నమస్కారం!

దేశంలో ఎంతో త్వరగా అంతరించిపోతున్న నదుల విపత్కర పరిస్థితి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సద్గురు 2017, సెప్టెంబర్ 13న, విజయవాడ; సెప్టెంబర్ 14 న, హైదరాబాదు వస్తున్నారని తెలియబరచడానికి సంతోషిస్తున్నాము.

కోయంబత్తూరు నుంచి న్యూఢిల్లీ దాకా 14 రాష్ట్రాలలో; విజయవాడ, హైదరాబాదుతో సహా 21 నగరాల మీదుగా నదుల పరిరక్షణ గురించి అవగాహన కలిగించడానికి సద్గురు 4,100 మైళ్ళ దూరం, ప్రయాణం (డ్రైవ్) చేయబోతున్నారు. సద్గురు మార్గనిర్దేశనంతో, ఈ అవగాహన కల్గించే ఉద్యమాన్ని మనం వినూత్న విధానంలో నిర్వహంచబోతున్నాము.

దీనిని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ లో సద్గురు వచ్చేముందు ఉద్యమాన్ని చైతన్యవంతంగా ఉంచేందుకు, మనం ఈ కార్యక్రమాన్ని మూడు దశలలో నిర్వహించబోతున్నాము.

  • పాఠశాలల్లో విద్యార్ధులకు నదీ పరిరక్షణ అంశం మీద పైంటింగ్ పోటీలు నిర్వహించడం
  • ఆన్ లైన్ లో ఫొటోగ్రాఫీ, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్ (లఘు చలన చిత్రాల) పోటీ
  • ఈ యాత్రా T - షర్ట్స్ వేసుకుని, గొడుగు చేతబట్టి నగర కూడళ్ళలో మానవ హారంగా నుంచోవడం, సద్గురు రాకకు ముందు రెండు వారాంతాల్లో సంతకాల సేకరణ.

మీరు వచ్చే మూడు నెలలు ఏ విధంగానైనా వాలంటీరింగ్ చేయాలనుకుంటే, ఈ క్రింది ఫారమ్ పూరించి మీ అందుబాటులో ఉండడం గురించి తెలియబరచండి.

https://docs.google.com/a/ishafoundation.org/forms/d/e/1FAIpQLSfUnOdKlV2PCcYG2mNKmfn-jbwlutdOb9jIq8tyiZcCqKHycg/viewform

(లేక)

దయచేసి 9515156700 కు SMS లేక whatsapp చేయండి.

యుగయుగాలుగా ఈ ప్రపంచానికి ఎంతో అందిస్తున్న మన దేశ హితానికి మనం ఉద్యమిద్దాం!

దీనిని నిర్వహించేందుకు చేతులు కలుపుదాం.

ప్రణామాలు.