Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
యోగా అంటే ఐక్యం. దాన్ని మీరు క్రమశిక్షణతో చేరుకుంటారా లేక పరుత్యాగంతో చేరుకుంటారా అన్నది మీ ఇష్టం.
ప్రజలు చక్కగా కలిసి జీవించగలిగేది, ఒకరికొకరు ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించుకున్నప్పుడే, అంతేగాని ఒకరిపై ఒకరు అభిప్రాయాలు ఏర్పరచుకున్నప్పుడు కాదు.
ప్రతిరోజు కాకపోయినా, కనీసం నెలకి ఒకసారి, పద్దు చూసుకోండి - మీరు మెరుగైన మనిషిగా పరిణితి చెందుతున్నారా లేదా అని.
ధ్యాన లింగం, దైవత్వం తీసుకోగల అత్యంత ఉన్నతమైన రూపం - మిమల్ని మరేది లేక మరెవరూ తాక లేని పార్శ్వంలో స్పృశించే ఒక సజీవ గురువు.
మీ శరీరం, మనసు ఇంకా శక్తులు తగినంతగా సన్నద్ధమై ఉన్నట్లయితే, సరైన అవగాహనతో చేసే ఉపవాసం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
యవ్వనంగా ఉండడం అంటే - మిమ్మల్ని పరిమితం చేసుకోలేదని - జీవితానికి సుముఖంగా ఉన్నారని. పరిణామం చెందటానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, జీవితానికి నిరంతరం సుముఖంగా ఉన్నారని.
ధ్యానం అంటే, బయటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మీకు కావాల్సిన విధంగా మీ అనుభూతిని సృష్టించుకోగలగడం. ఊరికే అలా ఇక్కడ కూర్చొని, మీ రసాయనికతను పారవశ్యంగా మార్చుకోవచ్చు.
మీరు మీ జీవితాన్ని ఎరుకతో నిర్వహిస్తారా లేక ఎరుక లేకుండా నిర్వహిస్తారా అనేదే, మీ జీవితపు స్వభావాన్ని, పరిస్థితులను అలాగే నాణ్యతను నిర్ణయిస్తుంది.