Sadhguruమీలో ఎంతోకొంత సున్నితత్వం ఉంటే తప్ప మీరు దీనినీ గమనించ లేకపోవచ్చు, కానీ అంతకముందు చేసినవాటన్నిటికంటే ఖచ్చితంగా ఈ ప్రాణప్రతిష్ఠ విభిన్నంగా ఉండబోతుంది, ఒకవేళ ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ మీరు చూసి ఉంటే తప్ప. ధ్యానలింగ ప్రాణప్రతిష్ఠ కూడా దీని లాగానే ఉన్నా, అది దీనికంటే మరింత సంక్లిష్టమైనది. దానితో పోలిస్తే ఈ ప్రాణప్రతిష్ఠ చాలా సరళమైనది, కానీ ఇది ధ్యానలింగంతో పోలి ఉంటుంది.

dhyanalinga_ver_linga7

ఎందుకంటే, ధ్యానలింగా కూడా ముక్తి కోసమే కేంద్రీకృతమైనది. అది మాత్రమే కాదు, ఇప్పుడిక్కడ 112 అడుగులఎత్తైన, భూమ్మీద అతి పెద్దదైన, కీర్తివంతమైన, ముక్తికి చిహ్నమైన ఆదియోగి ముఖం  స్థాపించబడుతోంది. ప్రపంచమంతటినీ ముక్తి మార్గంలో నడిపించేందుకు ఆదియోగి ముఖాన్ని ఒక సాపేక్ష సాన్నిధ్యం గా మేము వినియోగించదలచుకున్నాం.

మీరు అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మామూలుగా చాలా మంది ముక్తి కోసమే తపిస్తున్నప్పటికీ , తమంతట తామే రకరకాల బంధనాల్లో చిక్కుకుపోతున్నారు. ఏదో ఒకదానితో ముడిపడి ఉండటంలోనే క్షేమం ఉంది అన్న మానసిక స్థితి వల్లో, సమాజంలోని వారు ఇలా ప్రభావితం చేయడం వల్లనో, ఇలా జరుగుతుంది. మేము ప్రపంచంలో దీనిని మార్చాలనుకుంటున్నాం. క్షేమం అనేది బంధనల వలన కలగదు, మీరు స్వేచ్ఛగా ఉన్నప్పుడే  క్షేమంగా ఉండగలిగేది. కానీ, భీతి చెందే మనసుకు, స్వేచ్చ భయంకరంగా కనిపిస్తుంది, “నేను దేనిని పట్టుకుని ఉండాలి” అన్నది ప్రశ్న. మీకు స్థిరత్వం లేనప్పుడే దేనినైనా పట్టుకోవలసిన అవసరం వస్తుంది. మీలో స్థిరత్వం ఉన్నప్పుడు, మీకు దేన్నీ పట్టుకోవాలని అనిపించదు. చురుకుగా ఉన్నవారు గోడల సహాయంతో నడవరు. స్థిరత్వం లేని వారు మాత్రమే  గోడలను పట్టుకుని నడుస్తారు. చురుకైన, నిలకడతో నిండిన, స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ప్రజల మనస్సులో,  ఏదో ఒక దాన్నిపట్టుకోవాలన్న ఆలోచనే తలెత్తదు. దేనినైనా పట్టుకోవాల్సిన అవసరాన్ని, బంధనాలు ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని మీరు అధిగమిస్తే, మీ సహజమైన ఆకాంక్ష ముక్తి కావాలనే.

గొప్ప ముఖం అని ఎందుకన్నానంటే ముక్తి సాధనకు తపించే సాధకులకు ఇది ఒక గొప్ప అవకాశానికి తలుపు తెరుస్తుంది.

మనం భవిష్యత్తు కొసం సంసిద్ధమవుతున్నాం. రాబోయే దశాబ్దాలలో, మనలో నిర్మించుకుని, మనం పట్టుకు వేళ్ళాడుతున్న ఎన్నో పాత అవరోధాలు కూలిపోతున్న కొద్దీ, మనలో ముక్తి కొసం తపన కలగడాన్ని మీరు చూస్తారు. ఈ తపన పెరిగి , ముక్తికోసం కృషి  చేసేవారికి ఆదియోగి ఇంకా యోగేశ్వర లింగం ఎంతో ముఖ్యమైన సాధనాలు అవుతాయి. దీనికొసం ఎన్నో విధానాలు ఉండి ఉండవచ్చు, కానీ ఈ సారూప సాన్నిధ్యాన్ని - ప్రపంచంలోకెల్లా పెద్దదైన, ఈ గొప్ప  ముఖాన్ని ప్రజలు విస్మరించలేరు.  నేను దీని గురించి గొప్ప ముఖం అని చెప్పినప్పుడు వేరే దేనితోనూ దీనినీ పోల్చటం లేదు. గొప్ప ముఖం అని ఎందుకన్నానంటే ముక్తి సాధనకు తపించే సాధకులకు ఇది ఒక గొప్ప అవకాశానికి తలుపు తెరుస్తుంది. ఇది దేని నుంచైనా ముక్తిని కల్పిస్తుంది. మిమ్మల్ని బంధిస్తున్న దేనినుంచైనా సరే, మీకు ముక్తిని కల్పిస్తుంది. ఈ లింగానికి  సహజ గుణమే ముక్తిని ప్రసాదించటం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు