Sadhguruమీ జీవితంలో ప్రతీ రోజు, ప్రతీ గంట, ప్రతీ క్షణం మీ ఎదుగుదలకే దోహదపడుతూ ఉండాలనుకుంటే, అదో ముందడుగై ఉండాలి. ఆ అడుగు, మీరు చిక్కుకుపోకుండా ముందుకు వెళ్ళడానికి దోహదపడాలంటే, మీరు గుర్తుంచోకోవలసిన ముఖ్యమైన  విషయం –పరమోన్నతమైన నిత్య  సత్యంతో మీరు ఎప్పుడు అనుసంధానులై ఉండాలి. మనల్నిమనం ఒక పరిమితిలో ఉన్న వాటితో గుర్తించుకోవడం మొదలుపెడితే ఇక మన చుట్టూ ఉన్న విషయాలన్నిటితోనూ అలా గుర్తించుకుంటూనే ఉంటాం. మీరు కొన్ని కుటుంబాలలో చూస్తే,ఎవరి కంచాలు వారికుంటాయి,ఆ కంచాల్లోనే వాళ్ళు భోజనం చేస్తారు. ఒకవేళ ఆ  కంచాలు తారుమారయ్యాయనుకోండి పెద్ద గొడవైపోతుంది. ఈ పళ్లాలకి ఏమీ రుచి  ఉండదు..., పోనీ అవి మీకేమైనా పోషకాహారాన్నిస్తాయా అంటే అదీ లేదు. కానీ ‘ఇది నా కంచం’ అన్న ఆలోచన అక్కడ చాలా ముఖ్యమైపోతుంది.

మీరు ఏదైతే ముట్టుకుంటారో, దేనిమీదయితే కూర్చుంటారో, వేటి మీద మీ దృష్టి నిలుపుతారో వీటన్నిటితో మిమల్ని మీరు గుర్తించుకుంటూ ఉంటారు. దీని అర్ధం ఏవిటంటే, చాలామంది ఈ పని చేస్తూ ఉంటారు, వాహనం నడిపే వాడికి ఎలా డ్రైవ్ చేయాలో తెలీదనుకోండి, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను నడిపే వారి వాహనం చూస్తే బ్రేక్ లైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే, ఓ చేయెప్పుడూ  బ్రేక్ మీదే ఉంటుంది. ఓ కాలెప్పుడూ కిందే ఉంటుంది. ఇలాంటివాళ్ళు ఓ రభస సృష్టిస్తారు. ఒకవేళ మీరు నిజంగా ముందరికి వెళ్ళాలనుకుంటే మీ  రెండు కాళ్ళుపెడల్స్ పైనే ఉండాలి కదా. అవసరమైతే తప్ప బ్రేక్  వేయకూడదు.

మీరిది  చూసారా..? ఎప్పుడు ఆలా బ్రేక్ పట్టుకుని వెళ్తూ ఉండే వాళ్ళని చూసారా..? వాళ్ళ బండి బ్రేక్ లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇలా  ఎందుకు చేస్తారంటే బ్రేక్ పట్టుకుని ఉంటే అదేదో ఓ రక్షణ అనుకుంటారు. ఆలా బ్రేకులు వేసి ఉంచడం. మీరు దీనితో,దానితో, మరో దానితో ఇలా  మిమల్ని మీరు గుర్తించుకుంటూ పోతూ ఉన్నారనుకోండి మీరు కూడా అలాగే తయారౌతారు. అన్నిచోట్ల మిమల్ని మీరు ఆలా కట్టేసుకున్నట్టే . ఓ పక్క ఇలా కట్టేసుకుని మీ నావ ముందరికి వెళ్తుంది అని అనుకుంటున్నారు. అది మునగదు సరే..కానీ, ముందరికెలా వెళ్తుంది? వెళ్ళగలిగింది ఒకే ఒక చోటు ఉంటుంది. సత్సంగత్వే  నిసంగత్వం.. అంటే ఇదే.

ఈ నాలుగు వాక్యాలూ మీకేంచెపుతున్నాయంటే... మీరు కనుక సత్యంతో అనుసంధానమై ఉంటే, మీ బంధాలు కేవలం బంధాలుగా ఉండిపోతాయి. ఇవి బంధనాలుగా మారవు. మీకు జీవితంలో పూర్తి నిమగ్నత అంటే ఏమిటో తెలుస్తుంది, అంతేకానీ మీరు జీవితవలయంలో చిక్కుకుపోరు. ఎందుకంటే ఇందులో సరైనది, సరికానిదేదీ లేదు. మీరు ఇలా కట్టేసుకుని ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటే అది మీకు చాల శ్రమే అవుతుంది. ఇలా ఐన తరువాత, “ఆమ్మో, జీవితం అంటే ఒక పెద్ద ప్రయాస” అని అనుకుంటారు. అవును, నిజమే మీరు మీ బ్రేకులు పూర్తిగా వేస్తూ ముందుకు వెళ్ళాలి అని  అనుకున్నారనుకోండి, అప్పుడు బండి ఇలా నడిపించడం అన్నది ఓ బాధాకరమైన విషయమే. అందులో ఏం సందేహం లేదు.

మీరు ఓ కోతి కంటే ఇంకొంచెం మెరుగ్గా జీవిస్తుండవచ్చు, కాదనను... కాని దీన్ని మీరు పరివర్తన అని అనలేరు.

ఇలానే ఎవరైనా ఇలా ముందుకు వెళ్ళాలనుకుంటే...వారి జీవితానుభావం పాకుతున్నట్లుగా కాక ... విహంగంలా పైకి ఎగరాలనుకుంటే పరివర్తన చెందాలి. పరివర్తన అంటే చాల్స్ డార్విన్ చెప్పిన విధంగా  ఆలోచిస్తున్నారనుకోండి, అంటే మీ వెన్నెముక ఇంకొంచెం పొట్టిగా అయింది ఇదివరకెప్పుడో చాలా పొడుగ్గా, అలా వేలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇది కాస్త పొడవు తగ్గింది కాబట్టి మడచాల్సిన అవసరం లేకుండా మీరు ఇంకొంచెం సౌకర్యంగా కూర్చోగలుగుతున్నారు. మీరు ఓ కోతి కంటే ఇంకొంచెం మెరుగ్గా జీవిస్తుండవచ్చు, కాదనను... కాని దీన్ని మీరు పరివర్తన అని అనలేరు. ఇది కోతి జీవితంలో కంటే మరెన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది, విధ్వంసకరమైనది.

అయితే ‘పరివర్తన’ అన్న పదానికి ఇదే  నిర్వచనమైతే పర్వాలేదు. కానీ మీరు ఎప్పుడూ ఆలా ఎదుగుతూనే ఉండాలి అనుకుంటే మాత్రం ప్రతిరోజు, ప్రతీ గంటా, ప్రతీ క్షణం ఈ ఎదుగుదలలోనే ఉండాలని కోరుకుంటే మీరు మీ కాలిని బ్రేక్స్ మీద నుంచి తీసేయాలి కదా. మీరు కార్ నడిపిస్తున్నారనుకోండి.. ఎప్పుడు యాక్సిలేటర్ నొక్కి  పట్టుకొనక్కర లేదు. కాసేపు నొక్కి వదిలేసారనుకోండి ఎటువంటి ప్రదేశంలో నడిపిస్తున్నారు అన్న దాన్ని బట్టి బండి సాఫీగా వెళ్లి పోతూ ఉంటుంది. మీరు బ్రేక్ వెయ్యకుండా ఉంటే చాలు. జీవితం కూడా ఇలాంటిదే. ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా ఇలాంటిదే. సాధన కూడా అటువంటిదే. మీరు ఒకసారి దాన్నిలా తొక్కి పట్టి వదిలేస్తే అది నడుస్తూ ఉంటుంది. కాకపోతే మీరెప్పుడు బ్రేకులు వేసి దాన్ని ఆపుతూ ఉండకూడదు.

చూసినవాటన్నిటితోనూ మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ పొతే, వాటితో మీరు ఓ రకమైన  బంధనం ఏర్పర్చుకుంటారు, మీరు కాని దానితో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ ఉంటే మీ ప్రయాణం అసత్యం నుంచి సత్యానికి కాదు, మీరసలు సత్యోన్న్ముఖులు అవడం లేదు. మీరు సత్యం నుంచి, నిజం నుంచి, ఒకరకమైన భ్రమలోకి, అసత్యం వైపుకు నడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ముందుకెళ్ళలేరు. ఈ బంధనాలలో చిక్కుకుపోతారు. దీని వల్ల మీ ఉనికి ఏమిటో మీకర్ధం కాదు. ఇందులో మీ నైజమేమిటో(ఉనికి స్వభావం) మీకు తెలీదు. సత్యమైనది, నిజమైనది ఏదీ మీ అవగాహనలోకి రాదు. ఇదంతా కేవలం మీ ఊహాలోకంలో సాగుతున్న నాటకం మాత్రమే. ఇది ఎంత పెద్ద ముసురులా కమ్మేస్తుందంటే జరుగుతున్న వాస్తవాన్ని మీరు చూడలేకపోతారు.

ఒకవేళ మీరిలా కూర్చునుండగా ఇక్కడో పెద్ద గాలి దుమారం లేచిందనుకోండి ధ్యానలింగం మీ ఎదురుగానే ఉన్నా మీరు దాన్ని చూడలేకపోతారు. ప్రస్తుతం జరిగేదిదే, మీ మనసులో తరచూ ఇలాంటి  గాలి దుమారాన్ని లేపుకుంటున్నారు. మీరు కానీ వాటితో మిమ్మల్ని మీరు పోల్చుకొని చూసుకోవడం  వల్ల, మీరు కానివన్నీ ‘నేను’ అని అనుకోవడం వల్ల, అసత్యం నుంచి సత్యం వైపుకు  నడవడం లేదు. పైపెచ్చు సత్యం నుంచి అసత్యం వైపుకి నడుస్తున్నారు. సరే నా సంబంధం ఎటువంటిది అన్నది కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ సమస్య ఏవిటంటే మీరు కాని దానితో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారు. మీరు మీది కానిదంతా మీరనుకుంటున్నారు. అది ‘మీరు’ అన్న భ్రమ కలిగించుకుంటున్నారు. ఈ సృష్టిలో ఏది కూడా మీరు కాదు. ఎందుకంటే ఏదైతే జరుగుతోందో అదంతా మీ ద్వారానే జరుగుతోంది. అందుకని మీరు అది ఎలా ఉంది ఆలా అట్టేపెట్టారనుకోండి, అది ఈ బ్రహ్మాండాన్నంతా మీకు చూపించగలుగుతుంది. అదే దానికి మసిబారేలాగా చేశారనుకోండి, అది మీకు ఎదురుకుండా ఉన్నది కూడా కనబడనివ్వదు.

ఈ జీవితం దాని స్వస్థానానికి ఎందుకు చేరుకోలేకపోతోందంటే  ప్రతి క్షణం మీరు మీ దృష్టిని మార్చేస్తూ పోతున్నారు

మీరు ఒక నిర్మోహస్థితి లో ఉన్నారనుకోండి అంటే మీరు దేనితోనూ మిమ్మల్ని మీరు గుర్తించుకోకుండా ఉండగలిగితే ఓ సుస్థిర స్థితికి చేరుకుంటారు. ఓసారి ఈ స్థిర స్థితికి చేరుకున్నాకా ముక్తి అన్నది మీకు దొరక్కుండా పోదు. ఎవ్వరూ దీన్ని కాదనలేరు. ఈ జీవితం దాని స్వస్థానానికి ఎందుకు చేరుకోలేకపోతోందంటే  ప్రతి క్షణం మీరు మీ దృష్టిని(ఫోకస్ ని) మార్చేస్తూ పోతున్నారు, మీ దృష్టి కోణాన్ని మార్చేసుకుంటున్నారు. మీ దృష్టిని దేనిమీదా నిలకడగా ఉంచకుండా అలా మార్చేస్తూ పొతే కొంతకాలం తరువాత (దీనికి మార్గం తెలీకుండా పోతుంది) అంతా అగమ్యగోచరమౌతుంది . ఈ జీవితం ఎంతో కష్టభూయిష్టంగా అనిపిస్తూ ఉంటుంది.

అయితే ఈ సంక్లిష్టత అంతా మీ మానసిక స్థితి లో మాత్రమే ఉంది, నిజానికి  జీవితం ఎంతో సరళమైనది. జననం అనేది మీ చేతులలో లేదు. మీరు జీవించాలి, ఏదో ఒకరోజున మరణించాలి, అంతే. ఇవికాక మిగితావేవైనా ‘తప్పనిసరిగా చేయాలాల్సిందే’ అని చేస్తున్నారా? జననం, మరణం అంతే. ఈ మధ్యలో మీక్కావలసిందేదో మీరు చేసుకోవచ్చు. ఎంతో సరళమైనది కదూ. లేదు, లేదు, లేదు కానీ .. కానీ.. కానీ.. అనచ్చు. అదంతా మీరు సృష్టించుకున్నది మాత్రమే. ఈ ప్రకృతి అన్నది కేవలం మీకు రెండు విషయాల్నే నిర్ణయించింది. మీరు పుట్టాలి, మళ్ళీ మీరు మరణిస్తారు అంతే. / మీ జననం ..మీ మరణం ...అంతే.

మీకో ఎక్స్ పైరీ డేట్ ఉండడం సంతోషకరమైన విషయమే కదా. ఈ వాస్తవాన్ని మీరు హర్షించారా..? నాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఒకవేళ మనకీ ఎక్స్ పైరీ డేట్ లేదనుకోండి మీ చేత ఓ క్షణం పాటైనా ధ్యానం చేయించగలమా? మీరే అమరులైతే ఇక నేను మీకేమైనా చెప్పగలనా? కేవలం మరణం అన్నది ఒకటుంది కాబట్టే మీరేం ఏం చేసినా, చేయకపోయినా సమయమనేది అలా సాగిపోతూ ఉంటుంది. ఏది మీ కోసం ఆగదు. ఒకవేళ దాన్ని ఆపగలిగారనుకోండి ఇక మీరు ధ్యానం చేస్తారా? ధ్యానమే కాదు .. ఏదీ చేయరు. దాన్ని ఆపలేరు కాబట్టి అది అలా సాగిపోతోంది... క్షణ క్షణానికీ అది దగ్గర అవుతోంది. ఈ మధ్యకాలంలో మీ వివాహం జరిగి ఉండచ్చు. కానీ  మీరు మరణానికి ఆసన్నమౌతూ ఉన్నారు. మీకంటూ నిర్ణయించబడ్డ  ఒకే ఒక్క విషయమేమిటంటే మీరు ఏదో ఒక రోజుకాల గర్భంలో కలిసిపోవాలి.

ఈ మధ్యలో మీరేం చేసుకుంటారన్నది అంతా మీ ఇష్టమే . ఈ ఒక్కటీ అర్ధం చేసుకుంటే చాలు. మీరు పుట్టినప్పుడు ఏవీ నిర్ణయించబడలేదు.. అప్పుడు మీకు జరగాల్సిందల్లా సమయానికి కడుపులోకి ఆహారం పడడం,అంతే! ఒకసారి కడుపు నిండిందంటే మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఉన్నది ఇంతే..! కావాలనుకుంటే దీన్ని సంక్లిష్ట పరచుకోవచ్చు, కానీ ఇది ఎంతో సరళమైన ప్రక్రియ. మీ మనస్సు దాన్ని ఎంతో సంక్లిష్టంగా చేస్తుంది. పిచ్చివారిలా చేస్తుంది. దీన్నెంత సంక్లిష్టంగా మారుస్తోందంటే,  పొద్దున్నే లేవడం అన్నది కూడా ఓ పెద్ద ఆర్భాటంమౌతుంది. ఓ రోజును గడపడం అన్నది కూడా ఇంకెంతో  సంక్లిష్టంగా మారుస్తోంది.

అన్ని మీకు జరిగేలాగా చేసుకోవడం జీవితం, మరణమాసన్నమైనప్పుడు దాన్ని ఒకరకమైన నమ్రతతో స్వీకరించాలి

ప్రతిదీ, ప్రతిదీ ఎంతో కష్టంగా, ఓ చిక్కుల వలయంలా మారిపోయింది. ఒకవేళ మీ శ్వాసననీ, మీ గుండెనీ, కణాలనీ ,శరీరంలో రక్త ప్రసరణనీ మీరు నియంత్రించాల్సి వచ్చిందనుకోండి, అంతే కాదు..మీలో జరిగే రసాయనిక చర్యలనీ నియంత్రించాల్సి వచ్చిందనుకోండి...ఆమ్మో..! మీరు ఊహించగలరా..? అంత దాకా ఎందుకు ,మీ శ్వాసను ఒక  ఐదు-పది నిమిషాలు నియంత్రించి చూడండి. మీరు తలకిందలైపోతారు!.ఇక మీ జీవన ప్రక్రియనంతా మీరే నియంత్రించాలంటే ఏం జరిగేదో తెలీదు! ఇలా అన్నీ వాటంతట  అవే జరుగుతున్నాయి.  మీరు శ్వాసను తీసుకుంటున్నారు, మీకన్నీ  జరిగిపోతున్నాయి. మీకు తెలిసినా, తెలియకపోయినా ఇవన్నీ జరిగిపోతున్నాయి. మీరు దాన్ని లెక్క చేసినా, చేయకపోయినా అన్నీసాఫీగా సాగిపోతున్నాయి. ఉన్నదల్లా ఇంతే..! జీవితమనేది దానంతటదే జరుగుతుంది. మీరు మరణించాలి, అంతే ..! అది కూడా దానంతట అదే జరుగుతుంది. అన్ని మీకు జరిగేలాగా చేసుకోవడం జీవితం, మరణమాసన్నమైనప్పుడు దాన్ని ఒకరకమైన నమ్రతతో స్వీకరించాలి..మీరు చేయవలసిందల్లా ఇంతే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

pixabay