సద్గురు: మా తల్లి అద్భుతమైన గాయని, ఆమె వీణ కూడా వాయించేవారు. ఆమె ఎప్పుడూ ఏదో పాడుతూనే ఉండేది. ఆమె దాచుకునే మనిషి కాదు, అలా అని, ఏ విధంగానూ తనను తాను అలా ప్రకటించుకోలేదు. ఎవరైనా, ఎప్పుడైనా ‘‘ఓ పాట పాడతారా?’’ అంటే మాత్రం, వెంటనే మీరు ఆమె గానం వినవచ్చు. భారత దేశంలో, టేప్ రికార్డర్, సిడి ప్లేయర్ రాకముందు, ఇది మామూలు విషయమే. ఎవరైనా పాడగలరు అంటే అది గొప్ప విషయమే. అందుకే ఎవరు అయినా అడగగానే, ఒక్క క్షణం కూడా సందేహించకుండా ఆమె పడేది. ఎవరైనా వినాలనుకుంటే, ఆమె పాడేసేది, ఎవరూ లేకపోయినా సరే ఆమె ఎప్పుడు వాడుతూనే ఉండేది.