ఆయుధ పూజ

 

నవరాత్రి  సందర్భంగా సౌండ్స్ అఫ్ ఈశా వారు అందిస్తున్న ఈ భైరవి వందనను ఆలకించండి. అలాగే ఆయుధ పూజ గురించిన ప్రాముఖ్యత ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

 

ఆయుధ పూజ

నవరాత్రి సమయంలో, మన దైనందిన జీవితంలో భాగస్వాములైన అన్ని పరికరాలకీ యంత్రాలకీ పూజ చేస్తారు. ఆయుధ పూజని , మన ఉపకరణాలకి వినమ్రత ప్రకటించడంగా అర్ధం చేసుకోవచ్చు.

ఇపుడు ఆ సంప్రదాయన్నిమనం ఉపయోగించే అన్ని వస్తువులకీ వర్తింప చేస్తున్నాము.

సంప్రదాయంగా, మహాభారత కాలం నాటినుండీ ఈ పూజ తొలి ఆనవాళ్ళు ఉన్నాయి. అర్జునుడూ, ఇంకా మిగిలిన పాండవులూ, వాళ్ళు అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వాళ్ళ మహా శక్తివంతమైన ఆయుధాల్ని దాచి ఉంచారు. అజ్ఞాతవాస సమయం అయిపోయిన తరువాత, వాళ్ళు తమ ఆయుధాలను బయటకి తీసి పూజచేసినట్టు చెబుతారు.

సంప్రదాయంగా, సైనికులు తమ ఆయుధాలని ఈ రోజు పూజించే వారు.  ఇపుడు ఆ సంప్రదాయన్నిమనం ఉపయోగించే అన్ని వస్తువులకీ వర్తింప చేస్తున్నాము. వ్యావసాయిక సమాజాల్లో, నాగలి వంటి  వ్యావసాయిక పనిముట్లకి పూజ చేసే వారు.  ఇపుడు ఆఫీసుల్లో కంప్యూటర్లూ, ప్రింటర్లూ, టెలిఫోనులూ ఆ గౌరవాన్ని అందుకుంటుంటే, ఇళ్ళలో వాహనాలు పూజ అందుకుంటున్నాయి.

 
ప్రేమాశిస్సులతో,
సద్గురు

ఈషా యోగా కేంద్రంలో వంటశాలలో ఇంకా  వాహనాలకీ, ఆఫీసుల్లో కంప్యూటర్లకీ, లాప్ టాప్,  టెలిఫోను,  తదితర పరికరాలకీ జరుగుతుంది.  పూజ తర్వాత అందరికీ ప్రసాదం పంచబడుతుంది.

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1