ధ్యానలింగం ఆలయంలో మూడు పెద్ద పెద్ద రాతి మెట్లు ఎక్కాక, మీరు ప్రవేశం ముందుకు వస్తారు. అక్కడ ఎడమ పక్కన, ఆధునిక యోగాకి మూలపురుషుడిగా పేరుపొందిన, యోగ సూత్రాల రచయిత, పతంజలి విగ్రహం కనపడుతుంది. ఈ పదకొండు అడుగుల శిల్పం నల్లరాతితో చెక్కబడింది. ఆ శిల్పం పాము, మనుషుల కలబోత. అది జీవితం యొక్క ద్వందత్వం ప్రతీకగా, మనిషియొక్క దివ్యత్వం, భూతత్వం నుంచి మనిషి దివ్యత్వానికి ఎదిగే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏడు పడగల పాము శిల్పం తలనుంచి పైకి లేస్తున్న ఏడు అడుగుల పాము, యోగా యొక్క లక్షణమైన ఏడు చక్రాల ద్వారా శక్తులు పైకి లేవటానికి ప్రతీకగా ఉంటుంది. కుడి పక్కన ధ్యాన లింగం యొక్క దేవి దివ్యత్వానికి ప్రతీకగా ‘వనశ్రీ’ మందిరం, పతంజలికి ఎదురుగా ఉంటుంది. ఈ వనశ్రీ ఫలకం ఆకుపచ్చ గ్రానైట్ తో చేయబడింది. అది ఒక రావి చెట్టు లాగా చెక్కబడింది. ఆ శిల్పం మధ్యలో ఉన్న బంగారు ఆకు ఆత్మీయత, సౌభాగ్యానికి ప్రతీకగా ఉంటుంది. ఈ దేవత శక్తులు ఎలాంటివి అంటే, ముఖ్యంగా ఆడవారికి పిల్లలకు దాని దగ్గర ధ్యానం చేయటం ఉపయోగకరంగా ఉంటుంది. సంప్రదాయంగా ఉండే ‘కీర్తి ముఖ’, దివ్యమైన ముఖం ‘వనశ్రీ’ పైన కనబడుతుంది.