ఆకాశం - గొప్ప మేధస్సు

జీవితంలోని ప్రతి మలుపులోనూ మీకు ఎదురు దెబ్బ తగులుతున్నట్టు మీరెప్పుడైనా అనుకున్నారా? కొంతమందికి జీవితం ఎర్ర తివాచి వేసిందని భావిస్తున్నారా? సద్గురు ఆకాశ మేధస్సు గురించి, దానికి మన జీవితంపై ఉన్న పాత్ర గురించి వివరిస్తున్నారు.
 

సద్గురు : మనిషి ఉత్తమ అవకాశాలను అందుకోవడానికి నీరు, గాలి, భూమి,అగ్ని, ఇంకా ఆకాశం మనిషి పోషణలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇందులో అయిదవది అయిన ఆకాశం అన్నిటికన్నా విశాలమైనది. ఆకాశం ప్రధాన మూలకం, దీనిని అయిదవదిగా పరిగణించడం సరి కాదు, మిగిలిన నాలుగు దీనిపైనే ఆధారపడిఉన్నాయి.

ఈ రోజు ఆధునిక విజ్ఞ్యానం ఆకాశ జ్ఞానం అనేది ఉందని గుర్తించారు. శూన్యానికి ఒక రకమైన జ్ఞ్యానం ఉంది. ఈ జ్ఞ్యానం మీకోసం పనిచేస్తుందా లేక మీకు వ్యతిరేకంగా పనిచేస్తుందా అన్నదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీరు కృపతో నిండిన జీవితం అనుభవిస్తారా లేక నిరంతరం ఒడిదుడుకులకు గురవుతారా అన్నది కూడా ఇదే నిర్ణయిస్తుంది. ఏ కారణము లేకుండా కొంతమంది జీవితాంతం ఎదురుదెబ్బలు తింటున్నట్టు కనిపిస్తుంటారు, అవునా? ఏ కారణము లేకుండా కొంతమందికి అన్నీ సమకూరినట్టు కనిపిస్తుంది. ఇది కారణం లేక కాదు. మీరు ఈ జ్ఞ్యానాన్ని వాడుకుని అందులోనుండి సహకారాన్ని పొందడం అన్నది మీ సామర్ధ్యత - ఇది స్పృహతోనైనా జరగవచ్చు లేక స్పృహ లేక నైనా జరగవచ్చు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1