కావాల్సిన పదార్థాలు :

బీట్‌రూట్‌           -          1 కప్పు (పొడుగు ముక్కలు)

క్యాబేజి   -          1 కప్పు (పొడుగు ముక్కలు)

అప్పడాలు           -          వేయించినవి 2

నిమ్మరసం          -          2 టేబుల్‌ స్పూన్‌లు

పుదీనా   -          1/4 కప్పు - సన్నగా తరిగినది

ఉప్పు     -          తగినంత

ఆలివ్‌ ఆయిల్‌     -          1 టేబుల్‌ స్పూను

మిరియాల పొడి   -          1 టీస్పూను

చేసే విధానం :

-          క్యాబేజీని, బీట్‌రూట్‌ని (పైన తొక్కతీసి) పొడవుగా ముక్కలు చేయాలి. వేడి నీళ్ళలో 2 నిమిషాలు ఉంచి నీరు తీసి పక్కకి ఉంచుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం, పుదీనా, ఉప్పు, మిరియాలపొడి అన్నీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పాలి.

-          బీట్‌ రూట్‌, క్యాబేజి ముక్కలతో మిక్సీలో చేసిన పేస్టును కలిపి ఒక ప్లేట్‌ తీసుకుని కింద అప్పడం ముక్కలు వేసి పై మిశ్రమాన్ని పేర్చి వడ్డించాలి.