కర్ఱాటక పులిహోర

 

కావాల్సినపదార్థాలు:

చింతపండు - పెద్దనిమ్మకాయంత

ఎండుమిర్చి - 5

మెంతులు - 1/4 టీస్పూను

దాల్చినచెక్క - 1చిన్నముక్క

ధనియాలు - 1 టేబుల్స్పూను

జీలకర్ర- అరటీస్పూను

మిరియాలు - 1 టీస్పూను

తెల్లనువ్వులు - అరటీస్పూను

వేరుశనగగింజలు - 50గ్రా.

కొబ్బరికోరు - 1కప్పు

బియ్యం - 2 గ్లాసులు

ఉప్పు - తగినంత

మంచినూనె - 4టీస్పూనులు

బెల్లంకోరు - 25గ్రాములు

కరివేపాకు - కొంచెం

తాలింపు - ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, శనగపప్పు, ఎండుమిర్చి(2)

చేసేవిధానం:

- చింతపండు నీళ్ళల్లో నానపెట్టి చిక్కటి పులుసు తీసుకోవాలి. బియ్యం కడిగి 4 గ్లాసులు నీరు పోసి కుక్కర్లో వండు కోవాలి. అన్నం పొడిగా వుండాలి.

- ఒక బాణలిలో మెంతులు, దాల్చిన చెక్క మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు కూడా వేయించుకుని పొడి చేసుకోవాలి.

- ఇప్పుడు బాణలిలో చింతపండు రసం, మనం తయారు చేసిపెట్టుకున్న పొడి కలిపి బాగా ఉడికించాలి. అందులో 1 టీస్పూను నూనె ఉప్పు వేసి సిమ్లో వుంచాలి. బెల్లం కూడా కలిపి మగ్గించి దింపుకోవాలి. మిగిలిన నూనెలో తాలింపువేసి వేరుశనగ గింజలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపు చింతపండు పులుసులో వేయాలి.

- ఇంకో బాణలిలో నూనె వేసి తెల్ల నువ్వులు, కొబ్బరి కోరు వేయించాలి(విడివిడిగా). ఇది కూడా చింతపండు పులుసులో వేయాలి. ఒక పెద్ద పళ్ళెంలో అన్నం ఆరపెట్టి కొద్దికొద్దిగా ఈ పులుసు కలుపుకోవాలి. రుచికరమైన కర్ణాటక పులిహోర రెడీ. (కొబ్బరి, నువ్వులు వెయ్యకుండా వుంటే ఈ పులుసు చాలా రోజులు నిలవ వుంటుంది.)

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1