రండి..! జీవన సంబంధాల గురించి సద్గురు ఏమంటున్నారో, ఈ 5 సూత్రాల ద్వారా తెలుసుకుందాం.

  • తమ సంబంధాలని తార్కికంగా పరీక్షించే మనుషులు వాటిని నిలుపుకోలేరు. రెండు శరీరాలు, రెండు మనసులు, రెండు భావోద్వేగాలు ఎప్పటికీ ఒకదానికొకటి పూర్తిగా ఇమడవు.

1

 

  • మీ సంబంధం సజావుగా ఉండాలని మీరనుకుంటే, అవతలి వ్యక్తి మీకన్నాముఖ్యులని మీరెప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి.

2

 

  • బంధం అన్నది ప్రత్యేకతా భావన వల్ల వచ్చే పరిణామం. ఒక దాని నుంచి వేరొకదాన్ని మీరు ఎన్నుకున్నమరుక్షణం మీరు సహజంగానే చిక్కుకు పోతారు.

3

 

  • ఏ సంబంధమూ సంపూర్ణమైనది కాదు- అదెప్పుడూ అస్ధిరమైనదే. మనం దానిని ఏరోజుకారోజు సరిచూసుకోవాలి.

4

 

  • హార్మోన్లు ఆటలాడుతుంటే, అవి మీ దృష్టి మొత్తాన్ని తప్పుదారి పట్టిస్తాయి. మీరు అన్నీవదలి ఏ గుహలోకో వెళ్లనక్కర లేదుకాని వీటి ఆటలకు అతీతంగా గమనించ గలగాలి.

5