సేవ్ టెంపుల్స్ లఘు చిత్రోత్సవం - ఈశాకు పురస్కారం!!
ఈశా వారి లఘు చిత్రం హైదరాబాద్‌లో జ్యోతిర్లింగం స్ఫూర్తి పురస్కారాన్ని గెలుచుకుంది.
 
 

ఈశా వారి లఘు చిత్రం  హైదరాబాద్‌లో జ్యోతిర్లింగం స్ఫూర్తి పురస్కారాన్ని గెలుచుకుంది.

"సేవ్ టెంపుల్స్ (ఆలయాలను రక్షించండి!)" లఘు చిత్రోత్సవంలో ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ఈశా వారి "మానవ శ్రేయస్సు కోసం ప్రతిష్టీకరించబడిన స్ధలాలు" అనే లఘు చిత్రానికి  జ్యోతిర్లింగం స్ఫూర్తి పురస్కారం  లభించింది http://bit.ly/1qGCrcD

సహస్రాబ్దాలుగా యోగులు, మర్మఙ్ఞులు మానవత్వానికి అనేక ప్రయోజనాలు అందించేందుకు పవిత్ర ప్రదేశాలైన  దేవాలయాలను నిర్మించారు. అటువంటి ప్రదేశాలను అందరికీ అందించే అద్భుతమైన అవకాశాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది.

దేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భద్రపరచడం గురించి,మన  జీవితాలలో దేవాలయాల ప్రాముఖ్యత గురించి అవగాహన సృష్టించడానికి,  హైదరాబాద్‌లో ఆగష్టు 22 మరియు 24 మధ్య ఈ చిత్రోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా చిత్ర నిర్మాతలు  113 చిత్రాలు సమర్పించారు, వాటిలో 40 చిత్రాలు ప్రదర్శించ బడ్డాయి.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1