ఈ రోజు ఒక దేశంగా, మనం ఒక కొత్త శకం ఆరంభంలో ఉన్నాం

ఈ రోజు ఒక దేశంగా, మనం ఒక కొత్త శకం ఆరంభంలో ఉన్నాం. ఈ ఏడు దశాబ్దాల స్వాతంత్ర్య పయనం కష్టాలు-త్యాగాలతో, అవినీతి-అస్తవ్యస్తాలతో, గొప్ప విజయాలు- చేజారిన అవకాశాలతో, నాలుగు యుద్ధాలతో నిండి ఉంది. మరి ఇప్పుడు తీవ్రవాద భయం కూడా వీటికి తోడైంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, మనం ఇప్పడు ఒక దేశంగా ఒక సరి కొత్త అవకాశాన్ని అందుకోగలిగే స్ధాయికి చేరుకున్నాము.

అందుకోసం ఈ దేశాన్ని నిర్వహించే బాధ్యతను తీసుకున్న వారికి చేయూతనివ్వడం అనేది ప్రతి పౌరుడి కర్తవ్యం!

దీర్ఘకాలంగా ఉన్న పేదరికాన్ని, అనేక మంది కష్టాలను పరిష్కరించడంలో రాబోయే దశాబ్దం కీలకం అవుతుంది. మొట్టమొదటి సారిగా, చాలా మందిని ఒక జీవనస్ధాయి నుండి మరొక జీవన స్ధాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం మనకు అందుబాటులో ఉంది. మనం ఒక దేశంగా ఐక్యతతో, చైతన్యంతో, స్పష్టమైన లక్ష్యంతో పని చేస్తే ఇది ఒక వాస్తవం అవుతుంది. ఈ తరం భారతీయులుగా ఇంతకూ ముందెన్నడూ లేని ఈ అవకాశాన్ని సాఫల్యం చేసుకునే అదృష్టం మనకు కలుగుతుంది. అందుకోసం ఈ దేశాన్ని నిర్వహించే బాధ్యతను తీసుకున్న వారికి చేయూతనివ్వడం అనేది ప్రతి పౌరుడి కర్తవ్యం!

దేశం క్రొంగొత్త అవకాశాలు గల శకంలోకి కదలుగాక!

ప్రేమాశీస్సులతో,
సద్గురు