ఈశా యోగా కేంద్రంలో సరికొత్త అవకాశాలు!

possibilities

ఈశా యోగా సెంటర్‌లో రాబోయే కొన్ని నెలల సమయం ఎంతో ఆసక్తికరమైన సమయం కాబోతున్నది. బోధనకు, సాధనకు, పనికి సంబంధించిన అనేక కొత్త అవకాశాలకు సద్గురు తెరతీస్తున్నారు. ఈ అవకాశాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పోస్ట్ తప్పక చదవండి!


‘‘ఎంతోమంది సాధకుల ప్రగాఢ తృష్ణ  నాలోని కొంత భాగాన్ని ఈ పవిత్ర పర్వత పాదాల చెంత  వదిలేలా చేసింది.  
ఈ అద్భుత జీవులు, ఈ ఈశాలు తప్పక ప్రపంచానికి వెలుగును తీసుకువస్తారు.’’
                                                                                       – సద్గురు

‘ఈశా యోగా కేంద్రం’  సద్గురుచే సృష్టించబడి, ప్రతిష్టీకరింపబడిన ఓ శక్తివంతమైన, చైతన్యవంతమైన స్థలం. ఆశ్రమం అంతా నిరంతరం హోరెత్తే శక్తి ప్రకంపనలు మనకు మనమే విధించుకున్న అవధుల్ని దాటి ముందుకు సాగిపోయేలా మనల్ని పురికొల్పుతాయి. ఆశ్రమ జీవితంలోని ప్రతి అంశాన్నీ సాధకుని అంతర్గత ఎదుగుదలకు ఉపయోగపడే ఉపకరణంగా సద్గురు ఎంతో జాగ్రత్తగా రూపొందించారు.  ఆశ్రమమంతా వ్యాప్తమై ఉన్న సద్గురు యొక్క ఉనికి, శక్తులు జీవితంలోని అన్ని అంశాలకూ అచంచలమైన ప్రేరణనిస్తాయి.

ఈ పవిత్ర ప్రదేశ ప్రశాంతతను ఆనందిస్తూ సమయాన్ని గడిపేందుకై మిమ్మల్ని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము.  ఆశ్రమంలో మీ సమయాన్ని, శక్తినీ వెచ్చించి మీలోని అత్యున్నతమైన దానిని వ్యక్తపరిచేందుకు ఎన్నో అవకాశాలున్నాయి.

రాబోయే కొన్ని నెలల సమయం ఎంతో ఆసక్తికరమైన సమయం కాబోతున్నది.  బోధనకు, సాధనకు, పనికి సంబంధించిన అనేక కొత్త అవకాశాలకు సద్గురు తెరతీస్తున్నారు.  ఎన్నో లక్షల  ప్రజలు మీ ద్వారా ఈ అవకాశాల గురించి తెలుసుకోగలుగుతారు. సద్గురు తెరతీస్తున్న అవకాశాలలో కొన్నింటిని ఈ కింద పేర్కొన్నాం.

•    ఫుల్ టైం, పార్ల్ టైం టీచర్లుగా సద్గురు బోధనలను అందించవచ్చు
•   ‘ఈశా హోం స్కూల్’ లేక ‘ఈశా సంస్కృతి’లో బోధించవచ్చు
•    పదిహేను రోజులు దేవి సేవ చేయవచ్చు
•    మూడు రోజులు మౌన వ్రతం ఆచరించవచ్చు
•    ఆశ్రమంలో సమ్యమ సాధన చేయవచ్చు
•    తాత్కాలిక లేదా దీర్ఘకాళిక ప్రణాళికలలో పాల్గొని మీ నైపుణ్యాలను, స్కిల్స్‌ను అందించవచ్చు

ఈ అవకాశాల గురించి మరింత సమాచారం కోసం  దయచేసి    vinesh.nageshwaran@ishafoundation.org

లేదా  8500048000  ద్వారా ‘వినేష్’ను సంప్రదించండి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert  • m.n.vusharani

    shivaya guve namaha…..telugu lo isha blog chuse chala happy feel ayyanu.isha guru ”nadiche sivudu;;