About
Wisdom
FILTERS:
SORT BY:
మీరు మీ గర్వాన్ని, మీ అహాన్ని ఇంకా మీరే గొప్ప అనే దృక్పథాన్ని ప్రక్కకు పెడితే, మీరు అనుగ్రహానికి పాత్రులవుతారు.
మీరు ఎరుకతో స్పందించగల స్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రతికూలతా మీకు అవాంతరం కాదు.
ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ప్రజ్వలిస్తూ ఉండటం, పారవశ్యంలో ఉండటం. శాంతి కలిగేది మీరు శాశ్వత నిద్రలోకి వెళ్ళినప్పుడే.
తన లోపలా ఇంకా బయటా ఉన్న నిశ్చలతను తాకని వ్యక్తి, చలనంలో తప్పకుండా దారి తప్పిపోతాడు.
మీకూ మీ శరీరానికీ మధ్య, అలాగే మీకూ మీ మనసుకీ మధ్య కొంత దూరాన్ని ఏర్పరచగలిగితే, అదే ఇక దుఃఖానికి అంతం.
మీరు ఈ ప్రపంచంలోకి ఉత్త చేతులతో వచ్చారు, ఇక్కడ నుండి ఉత్త చేతులతోనే వెళతారు. మీ జీవితానుభవాలు మిమ్మల్ని ఎంతగా సుసంపన్నం చేస్తాయి అనే దానిలోనే మీ జీవితపు సంపద దాగి ఉంది.
మీ శక్తులన్నీ ఒకే దిశలో కేంద్రీకృతమైతే, జ్ఞానోదయం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే, అసలు మీరు అన్వేషిస్తున్నది మీలోనే ఉంది.
పునరావృత జీవన సరళిలో భద్రత ఉంటుంది, కాని అందులో సంభావ్యతలు గాని, అభివృద్ధి గాని ఉండవు.