కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి     -    200 గ్రాములు

నీరు     -    2 గ్లాసులు

ఉప్పు    -    రుచికి తగినంత

చేసే విధానం:

- మందంగా వున్న గిన్నెలో అర గ్లాసు నీరు పోసుకుని పొయ్యిమీద పెట్టుకుని మరిగించాలి.

- వేరే గిన్నెలో ఉప్పు వేసి రాగి పిండి వేసి నీరు పోసుకుని ఉండ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మరిగిన నీరులో పిండి పోసి 10 నిమిషాలు కలుపుతూ వుండాలి. ఇంకా నీరు కావాలంటే కొంచెం -వేడి నీరు కలుపుకోవచ్చు. ఈ సంకటి తయారయితే అంటుకోకుండా ఉంటుంది. తడి చేయి చేసుకుని పట్టుకుంటే అది చేతికి అంటకుండా వుండాలి. ఈ విధంగా సంకటి తయారవుతుంది. దీనిని అందరికీ  వడ్డించవచ్చు. 

- ఇలాగే గోధుమ పిండి, జొన్నపిండి, మొక్కజొన్న పిండితో కూడా చేసుకోవచ్చు.