ఆదివారం సెలవు ఎందుకు ఇస్తారు?

మన సంస్కృతిలో ముఖ్యమైన రోజులు పౌర్ణమి, అమావాస్యలు. అలాంటప్పుడు మనకు ఆదివారం సెలవు ఎందుకు వచ్చినట్టు? సద్గురు మనకు సమాధానాన్ని ఇస్తున్నారు. ఆదివారం ఉదయం ఏం చేస్తారు అని సద్గురు మనల్ని ప్రశ్నిస్తున్నారు. బ్రిటిష్ వారికి ఆదివారం అవసరం కాబట్టి అది నిర్ణయించారు, కాని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మనం సెలవు దినాలని అలాగే కొనసాగిస్తున్నాము అని, దీన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుచేస్తున్నారు.
 

ప్రశ్న: నమస్కారం సద్గురు. ఇంత గొప్పగా ఇంత మంది శిష్యులతో ఇక్కడ  జరుగుతున్న గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొనే అవకాశం మీరు నాకు ఇచ్చారు. కానీ నాకు ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే, మనందరం... ముఖ్యంగా భారతీయులం, ఆ భగవంతుడు, తల్లిదండ్రుల తరువాత గురువుకే ఉన్నత స్థానం ఇస్తాం. కానీ మనం గురుపూర్ణిమ ఉత్సవాన్ని మాత్రం గురువు మీద ఉన్న భక్తిని ప్రతిబింబించేలా అంకితభావంతో ఎందుకు చేసుకోలేకపోతున్నాము?

సద్గురు: మన దేశంలో, ఈ గురుపూర్ణిమ, ఇంకా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఎన్నో పండుగలు, మరుగున పడిపోయాయి- మన జీవితాల్లో. ఎందుకంటే, కొంత కాలం మనదేశం ఆక్రమణకు గురికావడం జరిగింది. మనని ఆక్రమించుకున్న వారు మనకి ఓ చట్రాన్ని అమర్చారు. స్వాతంత్యం వచ్చాక, మనం మన దేశానికి ఎలాంటి విధానం కావాలో సరిచూసుకోవలసింది. మనమది చేయలేదు. అదే అమరికని అలాగే కొనసాగించాం.

ఉదాహరణకి, ఈ దేశంలో ప్రాచీనకాలం నించి కూడా, ఒక పొలం పని చేసే రైతు, ఈ రోజుల్లో కూడా, చాలా మంది రైతులు సోమవారాలు వారి పొలాలను దున్నరు.అంతేగా.తమిళనాడులో ఇప్పటికీ అంతే.ఉత్తర భారతంలో ఇది వదిలేశారు, ఎందుకంటే, జంతువుల్ని కాకుండా ట్రాక్టర్ లను వాడుతున్నారు వాళ్ళు. బ్యాంకు ఋణం తీసుకోవటంతో వడ్డీ పడుతూ ఉంటుంది, అందుకే ఏడు రోజులూ పని జరగాల్సిందే. ఇవన్నీ ఉన్నాయ్.

బ్రిటిష్ వారు వచ్చినప్పుడు, మన పద్ధతులు మార్చారు.ఎందుకంటే, మన దేశ శక్తిసామర్ధ్యం, మన సంస్కృతిలోనే ఉందని వారు గ్రహించారు. వాళ్ళు ప్రణాళికా బద్ధంగా, చాలా క్రమపద్ధతిలో ఈ సంస్కృతిని మార్చారు.ఆదివారం సెలవు చేశారు. ఆదివారం ఏంచేస్తారు? టీవీ చూస్తూ చిప్స్ తింటారు. ఆదివారం ఎం చేస్తారు చెప్పండి?.వాళ్లకి ఆదివారం ఉదయం అవసరం .ఈ దేశంలో మూడొంతులు జనాభా ఆదివారం ఉదయం ఏం చేస్తారు?.ఆదివారం ఉదయం మనం చెయ్యటానికి ఏం లేదు.సోమవారం చాలా ఉంటాయ్. కానీ మీరు ఆఫీస్ కి వెళ్ళాలి.

పౌర్ణమి, అమావాస్యలు సెలవు దినాలు కావాలి

మన దేశంలో చాలా కాలం వరకూ, నెలలో సెలవలు ఇలా ఉండేవి. పౌర్ణమి అంటే, ప్రతి పౌర్ణమికీ మూడు రోజులు సెలవులు .ఒక రోజు ముందూ, ఆ రోజు, మరుసటిరోజు.అమావాస్య అంటే, రెండ్రోజుల సెలవులు. ఈ పున్నమి , అమావాస్య రోజులకి, మన వ్యవస్థకీ సంబంధం ఉంది.ఈ గ్రహంతో సంబంధం ఉంది.మన పుట్టుకతో సంబంధం ఉంది.మనం ఈరోజిలా శరీరంతో ఉన్నామంటే, దానిక్కారణం మన తల్లుల శరీరాలు ఆ చంద్రుడి గమనాలతో ముడిపడి ఉండడమే.లేకపోతే  మనం ఉండం.అంటే,మీ శరీరంలో కొన్నిమార్పులు జరుగుతున్నాయ్.మీకు తెలుసు, ఈ రోజుల్లో సముద్రాలు కూడా పొంగుతాయని.అంతటి సముద్రాలే పొంగుతున్నప్పుడు, ఈ శరీరం-డబ్భై శాతం నీరే ఉన మన ఈ శరీరాల్లో ఏదీ పొంగదంటారా?.ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ఆ రోజులు, వెళ్లి పని చెయ్యటానికి కాదు-మీ పై మీరు ధ్యాస పెట్టే రోజులవి.

అలాగే గురుపూర్ణిమ కూడా ..ఈ దేశమంతా ఒక పెద్ద పండుగలా జరిగేది.కానీ అది పోయింది ఎందుకంటే, ప్రజలు ఉద్యోగానికి కెళ్ళాలి.అందుకే, మీరు కేంద్ర కాబినెట్ లో మంత్రి కనుక,  నాదొక చిన్న విన్నపం.మీరోకటి జరిగేలా  చెయ్యాలి.నాకు ..... (శ్రోతల చప్పట్లు) నాకు తెలుసు మీకు ఇలా  ప్రతి పౌర్ణమికీ సెలవివ్వటం అంత సులువుకాదు. కనీసం గురుపూర్ణిమ కైనా. మీరు ... కేంద్ర ప్రభుత్వం, గనుక గురుపౌర్ణమికి శెలవు ఇస్తే, ఈ దేశమంతటా గురుపౌర్ణమి వేడుకలు గొప్పగా జరిగేలా నేను చూస్తాను-ఎందుకంటే, ఆ స్ఫూర్తి ఇంకా అలాగే ఉంది.ఎవరికీ సమయం లేదు-చెప్పే అవకాశం కూడా లేదు. మీరు గనుక ఈ ఒక్క విషయం చెయ్యగలిగితే, మనం గురుపౌర్ణమిని ఈ దేశానికి ఒక పెద్ద పర్యాటక శాఖా ఆకర్షణగా చెయ్యచ్చు. నేను.. మీతో ఇదివరకు అన్నాను, భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చెయ్యాలని –గురుపౌర్ణమి ప్రపంచ నలుమూలల నించీ ఎందరోఆధ్యాత్మిక పర్యాటకుల్ని మన దేశానికి తెస్తుంది. మీ ఉద్యోగపరంగా కూడా ఇది మంచివిషయమే అవుతుంది.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1