మహాశివరాత్రి - రెండు రోజుల జాగరణ

 

శైలేష్ దంపతులు, వారం రోజుల పాటు ప్రశాంతంగా ఆశ్రమంలో ఉంటూ అక్కడ జరిగే మహాశివరాత్రి వేడుకలను వీక్షించాలని ఏర్పాట్లు  చేసుకున్నారు. శివరాత్రికి కొద్దిరోజుల ముందు ఆయన స్థానిక కొఆర్డినెటర్ పిలుపునందుకుని మహాశివరాత్రి వేడుకలకు వాలంటీర్ గా సహాయ సహకారాల్ని అందించేందుకు నమోదు చేసుకున్నారు. ఈ చిన్ని అడుగు ఆయనకు ఎనలేని దైవానుగ్రహాన్ని అనుభూతి చెందేలా ఎలా చేసిందో క్రింద చదవండి.

నేను ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రాం చేసినప్పటినుంచి ఎన్నోసార్లు ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించాను. కానీ, మహాశివరాత్రి వేడుకలకు ఎప్పుడూ వెళ్ళలేకపోయాను. తరచూ ముంబై లోని తోటి మెడిటేటర్స్ - ఈ సంవత్సరం మహాశివరాత్రి మరింత ఘనంగా ఉండబోతుంది అని, ఇంట్లో ఉండి అక్కడ జరిగే వేడుకలను టివిలో చూడటం లేదా స్థానిక సెంటర్లో నిర్వహించే వేడుకల్లో పాల్గోనడటం ఒకటి కాదని అనుకోవటం విన్నాను. రాత్రంతా ఆ ప్రాంగణంలో జరిగే  వేడుకలను  అనుభూతి చెందాలని నాకనిపించింది.

వీక్షణ నుంచి వాలంటీర్ దాకా

జీవితంలో ఒక్కసారి మాత్రమె జరిగే యోగేశ్వర లింగ ప్రాణ ప్రతిష్ట ఇంకా 112 అడుగుల ఆదియోగి ఆవిష్కరణలో పాల్గొనే సదావకాశం సద్గురుచే కల్పించినప్పటినుంచి నన్ను నేను ఆపుకోలేకపోయాను. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవగానే నేను నా భార్యా వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అక్కడ నేను పొందబోయే అనుభూతిని మరింత పెంపొందిన్చుకోటానికి 40 రోజుల శక్తివంతమైన శివాంగ సాధన తీస్కోటానికి నిశ్చయించుకున్నాను. అది మహిమాయుతమైన వేల్లెంగిరిపర్వతాలపై ఉన్న దక్షిణ కైలాసంగా పిలువబడే 7వ పర్వతారోహణ యాత్ర పూర్తిచేయడంతో ముగుస్తుంది.

నేను నా భార్య వారం రోజుల పాటు ఆశ్రమంలో ఉండి ఈ కనువిందైన వేడుకను వీక్షించాలని అనుకున్నాము, కాని మా ప్రయాణానికి దాదాపు 15 రోజుల ముందు మా స్థానిక కొ ఆర్డినేటర్ నాకు కాల్ చేసి శివరాత్రికి కొద్ది రోజుల ముందే ఆశ్రమం చేరుకొని శివరాత్రి వేడుకల ఏర్పాట్లకు వాలంటీర్ గా సహాయ సహకారాల్ని అందించగలనా అని అడిగారు. “ ఇలాంటి గొప్ప వేడుకకు వాలంటీర్ గా చేసే భాగ్యాన్ని ఎందుకు వదులుకోవాలి అని అనిపించింది”. వెంటనే మా కోయంబత్తూర్ ప్రయాణాన్ని ముందుకు మార్చుకున్నాం.

7వ కొండ పర్వతారోహణ – వెళ్ళాలా వద్దా?

నేను ఆశ్రమం చేరుకోగానే అక్కడ నేను చూడబోయే, ఈశా చరిత్రలో ఘనంగా నిలిచిపోబోయే  అతి పెద్ద వేడుకలో ఉత్సాహంగా కార్యాచరణలో దిగిపోయాను. ప్రతి రోజూ రాత్రి నేను నిద్రకు ఉపక్రమించే సమయం అర్ధరాత్రి లేదా అప్పుడప్పుడూ ఇంకా ఆలస్యం అవుతుండేది కానీ ఉదయం నిద్ర లేచే సమయం మాత్రం ఖచ్చితంగా 4.00 గంటలు- నా రోజువారీ యోగా ప్రాక్టీసులు ముగించుకుని గురుపూజ చేసి నా ఆక్టివిటీకి  7.30 కల్లా సిద్ధంగా ఉండేవాడిని.

శివరాత్రి దగ్గర పడేకొద్దీ, నా పని నుంచి విరామం తీస్కోని 7 వ కొండ యాత్రకు వెళ్ళటం గురించి నాలో కొంచెం కలవరంగా అనిపించింది. “అది చాలా కష్టతరమైన పర్వతారోహణ, తిరిగి వచ్చిన తర్వాత నువ్వు నిర్వహించాల్సిన పని చేయగలిగే స్థితిలో నువ్వు ఉండలేకపోవచ్చు.” అని  కొంతమంది తోటి వాలంటీర్లు నాతొ అన్నారు “ఇక్కడ చాలా పని చేయాల్సి ఉంది గనుక ఈ సారికి కొండపైకి వెళ్ళద్దు” అని. నా పట్ల వారి ఆపేక్షకు ఆనందం కలిగింది కానీ శివాంగ సాధనతో నేను పొందిన గాఢమైన అనుభూతి వలన నేను నా సాధనను అన్నిటికంటే శక్తివంతమైన రీతిలో ముగించాలని నిశ్చయించుకున్నాను.

శక్తివంతమైన మంత్రం

చిన్న టార్చి సహాయంతో, కాళ్ళకు చెప్పులు లేకుండా ఫిబ్రవరి 22 బుధవారం ఉదయం 1.30కు మా యాత్ర ప్రారంభించాం. అలసటకు లోనవుతానేమోనన్న అనుమానంతో సధ్గురుచే సూచించబడిన “ ఓం నమః శివాయ” మంత్రోచ్చారణ నేను చేయలేదు. 7వ కొండ మెట్లు అంతులేనివిగా అనిపించి నాకు చాలా అలుపు అనిపించింది. చుట్టూ చూస్తే, నా తోటి సాధకులంతా గుండేలవిసిపోయేలా గట్టిగా మంత్రోచ్చారణ చేస్తూ సునాయాసంగా కొండపైకి అడుగులు వేయటం గమనించాను. అయిష్టంగానే నేనూ మంత్రోచ్చారణలో గొంతు కలిపాను.

రాత్రి పూట తర్వాతి అడుగు కనిపించనంత చిమ్మ చీకట్లో ప్రతి అడుగుకీ మాకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తోంది మంత్రమే అన్న విషయం నేను కొద్దిసేపటికే గ్రహించాను. నేను మంత్రాన్ని మరింత శ్రద్ధగా మంత్రోచ్చారణ సాగించాను. ప్రతి అడుగులో నాకు రక్షణనిస్తూ, నేను ధరించిన పల్చని వస్త్రం గుండా చుట్టూ ఉన్న చల్లని గాలి నన్ను బాధించకుండా శక్తిని వెచ్చదనాన్ని ఇచ్చింది ఆ మంత్రమే.

4000 అడుగుల ఎత్తునున్న 7వ కొండ చివరకుకు ఎక్కేటప్పటికి ఉదయం 5.45 అయ్యింది. అక్కడకు చేరుకోగానే నాకు అమితానందంగా అనిపించింది – ఆనందంతో కళ్ళ నీళ్ళు నా చంపలపై జారాయి- “ 42 రోజుల వ్రత దీక్ష , వ్రతాన్ని సరైన రీతిలో ముగించటానికి రాత్రంతా వేలంగిరి పర్వతారోహణ, నేను పూర్తీ చేశాను.”

కొండ పైనున్న పురాతన మందిరాన్ని దర్శించుకున్నాక మేము పూర్తిగా అద్వితీయమైన ఒక చోటు చూశాము- అదే సద్గురు శ్రీబ్రహ్మ స్థలం. కొండపైనుండి సూర్యోదయాన్ని వీక్షించడo , తెల్లవారుజాము తోలి కిరణాలు శరీరాన్ని తాకటం, వీటిని మించిన మరే అద్భుతం లేదు.

కఠినమైన క్రిందికి దిగే త్రోవ - తక్షణ పునఃశక్తి

సుమారుగా ఉదయం 7.45 కు కొండ దిగటం ప్రారంభించాము. మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టగానే అంతకుముందు శివంగ సాధన చేసిన సాధకులు మా చెవిన వేసిన మాటలు నన్ను కొంచెం నిలువరించాయి – “ క్రిందికి దిగే దారి మరింత కష్టతరంగా ఉంటుంది...” కాని  దాన్ని అంగీకరించటానికి నా మనసు సుముఖత చూపలేదు. అది ఎంత తప్పో నాకు తెలియజేసిన ఒక అనుభూతి అది - నా పాదాలు గాయపడి, బొబ్బలేక్కి, ప్రతి అడుగు బాధాకరంగా..ప్రతి రాయి నన్ను హింసిస్తున్నట్లుగా అనిపించింది. రోజు గడిచేకొద్దీ నేల వేడెక్కుతూ మా ప్రయాణo మరింత బాధాకరంగా అనిపించింది. ఈసారి నేను మర్చిపోకుండా నాకు ఊతాన్నిచ్చిన మంత్రోచ్చారణను కొనసాగిస్తూ మధ్యాహ్నం 12.30కు క్రిందికి చేరుకున్నాం. పైకి ఎక్కటానికి పట్టిన సమయం కంటే ఒక గంట ఎక్కువ పట్టింది.

త్వరగా స్నానం, భోజనం చేసి ధ్యానలింగ దర్శనం చేసుకున్నాను, నాకు వెంటనే శక్తి వచ్చినట్లనిపించింది. రాత్రంతా మంచి నిద్ర చేసిన తర్వాత లేచినట్లుగా చాలా తాజాగా అనిపించింది, 3 గంటలకు మా పనిలో నిమగ్నమయ్యేందుకు మహాశివరాత్రి వేడుకలు జరిగే ప్రదేశానికి చేరుకున్నాను. రాత్రికి ఆలస్యంగా 3 గంటలు మాత్రమే నిద్రకు కేటాయించగలిగాను. తెల్లారగానే మహాశివరాత్రి పర్వదినం, ఆదియోగి ప్రాణ ప్రతిష్ట కొసం వేడుక జరిగే ప్రాంగణానికి చేరుకున్నాను. అంత కష్టమైనా పర్వతారోహణ తర్వాత, నిద్ర లేమితో, చురుక్కుమనిపించే ఎండలో పనిచేస్తూ,కుర్చీలు సర్దుతూ ఎలా నేను ఏ విధమైన అలసట లేకుండా ఉండగిలిగానా అని ఆశ్చర్యమేసింది.

శివరాత్రి రోజు రాత్రంతా మెలకువగా పైగా ఎక్కువ సమయం నిలబడే గడిపాను. ప్రధాన మంత్రి ఆదియోగి ముందు మాట్లాడినప్పుడు ఆ ప్రాంగణమంతా కంటికి కనిపించేటంత దూరం జనంతో నిండిపోయి ఉంది. సద్గుర సంకల్పించిన ఈ అసాధారణ వేడుకను వీక్షించే భాగ్యం కలిగినందుకు  నేను చాలా అదృష్టవంతుడిని అనిపించింది.

గడిచిన 76 గంటల్లో, కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయి, మెలకువగా గడిపిన రెండు రాత్రుల్లో, చాలా శక్తివంతంగా ఉన్నాను. ఇది నా లెక్కకు అంతుపట్టలేదు. దీనినీ నేను ఒక పదం ద్వారా నిర్వచించాలంటే, అది నా ఊహకందని, నేను వివరంగా చెప్పలేని, అనుభూతి మాత్రమే చెందగలిగే పదం –“ అనుగ్రహం”

ముంబైలో నివాసముండే శైలేష్ వెంకటేసన్ మీడ్ జాన్సన్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు.

శివాంగా సాధన వివరాలను తెలుసుకోడానికి చూడండి: Shivanga