ప్రేమ సంబంధం గురించి తెలుసుకోవలసిన 5 సూత్రాలు

ArticleMay 13, 2018
- ప్రేమలోని ఔన్నత్యం మీకు తెలియాలంటే, మీరు కనీసం కొంతైనా లోబడాలి. లేదంటే, మీలో ఇంకెవ్వరికీ స్థానం ఉండదు.
- మీరు ఇతరులను సగం, సగం ప్రేమించగలను అనుకుంటే, అక్కడ ప్రేమలేనట్టే. ప్రేమ ఉంటే వందశాతం ఉంటుంది లేకపోతే అసలు ఉండదు.
- తమ సంబంధాలని తార్కికంగా పరీక్షించే మనుషులు వాటిని నిలుపుకోలేరు. రెండు శరీరాలు, రెండు మనసులు, రెండు భావోద్వేగాలు ఎప్పటికీ ఒకదానికొకటి పూర్తిగా ఇమడవు.
- మీ ప్రేమ పరిమాణాన్ని పెంచండి! మీరు మొత్తం విశ్వంతోనే ప్రేమలో పడగలిగినప్పుడు, ఒక్కరినే ప్రేమించడం ఏమిటి.
- మీ సంబంధం సజావుగా ఉండాలని మీరనుకుంటే, అవతలి వ్యక్తి మీకన్నాముఖ్యులని మీరెప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి.