బాధ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • మిమ్మల్ని మీరు దుఃఖపూరితులుగా చేసుకోవాలంటే మీకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు ఇష్టం లేనిది ఎప్పుడూ ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు.

1

 

  • మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతుంటే, ఖచ్చితంగా మీరు చెడు సాంగత్యంలో ఉన్నారనే అర్ధం.

2

 

  • ఎలాగూ జీవితం మిమ్మల్ని అన్నిరకాల గారడీలు చేస్తుంది, పల్టీలూ కొట్టిస్తుంది. మీరు వాటికి సిద్ధంగా ఉంటే, అవి ఆనందంగా చేయగలుగుతారు.

3

 

  • జీవితం అంటే ఏమిటోనన్న సరైన అవగాహన లేకపోవడం మూలంగానే మానసిక వ్యధ ఉత్పన్నమౌతుంది.

4

 

  • మనుషులు తమ స్వంత జ్ఞాపకాలు, ఉహాగానాల వల్లే బాధపడుతున్నారు, అంటే అసలు ఉనికిలోనే లేనివాటి గురించి బాధపడుతున్నారన్నమాట.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.