నదుల రక్షణ ఉద్యమం - రెండవ రోజు
 
 

నదుల రక్షణ ఉద్యమ రథం ఘనంగా ప్రతి ఒక్కరి మద్దతు వల్ల విజయవంతంగా కదులుతోంది..

పడమటి కనుమలలోని వరుసనాడు కొండల్లో పుట్టి, ఈశాన్య దిశలో కంబం లోయ గుండా ప్రవహించి పాక్ జలసంధిలో కలిసే ‘వాగై’ నది ఒడ్డున జరుగుతున్నది. సంగం అనే కావ్య గ్రంధాల్లో ఈ నది గురించి ఎంతో గొప్పగా కొనియాడారు. ‘వాగై’ అన్న మాటకు అర్థం ‘వై’ అంటే ప్రదేశం, ‘గై’ అంటే చేతులు, అంటే తాకితే నీరు ఇచ్చే నది అని అర్థం. పురాణాల పరంగా ఈ నది పుట్టుక మథురలో వెలసిన మీనాక్షి చరిత్రతో ముడిపడి ఉన్నది.

అయినా, మిగతా నదుల లాగానే ఈనాడు, వాగై నది కూడా దీన స్థితిలో ఉన్నది. వేసవిలో ఎండిపోతుంది, మథురైను దాటిన కొద్ది దూరంలోనే ఎండిపోతుంది.

IMG-20170904-WA0038

WhatsApp-Image-2017-09-04-at-07.07.29

WhatsApp-Image-2017-09-04-at-07.16.29

WhatsApp-Image-2017-09-04-at-07.20.25

WhatsApp-Image-2017-09-04-at-07.28.15

ఉదయం. 11.52 సెప్టెంబరు 4

మథురై నుంచి కన్యాకుమారికి

IMG-20170904-WA0251ఆసక్తి కరంగా, సాగిన మథురై కార్యక్రమం తరువాత, ఇప్పుడు ‘నదుల రక్షణ’ ఉద్యమం భారత ఉప ఖండానికి దక్షిణ కొనలోనున్న 270 కి.మీ దూరంలోని కన్యాకుమారికి బయలుదేరింది.  మూడు సముద్రాలు కలిసే చోటుగా కన్యాకుమారికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది, దానినే ఇక్కడ లక్షదీవుల సముద్రం అంటారు. ఈ ఊరికి ఈ పేరు రావడానికి కారణం అక్కడ ఉన్నకన్యాకుమారి దేవాలయం.

 

ఈ ఉద్యమంలో పాల్గొనేవారు వివేకానంద రాక్ మెమోరియల్ దర్శిస్తారు, అది సముద్రంలో 500 మీ దూరంలో ఒకరాయి మీద ఉన్నది. 1893లో చికాగోలో జరిగే వరల్డ్ రెలిజియస్ కాంగ్రెస్ కు పయనించే ముందు స్వామి వివేకానంద 1892, డిసెంబరు 24 న కన్యాకుమారి దర్శించారు. ఆయన ఆ రాతి మీద రెండు రోజులు తపస్సు చేసి జ్ఞానోదయం పొందారని అంటారు.

1.50 PM, సెప్టెంబరు 4

మథురై నుంచి కన్యాకుమారికి

IMG-20170904-WA0038

మథురైలోని అందమైన గాంధీ మెమోరియల్ మ్యూజియం, ‘రివర్ రాలీ’ కార్యక్రమానికి వేదిక. జన సమూహం కొన్ని వేలు మాత్రమే, కాని తాము వచ్చిన పని గురించి బాగా ఉత్సాహంగా ఉన్నారు.

కార్యక్రమం జరిగే పట్టణం మథురై కాబట్టి, వేదిక మీద కవులు ఉండడం సహజమే. తమిళ, మళయాళ రచయిత, విమర్శకులు. B. జయ మోహన్, తమిళ పండితుడు డా.జ్ఞాన సంబంధన్, ఇంకా తిరు. S. రతినవేలు, తమిళనాడు వాణిజ్య సంఘం అద్యక్షులు, తిరు. K.వీర రాఘవరావు, మథురై కలెక్టరు, శ్రీ. మనీశ్వర్ రాజా IFS, వేదిక అలంకరించారు. మాట్లాడిన వక్తలందరూ మన  నదుల రక్షణ గురించి ఇప్పటికైనా పెద్ద యెత్తున ఒక ఉద్యమాన్ని చేపట్టినందుకు సంతోషించారు.

బాగా వేడిగా ఉన్నందున, ప్రేక్షకులు RFR ప్లెకార్డ్స్ ను ఆచ్చాదనకు వాడారు. సద్గురు వేళాకోళంగా ఆ విషయం ప్రస్తావిస్తూ, ఈ ఉద్యమం పట్ల ప్రజలలో అవగాహన తీసుకు రావడం ముఖ్యం కాబట్టి  వచ్చేనెల అంతా RFR ప్లెకార్డ్స్ ను అందరికీ కనబడే విధంగా ప్రదర్శించాలని అన్నారు.

సద్గురు ప్రాంగణం నుంచి బయలు దేరగానే అందరూ ఆయనను చుట్టు ముట్టారు.

IMG-20170904-WA0251

IMG-20170904-WA0067

IMG-20170904-WA0063

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1