యోగా గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

 

యోగాకు సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.

  • యోగా అన్నది స్వర్గానికి వెళ్ళడం గురించి కాదు. మీనుంచి మీరే ఓ స్వర్గాన్ని సృష్టించుకోవడం గురించి.

1

 

  • యోగా అంటే తలకిందులుగా నిలబడడమో లేదా శ్వాస బిగపట్టడమో కాదు. యోగా అంటే మీ జీవితాన్ని మీ అధీనంలోకి తెచ్చుకోవడం.

2

 

  • యోగ సాధన చేయడం ద్వారా మీ మెదడు కార్యకలాపాలనూ, మీ శారీరిక రసాయనికతనూ, ఆ మాటకొస్తే మీ జన్యు వ్యవస్ధను కూడా మార్చవచ్చు.

3

 

  • యోగా అంటే గుండ్రంగా (ఒక పరిధిలో) తిరుగుతున్న జీవితాన్ని సూటిగా ఓ సరళ రేఖలో ముందుకు సాగేలా చేయడం.

4

 

  • యోగా అంటే శక్తివంతంగా జీవించడం. కేవలం కూరగాయలు తినడం, మిమ్మల్ని మీరు మెలికలు తిప్పుకోవడం లేదా మీ కళ్ళు మూసుకోవడం యోగా కాదు.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.