ప్రశ్న: జూన్ 21న యోగా దినంగా  ప్రకటించడం ఓ మంచి ఆలోచనే అంటారా?

సద్గురు: ఖచ్చితంగా! మేము లక్షకు పైగా ప్రాంతాల్లో దీనిని జరిగేలా చూస్తున్నాము. యోగా గురించి చాలా మందికి దురభిప్రాయాలు ఉన్నాయి. కొంత మంది అది ఒక సర్కస్ అని, మరి కొంతమంది ఇది  హిందూమతానికి ఒక దొడ్డిదారి అని అనుకుంటున్నారు. సాధారణంగా, పాశ్చాత్య దేశాల్లో  మీరు యోగా అన్న పదం ఉచ్ఛరించగానే వారు అది ఒక భౌతికమైన భంగిమగా భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి వారు ప్రకటించిన ఈ యోగా డే వారి దురభిప్రాయాల్ని నిర్మూలించడంలో సహాయ పడుతుంది.

ప్రశ్న: ప్రధాని నరేంద్ర మోడీ మనందరికీ చెందిన దాన్నిఏదో సముచితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఒక భావన ఉంది.

సద్గురు: మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను నరేంద్ర మోడీ పార్టీ అభిమాని కాదు కానీ ఆయన ఒక ప్రపంచ నాయకుడు, ఒక ముఖ్యమైన పెద్ద దేశానికి ప్రధాన మంత్రి. ఆయన యోగ కోసం ఒక రోజు ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని ఒప్పించారంటే అది ఎంతో గొప్ప విషయం. ఇంతవరకు ఎవరూ ఈ పని చేయాలని ప్రయత్నించక పోవడం దురదృష్టకరం. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే, ఇది విశిష్టమైన యోగ ప్రసస్త్యాన్ని వ్యాప్తి చెందించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇప్పటి వరకూ నాయకులు  ఎప్పుడు ప్రజల అంతర్ముఖ శ్రేయస్సును గురించి అసలు మాట్లాడనే లేదు. నాయకులు ఆర్థిక వృద్ధి, బాహ్య ఉన్నతి లేదా యుద్ధాలు జయించడం గురించి మాత్రమే మాట్లాడతారు. ఒక నాయకుడు అంతర్ముఖ శ్రేయస్సును గురించి మాట్లాడారు అంటే అది ప్రశంసనీయం. అది చాలా విప్లవాత్మకమైన అడుగు.