• శరీరానికి నిజంగా అవసరమైంది విశ్రాంతి, నిద్ర కాదు.

1

  • మీరు కనుక వృక్షంలా పాతుకుపోయి ఉండివుంటే, మీరు ఈ భూమిలో భాగమని స్పష్టంగా అర్థం చేసుకునేవాళ్ళు. మీరు కదలగలుగుతూ ఉండడం వల్లనే, మీరా ఙ్ఞానం కోల్పోయారు.

2

  • శరీరం, ప్రాణాలతో సహా, మీకు ప్రియమైనది ఏదైనా కూడా, కాలం తీరినప్పుడు దానిని హుందాగా విడిచి వేయడం ఎలాగో మీరు తెలుసుకోవాలి.

3

  • మీ శరీరం పిల్లగాలిలా తేలిపోవాలి. అప్పుడే మీరు నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్లు.

4

  • భౌతిక శరీరం ఒక జంతువు లాంటిది. అది పోగు చేసుకోవాలనీ, పునరుత్పత్తి చేయాలనీ కోరుకుంటుంది. అందుకే ధనానికీ, లైంగికతకూ పడే ప్రయాసలో అంత  శక్తి ఖర్చు అవుతుంది.

5  

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.