కావాల్సిన పదార్థాలు:


బీట్రూట్    -    1 కప్పు
అటుకులు    -     1 కప్పు
కొబ్బరి-నూనె    -    2 టీస్పూనులు
ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు    -    1 టీస్పూను
అల్లం కోరు    -    1 టీస్పూను
ఎండుమిర్చి    -    4
కరివేపాకు    -    కొంచెం
ఉప్పు    -    రుచికి తగినంత


చేసే విధానం :


 అటుకులు నానపెట్టి తరువాత వడకట్టి ఒక బట్టమీద ఆరపెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, బీట్రూట్, అల్లం కోరు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఈ మిశ్రమంలో అటుకులు, ఉప్పు వేసి కొబ్బరికోరు, కొత్తిమీర చల్లుకుని తినాలి. ఇది సాయింత్రం టిఫిన్గా చాలామంచిది.