జీవితాన్ని మెరుగుపరిచే 6 సూత్రాలు
 
 

జీవితాన్ని అర్ధంచేసుకుని, మీకు కావలసిన విధంగా మలుచుకోవడానికి ఉపయోగపడే సద్గురు సూత్రాలను తెలుసుకుందాం..!

  • బాహ్యం మీకు స్పూర్తిని, మార్గనిర్దేశతను ఇవ్వవచ్చు, కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడమనేది లోపలి నుంచే జరగాలి.

1

 

  • చూడడానికి మంచిగా కనిపించడం ముఖ్యం కాదు. జీవితం మీకొక గొప్ప అనుభవమా, కాదా? ఇదీ ముఖ్యం. విలువల్లో ఈ మార్పు తప్పక రావాలి.

2

 

  • మానవులు తమగురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ జరిగే దానిలో మనం ఒక చిన్న అంశం మాత్రమే.

3

 

  • మీరెక్కడున్నా, మీకే పరిస్థితి ఎదురైనా, ప్రతి పరిస్థితి నుండీ ఉన్నతమైన దాన్ని ఎంచుకోండి. అప్పుడు జీవితమే ఒక పాఠమౌతుంది.

4

 

  • జీవితాన్ని తప్పొప్పుల పరంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ చేసే ప్రతి చర్యకీ ఓ పర్యవసానం ఉంటుందని మీరు తప్పక అర్థం చేసుకోవాలి.

5

 

  • మీ జీవితానుభూతి మీరెలా ఉన్నారన్నదాని మీద ఉంటుందే గాని, మీ చుట్టూ ఎవరున్నారు లేక ఏమున్నాయన్నదానిపైన ఆధారపడి ఉండదు.

6

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1