About
Wisdom
FILTERS:
SORT BY:
మనం వేరే గ్రహానికి వెళ్ళే ముందు, ఈ గ్రహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలి. లేదంటే, మనం ఇక్కడ చేసిన పిచ్చి పనులే అక్కడా చేస్తాము.
సందేహించడం, దురభిప్రాయం కలిగుండడం అనేవి రెండు వేర్వేరు విషయాలు. దురభిప్రాయం కలిగుండడం అంటే మీరు ముందే ఒక అభిప్రాయానికి వచ్చారని. సందేహించడం అంటే మీరు సత్యాన్వేషణ చేస్తున్నారని.
దేవుడు సృష్టి కర్తే గానీ, నిర్వాహకుడు కాదు. మన జీవితాలను మనమే నిర్వహించుకునే భాగ్యం మనుషులుగా మనకి ఇవ్వబడింది.
సత్యం దిశగా వెళ్ళడం అంటూ ఏమీ లేదని, దానికి అందుబాటులో ఉంటే అది ఇక్కడే ఉందని గౌతమ బుద్ధుడు తెలుసుకున్నది ఈ రోజే.
మీ జ్ఞాపకాలు, అనుభవాలు ఇంకా ఊహలు అన్నీ కలగాపులగమైతే, అప్పుడు మీరే ఒక పెద్ద గందరగోళం!
మీరు ఎదిగి, వృద్ధిచెంది, వికసించి ఆపై లయం కాగల సారవంతమైన మట్టే సద్గురు
ఈ జీవితాన్ని మీరెంత విజయవంతంగా సాగిస్తారనేది, మీలోని స్పష్టత మీదే ఆధారపడి ఉంటుంది.