుక్కోవడం, వాటిని ఎలాగోలా పెంచుకుంటూ పోవడానికి ప్రయత్నించడం పకృతిసిద్ధమైన కోరిక. వాళ్ళకి వాళ్ళ అంతరంగాల్ని మార్చుకోగల అవకాశం మనం ఇవ్వకపోతే, బయటినుండి సులభంగా దొరికే  మాదకద్రవ్యాలవంటి పరిష్కారాలకి లొంగిపోతారు.  మనం మార్చదలుచుకున్నది దీనినే.

మనుషులు ఏ కారణం అవసరం లేకుండానే ఆనందంగా ఉండడమెలాగో నేర్చుకోవాలి. ఈ పుస్తకం నాగురించి కాదు. ఈషా గురించీ కాదు. ఇది మానవజాతికంతటికీ జరగవలసిన మార్పు గురింఛి. అది మతాలకి అతీతంగా, మనుషుల్ని విడదీయకుండా, వ్యక్తులకి ఏ రకమైన నేపథ్యమూ, నైపుణ్యాలూ అవసరం లేకుండా ఒక పరివర్తనాత్మకమైన పద్ధతిద్వారా జరగాలి. ప్రతి వ్యక్తీ దానిని అనుసరించడం ద్వారా, తనలోనూ, ప్రపంచంలోనూ మార్పు తీసుకురాగలిగిన సమర్థతనిచ్చేదై ఉండాలి.అమెరికా ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ పుస్తకానికి అనూహ్యమైన ప్రతిస్పందన వస్తోంది. అమెరికా అంతటా జరగబోయే అన్ని కార్యక్రమాలకీ టిక్కెట్లు ముందుగానే అమ్ముడయిపోయాయి. ఈ కార్యక్రమాలకి హాజరు కాలేని వాళ్ళు ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. అది ఒక రకంగా నన్ను మీ ఇంట్లో పెట్టుకోవడమే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

Read in English: Click Here