యక్షా మహోత్సవం - 2017

 

వేల సంవత్సరాల నుండీ భారతావనిలో వికసించిన ఈ కళా రూపాలు ఈ దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబించడమే కాక ఆధ్యాత్మిక ప్రేరణకూ ఆలవాలాలు. అవి ఈ దేశాన్ని తరతరాలుగా సుసంపన్నం చేసాయి, కాని ఎంతో వేగంగా మన జీవనగతిలో మరుగునపడి పోతున్నాయి.

వాటిని కాపాడి వాటి ప్రత్యేకతను, స్వచ్ఛతను, వైవిధ్యాన్ని ప్రోత్సహంచే ప్రయత్నంలో భాగంగా పేరొందిన కళాకారులచే ఈశా ఫౌండేషన్ మూడురోజుల సాంస్కృతిక, సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

భారతీయ పురాణాల్లోని దివ్య జీవుల పేరుమీద జరుపబడే ‘యక్ష’ గొప్ప కళాకారులు ప్రదర్శించేందుకూ, ఈ నిష్ణాతులు ప్రదర్శించే ప్రాచీన కళలను రసఙ్ఞులు ఆస్వాదంచేందుకూ వేదికగా ఉంది.

మీరు ఈ మహత్తరమైన, పురాతనమైన భారతీయ సంస్కృతిలో ఓలలాడడానికి, మహదానుభూతిని పొందడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

యక్ష 2017

కళాకారులు

ఫిబ్రవరి 21

డా. మైసూర్ మంజునాథ్ &  మైసూర్ నాగరాజ్

(వయొలిన్ యుగళం)

ఫిబ్రవరి 22

పద్మశ్రీ. మీనాక్షీ చిత్తరంజన్

(భరత నాట్యం)

ఫిబ్రవరి 23

శ్రీమతి. బిజయిని సత్పతి & శ్రీమతి. సురూప సేన్

(ఒడిస్సీ నృత్యం)

యక్షా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి: యక్ష మహోత్సవం

మహా అన్నదానం

‘‘మన సంప్రదాయంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికీ, సన్యాసులకూ సేవచేయడం అతి ముఖ్యమైనది, దానికదే ఒక ఆధ్యాత్మిక పథం. ఇలా సేవించడానికి ఎంతో సుందరమైన విధానం, అన్నదానం’’ - సద్గురు

ఈశా యోగా కేంద్రం, దక్షిణ కైలాసంగా పేరొందిన వేల్లెంగిరి పర్వతాల వద్ద ఉంది. గత 22 ఏళ్ళగా, ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక మార్గంగా, మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ఎంతో ఘంనంగా నిర్వహించబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే లక్షలాది మంది అందులో పాల్గొంటున్నారు. సద్గురు సమక్షంలో, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ అన్నదానం నిర్వహించబడుతోంది.

భారతీయ సంస్కృతిలో అన్నదానం ఎప్పుడూ ఒక భాగంమే. నైవేద్యం చేయబడిన ఆహారం ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఇది ఒక వ్యకి ప్రాణ శక్తిని ప్రభావితం చేయగలదు ఈ పురాతన ఆచారం ఆధ్యాత్మికోన్నతికి ఒక సాధనం . అందరికీ అన్నదానం చేయడం ద్వారా తరతరాలుగా ఎందరో తరించారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న మహాశివరాత్రి జరుపబడుతుంది. ధ్యానలింగం నెలకొని ఉన్న పవిత్ర ప్రదేశంలో, ఈ శుభదినాన జరిగే అన్నదానానికి  మీ విరాళాలను ఆహ్వానిస్తున్నాము.

విరాళాలను ఈ లింక్ ద్వారా అందజేయచ్చు: Mahashivaratri> Maha Annadanam లింక్ ని క్లిక్ చేయండి..

మరిన్ని వివరాలకు ప్రదించండి: 83000 83111, annadanam@ishafoundation.org