Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
మీ మన:శ్శరీరాలు మీ నుండి సూచనలు తీసుకుంటే, మీరు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు – అది ఒక సహజ పరిణామం.
పారవశ్యమనేది కేవలం ఒక వ్యక్తి యొక్క స్వభావం కాదు - అది ఈ ప్రకృతి స్వభావం. ఈ సంస్కృతిలో మనం 'బ్రహ్మానందం' అంటుంటాం, అంటే యావత్ సృష్టి పారవశ్యంలో ఉన్నదని అర్థం.
ఈ వినాయక చవితి నాడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు, మీ ఉన్నతికీ ఇంకా ముక్తి మార్గంలో ఉన్న విఘ్నాలను తొలగించాలని కోరుకుంటున్నాను.
మీరు ఎవరు, ఏమిటి అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి మనిషిలో ఒకటి ఉంటుంది, అది మీరు ప్రస్తుతం ఉన్నదాని కంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది.
మీరు పరిపూర్ణంగా వికసించేందుకు అనువుగా మీ అంతరంగాన్ని ఇంజనీర్ చేసుకోండి.
హాయిగా ఉన్నప్పుడు, మీరు ప్రశాంతతలోని శక్తిని పొందుతారు.
మీ చుట్టూ ఉండేవారికి మీ వల్ల గొప్ప ప్రయోజనం ఎలా కలుగుతుందో చూడండి- అలా చేస్తే, మీరు సహజంగానే సముచితంగా ప్రవర్తిస్తారు.
మీ బాంధవ్యాలు ఒకరి నుండి సంతోషాన్ని పిండుకునేలా కాకుండా, సంతోషాన్ని పంచుకునేలా ఉన్నప్పుడు, మీకు ఎవరితోనైనా సరే అద్భుతమైన అనుబంధం ఉంటుంది.
ఆత్మజ్ఞానం పొందిన వారిని ద్విజులు లేదా రెండుసార్లు పుట్టిన వారిగా సంబోధిస్తాము. మీ జంతు స్వభావాన్ని విడనాడి, ఒక జీవిగా వికసించాలన్నది నా ఆకాంక్ష.
మీరు ఉదయం నిద్ర లేవగానే చేయవలసిన మొట్టమొదటి పని చిరునవ్వు చిందించడం. మీరు బ్రతికే ఉన్నారు! మీరు చిరునవ్వు చిందించడానికి ఈ గొప్ప వరం సరిపోదూ.
కర్మ మీకు బంధనం అయినప్పటికీ, మీరు దానిని సరిగ్గా నిర్వహిస్తే, కర్మ మీ విముక్తికి సోపానం కూడా అవుతుంది.
మీరు కలుపుకుపోయే తత్వంతో ఉంటే, జీవితం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఉంటే, కేవలం మీ మానసిక నాటకమే జరుగుతుంటుంది.