జీవితాన్ని ఉత్సాహంతో జీవించండి

ఈ వ్యాసంలో సద్గురు ఈ మహాశివరాత్రి ఎంత అధ్భుతంగా జరిగిందో, ఇది ఎలా మనందరికీ స్ఫూర్తినివ్వగలదో చెబుతున్నారు. అలాగే ఇందులో స్లైడ్ షో ద్వారా కార్యక్రమంలోని అత్యద్భుతమైన ఘట్టాలను చిత్రాలలో బంధించి మీకోసం అందిస్తున్నాము..తప్పక చూడండి..!!
 

ఈ వ్యాసంలో సద్గురు ఈ మహాశివరాత్రి ఎంత అధ్భుతంగా జరిగిందో, ఇది ఎలా మనందరికీ స్ఫూర్తినివ్వగలదో చెబుతున్నారు. అలాగే ఇందులో స్లైడ్ షో ద్వారా కార్యక్రమంలోని అత్యద్భుతమైన ఘట్టాలను చిత్రాలలో బంధించి మీకోసం అందిస్తున్నాము..తప్పక చూడండి..!!

Sadhguruనేను ఎన్నో కార్యక్రమాలను చూశాను. కానీ, ఇటువంటి కార్యక్రమాన్ని మరొకదాన్ని చూడలేదు. ఈ మహాశివరాత్రి ఎంతో అద్భుతంగా గడిచింది. ఈ మహాశివరాత్రి ఎంతో అసమానంగా జరిగింది. ఇది ఒక అద్భుతమైన రాత్రి. మీరందరూ కూడా చేయి - చేయి కలిపి ఇది సాధ్యం కావడానికి ముందుకువచ్చి పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మన ప్రధానమంత్రి,  ఎంతో అమూల్యమైన వారి సమయాన్ని మనకి కేటాయించి ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి కేవలం మనతో ఒక రెండు గంటలు గడపడానికి వచ్చినందుకు, వారి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు, తమిళనాడు పోలీస్ కు, గవర్నమెంట్ అధికారులకు, ఇక్కడి సామాన్య ప్రజలకు – అందరికీ మా ధన్యవాదాలు. మనల్ని ఎన్నో విధాలుగా సజీవంగా అట్టిపెట్టిన ఈ కళాకారులకు, మీడియావారికి, మన వాలంటీర్లకు, రెసిడెంట్లకు, బ్రహ్మచార్లకు, ఎవరైతే ఈ రాత్రంతా మనతో వున్నారో వారందరికీ కూడా నేను శుభాకాంక్షలను అందిస్తున్నాను.

యోగశాస్త్రాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నంలో భాగంగా మేము పది లక్షల యోగవీరాలను తయారు చేయాలనుకుంటున్నాము.

మన జీవితాన్ని ఎంతో ఉత్సాహభరితంగా గడపడానికి ఈ రాత్రి ఒక స్పూర్తి కావాలి. మన శరీరానికీ, మనసుకు ఉన్న పరిమితులు దాటడానికి ఇదొక స్పూర్తి. మన శరీర పరిమితులను దాటి పనిచేసే విధానం ఒకటి ఉంది. మన మానసిక పరిమితులను దాటి పనిచేసే విధానం ఒకటి ఉంది. ఇదే ఆదియోగి మనకి తెలిపింది. ఆదియోగి దీనికే ప్రతీక. మనము దీనిని ప్రపంచంలోకి తీసుకునిరావాలి అని అనుకుంటున్నాం. యోగశాస్త్రం అంతా దీనిగురించే. మన ప్రధానమంత్రే ఒక యోగవీర. ఆయన అందరికంటే ముందుగా ఈ మహా యజ్ఞజ్వాలను వెలిగించారు. యోగశాస్త్రాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నంలో భాగంగా మేము పది లక్షల యోగవీరాలను తయారు చేయాలనుకుంటున్నాము. మీరు ఒక సరళమైన యోగ పద్ధతిని కనీసం వందమందికి వచ్చే యేడాదిలోగా నేర్పిస్తారు. అంటే వచ్చే మహాశివరాత్రిలోగా కనీసం ఒక కోటి మంది యోగాను చేయడం మొదలు పెడతారు. మీలో ప్రతిఒక్కరూ కూడా ఒక యోగవీర అయ్యి ఈ సరళమైన యోగ పద్ధతులను కనీసం వంద మందికి వచ్చే పన్నెండు నెలల లోపల అందించాలని నేను కోరుకుంటున్నాను.

మనం ఎన్ని ఆసుపత్రులు కట్టినా సరే, వైద్య శాస్త్రాన్ని ఎంత పెంపొందించినా సరే, వ్యక్తి తన ఆరోగ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే తప్పితే విలువైనదేదీ జరగదు. మనలో ప్రతిఒక్కరూ కూడా మన శ్రేయస్సుకి, మన సంతోషానికి, మన ముక్తికి మనమే బాధ్యత వహించాలి. గవర్నమెంట్లు, కార్పొరేషన్లు, అడ్మినిస్ట్రేషన్లు ఇందుకు కావలసిన సాంకేతికను అందించగలవేమో... కానీ, మన శ్రేయస్సు అనేది అంతర్ముఖం లోనే ఉంది. మన అంతర్ముఖాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ద్వారానే మనం మానవులుగా ముక్తి పొందగలం. ఈ జ్ఞానాన్ని అందరూ తెలుసుకొనే ఆవశ్యకతను కల్పించాలని, మేము ఆకాంక్షిస్తున్నాము.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

ఆంగ్లంలో ఈ వ్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు: Live Life Exuberantly