ప్రశ్న: “మీరు మా గురువు” అని ఎలా అనుకోగలం?

సద్గురు: మేము మీ మీద పనిచేయడం మొదలుపెట్టాక మీరీ మాట అనకపోవచ్చు. అందుకే తొందర పడకండి. మొదటి రోజే తొందరొద్దు. మీతో పని మొదలెడితే, మీ చుట్టూ ఉన్నవారిపై కొనాళ్ళపాటు మీకు ద్వేషం కలగచ్చు. అది ప్రేమగా మారటానికి మరికొంత సమయం పడుతుంది.ఔను.మొదట మీరు ఎం చేసినా మీకు బాధ కలుగుతుంది. అప్పుడు మీకు ఆ పని చేయించిన వారిపై కోపం వస్తుంది. ఫలితాలు రావడానికి కాస్త సమయం అవసరం. ఒకసారి వీటి లాభాలు తెలిశాక, మీరు మాతో మళ్ళీ ప్రేమలో పడవచ్చు. అంతవరకూ మేము ఆగుతాం. మీరు ఇక్కడ కూర్చుని గురువుని ఎంచుకోకండి. ఇక్కడ ఉండండి.అదే జరుగుతుంది.

విలువైనది ఇక్కడుందని అర్ధమైతే, అది జరుగుతుంది.లేకపోతే పర్వాలేదు. నేను ఎవ్వరికీ గురువవ్వాలని అనుకోవట్లేదు. మీకు కావాలంటే, నేను సహాయం చేస్తాను. లేదా మీరు సొంతగా చేస్తానంటే అదీ పర్వాలేదు. నాకేం సమస్య?. ఒక్క విషయం ఏంటంటే, తెలీని దారిలో మీరు వెళ్తుంటే, మీకు తెలీని చోటుకి మీరు వెళ్తుంటే, మీ పక్కనున్న దాన్ని వెతకటానికి, ప్రపంచం అంతా తిరిగి కూడా  దాన్ని తెలుసుకోలేకపోవచ్చు. ఒక గురువు అంటే GPS లాంటివాడు. మీరు GPS తోనే డ్రైవ్ చేస్తారా? ఎక్కణ్ణించి వచ్చారు? ఏ దేశం?.

శ్రోత:mexico..

సద్గురు:mexico నా..mexico లో మీరు GPS వాడతారా?.... అప్పుడప్పుడా...సరే... రోడ్లు ఉన్నచోట...(నవ్వు). మీరు GPS వాడితే, ఒక విచిత్రమైన గొంతు మిమ్మల్ని right తీస్కోమంటుంది.మీరు తీస్కుంటారు. left తీస్కోమంటుంది, తీస్కుంటారు.U turn తీస్కోమంటుంది. తీస్కుంటారు.ఇదేగా చేసేది.అలాగే ఇవాళ మీరు గురువుకి సిద్ధమై వచ్చారు. -GPS అంటే గురు positioning system, తెలుసా.(నవ్వు).  మీరు ఇక్కడికి సిద్ధంమై వచ్చారు. మీరు గురువుల  shopping చెయ్యకండి.అలా చెయ్యకండి. మిమ్మల్ని ఏదైనా తాకిందంటే, అది దొరికినట్టే .మీకు ఏదీ తాకనప్పుడు, ఎందుకు, సమయం వృధా?.అంతేగా?.

గురువంటే మీరు చూసే వ్యక్తి కాదు. ఓ వ్యక్తిగా నేను చాలా ఘోరం అని- అందరికీ తెలుసు.ఎప్పుడూ ఏదో ఒకటి ఎత్తి చూపిస్తూ ఉంటా. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు. అదృష్టం కొద్దీ అది ఒక వ్యక్తి ద్వారా జరుగుతోంది అంతే. ఇదే ఆ పక్షి ద్వారా జరిగితే, అది మీకు యోగా నేర్పుతోందేమో.కానీ మీకు అర్ధం కాదు కదా!.ఉ... మీకర్ధమౌతుందా ఆ పక్షి మాట?. అది ఎంతో గొప్ప జ్ఞ్యానాన్ని చేబుతోందేమో. కానీ మీకది అందదు. అది మీ లాంటి ఇంకొక ప్రాణి వల్ల జరుగుతోంది కాబట్టీ అది మీ అదృష్టం.అది ఒక బండరాయి చెప్తే అర్ధంకాదు. ఒక పక్షి చెప్తే అర్ధం కాదు, ఒక పాము చెప్పినా అర్ధం కాదు. అలా ఇదివరకు జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతోంది.కానీ ప్రజలకది అర్ధం కాదు.

ఒకవేళ ఇక్కడికొక నాగుపాము వచ్చి .... గురువుగా..(ఉష్... అని శబ్దం చేస్తారు) నేర్పితే మీకు అర్ధం కాదు ఔనా? మీలా ఉన్న ఇంకొక జీవం ద్వారా అది జరగటం అనేది మీకున్న చక్కని అవకాశం. అందుకే వ్యక్తిలో మునిగిపోకండి. ఒక వ్యక్తి ద్వారా ఏదో జరుగుతోంది. దాన్నికి ఎదురు వెళ్ళకండి. గురువంటే మీరు ఇంటికి పట్టికెళ్ళ గలిగిన ఒక వస్తువు కాదు. మీ చీకటిని పోగొట్టగలిగే పార్శ్వం మీకు అనుభవమైతే, అదే మీతో వస్తుంది. దాన్ని తీసుకెళ్ళే పనిలేదు. నన్ను మీరు మీ సంచిలో పట్టికెళ్ళక్కర్లేదు.మిమ్మల్ని తాకే అవకాశం ఇస్తే అదే మీ వెంటపడి వస్తుంది.దాన్నెవరూ ఆపలేరు.అదే మీకున్న సమస్య. మీరు నన్ను వదుల్చుకోలేరు. mexico వెళ్ళినా సరే.