బేబీ కార్న్ సలాడ్

కారెట్, కాబెజ్, కీర, కాప్సికమ్, టమాట చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి
 
 బేబీ కార్న్ సలాడ్

కావాల్సిన పదార్థాలు :

రాజ్మా (నానపెట్టి ఉడకపెట్టినవి - అర కప్పు)
బేబీ కార్న్ (వేడి నీళ్ళల్లో కడిగి గుండ్రంగా ముక్కలు చెయ్యాలి) - 1 కప్పు
క్యాబేజి (తురిమినది) - అర కప్పు
క్యాప్స్సికం - 1/4 కప్పు
టమాటో - 2
కీర (కొంచెం) - ఒకటి
కారెట్ (కొంచెం) - ఒకటి
ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర్ర టీ స్పూన్
ఆలివ్ ఫ్రూట్స్ - 5
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - ఒక టీ స్పూన్
నిమ్మకాయ - సగం చెక్క
కొత్తిమీర - కొద్దిగా
జీల కర్ర పొడి - ఒక టీ స్పూన్

చేసే విధానం :

  •  కారెట్, కాబెజ్, కీర, కాప్సికమ్, టమాట చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి
  • బేబీ కార్న్ వేడి నీళ్ళల్లో కడిగి గుండ్రంగా ముక్కలు చెయ్యాలి
  • ఆలివ్  రెండు ముక్కలుగా చెయ్యాలి.
  • ఉడికించిన రాజ్మా తో ఈ ముక్కలన్నీ కలపాలి
  • వీటిని కలిపి ఆయిల్ ఒకటిన్నర స్పూను కలిపి ఉప్పు, మిరియాలపొడి, జీలకర్రపొడి వేసి బాగా కలిపి పైన కొత్తిమీర చల్లి , అందరికి వడ్డించండి...