Wisdom
FILTERS:
SORT BY:
ఒక మనిషిగా ఉండటంలోని నిజమైన విలువను తెలుసుకోవాలంటే, మీరు వేయాల్సిన అతి ముఖ్యమైన అడుగు - లావాదేవీల నుండి పరమార్థం వైపుకు వెళ్ళడమే.
మీరు పరిణితి చెందాలంటే, అందులో అధిక భాగం మీ శరీరంలో జరగాలి, ఎందుకంటే మనసు కన్నా శరీరంలోనే ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయి.
మీ గురించి మీకు తెలియనప్పుడు మాత్రమే, ఇతరుల అభిప్రాయాలు మీకు ముఖ్యమవుతాయి.
మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకునేందుకు వీలైనన్ని విధాలా ప్రయత్నించి, అవేవీ నిజంగా పని చేయడం లేదు అని మీరు గ్రహించినట్లయితే, మీరు అసలు విషయానికి వచ్చినట్టు: ‘ఇక ఇప్పుడు, యోగ’
వాడి, పడేయడం' అనే మనస్తత్వానికి ముగింపు పలకడం అంటే కేవలం కాలుష్యాన్ని తగ్గించడం కోసం అని కాదు- ఇది ఈ సమస్త సృష్టికి మనమిచ్చే గౌరవం. ప్రతిదీ సజీవమైన భూమి నుండే వస్తుంది. మనం దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకుందాం.
దైవం అనేది ఏదో స్వర్గం నుండి దిగివచ్చినది కాదు - మీరు ఉన్నతమైన సంభావ్యతల్లోకి పరిణితి చెందడానికి, అది ఒక నిచ్చెన.
జీవితం ఒక బహుమతీ కాదు లేక ఓ శిక్షా కాదు; ఇదొక అద్భుతం. మీరు సరిగ్గా స్వారీ చేస్తే అందంగా, అద్భుతంగా అవుతుంది. సరిగ్గా చేయలేకపోతే, ఇది ఘోరంగా, భారంగా మారుతుంది.
సాంప్రదాయం అంటే ముందు తరాల వారిని అనుకరించడం కాదు. వారి అనుభవం నుంచి నేర్చుకోవడం.
ప్రతిచర్య అనేది ఒకరి గత జ్ఞాపకాలు ఇంకా నిర్ధారణలపై ఆధారపడి ఉంటుంది. స్పందన అనేది ప్రస్తుత క్షణంలో సచేతనంతో చేసే ప్రక్రియ. స్పందించడం నేర్చుకోండి, ప్రతిచర్య వద్దు.
ఈ ఉనికిలోని చలనమంతా కేవలం ఉపరితలంపై ఉండేదే. అసలైనది ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది.
ధ్యానం అనేది సామర్థ్యానికి సంబంధించిన విషయం కాదు. అది సుముఖతకు సంబంధించినది.
మీరు ఎంత ఎక్కువగా భద్రతను కోరుకుంటారో, అంత ఎక్కువగా అభద్రతకు లోనవుతారు. అసలైన భద్రత పరిత్యాగ స్థితిలో మాత్రమే ఉంటుంది.