మీతో మీరు వంద శాతం నిజాయితీగా ఉండడం అన్నది ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ప్రాధమికమైన విషయం.

 

సృష్టిలోనిది అంతా చలనశీలంగా ఉంటుంది. మీరు దానితో కదలనైనా కదలండి లేక దానికి అతీతంగా ఉండండి.

 

ఆధ్యాత్మికత విధానంలోని మొదటి సూత్రం మీరు మీ నిర్ధారణలనన్నింటినీ ప్రక్కనబెట్టడం.

 

తమ బాగు కోసం లేదా మరొకరి హాని కోసం క్షుద్ర శక్తులను ఉపయోగిస్తే, దానివల్ల ఎదురయ్యే పర్యవసానాలు, ఇతర కర్మఫలాల కంటే కూడా ఎంతో తీవ్రంగా ఉంటాయి.

 

విఙ్ఞన శాస్త్రం, మార్మికత ఒకే చోటకు చేర్చే దారులు, మానవ జాతిలో అవసరమైన విఙ్ఞత ఉదయించినప్పుడు, అవి రెండూ ఏకమౌతాయి.