ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం సద్గురు నిర్వహిస్తున్న 3 రోజుల 'ఇన్నర్ ఇంజనీరింగ్  ప్రోగ్రామ్'లో మొదటి రోజు విశేషాలు:


 

ఇన్నర్ ఇంజనీరింగ్  ప్రోగ్రామ్ మొదటి రోజు - జనవరి 29, 2015

మొదట, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన మంత్రులు, IAS, IPS, IRS, ఇంకా ఇతర ఆఫీసర్లు, వారి జీవిత భాగస్వాములు, మొత్తం కలిపి 300 మందిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వంలో పనిచేసి వారికి ' ఇన్నర్ ఇంజనీరింగ్' యొక్క అవసరాన్ని, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఆ తర్వాత సద్గురుని, ఆయన స్థాపించిన ఈశా ఫౌండేషన్‌ని పరిచయం చేశారు.

ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్‍లో పాల్గొన్నవారికి కొన్ని ఆసనాలు, ప్రాణాయామం నేర్పించబడ్డాయి.