Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
కర్మకు మంచి చెడులతో సంబంధం లేదు, అది కేవలం కార్యకారణ సంబంధమైనది.
జీవిత రహస్యం ఏమిటంటే, ప్రతిదాన్నీ సీరియస్గా తీసుకోకుండా చూడటం, కానీ అందులో సంపూర్ణంగా నిమగ్నమై ఉండటం. ఒక ఆటలాగా - నిమగ్నమవ్వాలి, కానీ చిక్కుకుపోకూడదు.
మీ దగ్గర ఏమున్నా - మీ ప్రేమ, మీ ఆనందం, మీ నైపుణ్యాలు - అవన్నీ ఇప్పుడే చూపండి. వాటిని మరో జన్మకు పొదుపు చేయాలనుకోకండి.
మేము పునరావృత వైఖరితో జీవించాలనుకోవడం లేదు. మా జీవితాలను మేమే రాసుకోవాలనుకుంటున్నాం.
మీ జీవితంలో ఏ పరిస్థితులు తలెత్తినా, మీరు వాటినుంచి మరింత శక్తిమంతంగా బయటపడొచ్చు లేదా వాటి వల్ల చితికిపోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంటుంది.
సృష్టిలోని ప్రతి అంశం – ఒక ఇసుక రేణువు నుండి పర్వతం వరకు, ఒక నీటి బిందువు నుండి సముద్రం వరకు – మానవ మేధస్సుకు అతీతమైన ఒక చైతన్య శక్తి యొక్క అభివ్యక్తీకరణే.
మీరు వ్యక్తిని మార్చకుండా ప్రపంచాన్ని మార్చలేరు.
నమ్మడం అంటే మీకు నిజంగా తెలియని దానిని ఊహించుకోవడం. అన్వేసించడం అంటే మీకు తెలియదని గుర్తించడం.
మీరైన ఈ జీవం పట్ల మీరు శ్రద్ధ చూపితే, అది మీలోనే వికసిస్తుంది.
మీ చుట్టూ ఉండేవారి పట్ల మీకు శ్రద్ధ ఉంటే, వారు మీతో ఉండడానికి ఇష్టపడే వ్యక్తిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి.