కావాల్సిన పదార్థాలు


సంజీవని పిండి     -     రెండు టీస్పూనులు
నీరు                       -    1 గ్లాసు
బెల్లం కోరు             -     2 టీ స్పూనులు


చేసే విధానం:


-  గ్లాసు నీరు మరిగించి, అందులో నీళ్ళలో పల్చగా కలుపుకున్న సంజీవని పిండి కలిపి,- పొయ్యి సిమ్లో వుంచి, మరిగించిన నీటిలో ఈ పిండి పోసి అడుగు అంటకుండా (మాడకుండా) బాగా కలియపెట్టాలి. పచ్చి వాసన పోయేదాకా - మరిగించాలి. ఇప్పుడు బెల్లం కోరు కలపాలి. దింపుకున్నాక ఆరిన తరువాత, పాలు లేక కొబ్బరి పాలు లేదా కొబ్బరి కోరు కలుపుకోవాలి. నచ్చిన వారు అరగంట నానపెట్టిన వేరు శనగ కూడా కలుపుకుని సేవించవచ్చు.  

మనవి: సంజీవని అనేది ఈశాయోగ కేంద్రంలో లభించే (శక్తి గల పొడి) పోషకమైన పొడి. ఈ పోషకమైన పొడి ప్రాణానికి శక్తినిచ్చే 14 అత్యవసర పదార్థాల మిశ్రమం. ఇంకా 100 శతవిధాలైన జీవ సంబంధ పదార్థాలతో తయారు చేయబడినది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇది తమిళనాడులోని ఈశా యోగా అనుబంధంతో నడిచే అన్ని ఊళ్ళలోనూ లభిస్తుంది.