నదుల రక్షణ ఉద్యమం: ఐదవ రోజు - పుదుచ్చేరి

 

 

మనం సద్గురుని కలుసుకునే దాకా ‘ A Man with Mission’ అనే వాక్యానికి పూర్తి అర్థం తెలుసుకుని ఉండము.

ఆయన ప్రొద్దున తిరుచ్చిలో వ్యవసాయదారులను కలవడంతో దినం ప్రారంభించారు, ఆ తరువాత అక్కడి సభా కార్యక్రమం. ఆ తరువాత ఉన్న ఒక గంట సమయంలో తిరుచ్చిలోని జంబుకేశ్వరాలయ  దర్శనం, మళ్ళీ పుదుచ్చేరికి ప్రయాణం.

దారిలో నైవేలీ లిగ్నెట్ కార్పొరేషన్ (NCL) డైరెక్టర్ నీ, సిబ్బందినీ కలుసుకున్నారు.

ఆయన రహదారిలో ఉలుంధూర్ పేటై దగ్గర జనసమూహంతో సంబాషణ. ఆ తరువాత విఝిపురంలో ‘ఈశా విద్యా’ విద్యార్థులతో సంభాషణ, రివర్ రాలీ లో పాల్గొనమని  వాళ్ళకి చెప్పడం.

మదగిపేట దగ్గర మళ్ళీ రైతులను కలవడానికి ఆగారు, రివర్ రాలీలో తాను ఏమి చేస్తున్నది చెప్పి, వారి మద్దత్తు కోరారు.

ఆ తరువాత పుదుచ్చేరి లోకి ప్రవేశించే ముందు, ప్రాతికేయులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక విలేఖరి 60 ఏళ్ళ వయసులో మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారని అడిగిన ప్రశ్నకు, "మీకు  జీవితంలో బాగా నిమగ్నమైతే, చేసేపని మీద లగ్నమైతే ప్రతిరోజూ ఇలానే ఉంటుంది" అన్నారు.

పుదుచ్చేరీలో కాస్త సమయం దొరకటంతో, నిన్న ర్యాలీతో వచ్చిన వారు ఈ  సుందరమైన నగరంలో కాస్త సేద దీర్చుకున్నారు. కొందరు ఫ్రెంచి వారు నివసించిన ప్రదేశంలో తిరిగారు, కాని బయటకు వెళ్ళిన వారందరూ చివరకు బీచ్ కే చేరుకున్నారు.

పైన నిండుగా ఉన్న చంద్రుడు, అలలు ఒడ్డును తాకుతున్నాయి, రాళ్ళను తుంపరలతో తడుపుతున్నాయి. దగ్గరలో గాంధీ విగ్రహం దగ్గర, కార్యక్రమం జరిగే చోట సౌండ్స్ ఆఫ్ ఈశా వారు మైక్ టెస్టు చేసుకుంటున్నారు.

ఈట్ స్ట్రీట్, హస్తకళల బజారు, చల్లని సముద్రపు గాలి మూలంగా సాయంత్రం ప్రోగ్రాం చాలా హాయిగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. కాంచీపురం నుంచి చిత్ర అనే ఆవిడ 170 కి.మీ, ప్రయాణం చేసి సముద్రపు ఒడ్డున ఉన్న పుదుచ్చేరీ లో ప్రోగ్రాం చూడడానికి వచ్చింది.

ఆమె ‘మొదట్లో ఈ రాలీ ఎందుకో నాకు సరిగ్గా అర్థంకాలేదు. కాని సద్గురు వివరణతో నాకు మెల్లగా అర్థమయ్యింది. ఇక నదీ స్తుతి ‘భారతం, మహా భారతం... ’ ఎంత ఉత్సాహంగా ఉందంటే వింటున్న ప్రతి సారీ నాలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మా ఊళ్ళో అందరికీ అవగాహన కల్పించడానికి చాలా కృషి చేశాను. నాకు ఇక్కడకు వచ్చి ఈ ర్యాలీలో పాలుపంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.

మహాత్ముడు ఈ ర్యాలీలో సంధాన కర్తగా ఉన్నారు. మధురైలో గాంధీ మెమోరియల్ మ్యూజియం, ఇక్కడ పుదుచ్చేరీలో జాతి పిత కనుసైగల్లో, ఈ సముద్రపు ఒడ్డునే కార్యక్రమం జరగబోతోంది.

MahatmaPondicherry-267x400

 

 

 

 

 

 

 

 

 

 

 

కార్యక్రమం తమిళ జానపద గీతం వాయించడంతో ప్రారంభమయ్యింది. సద్గురు సముద్రానికి ఎదురుగా ఉదయిస్తున్న సూర్యని వైపుకు తిరిగి ఒక క్షణం నిలుచున్నారు.

ఆ తరువాత ఆయన  పుదుచ్చేరి ముఖ్యమంత్రి తిరు. వి. నారాయణ స్వామి గారిని కార్యక్రమానికి ఆహ్వానించారు. వేదిక మీద సద్గురు, ముఖ్యమంత్రి, ఇంకా మంత్రులు తిరు. నమశ్శివాయం, తిరు. కందసామి ఆశీనులయ్యారు.

ముఖ్యమంత్రి పవిత్ర గంగా నది, ఇంకా ఇతర నదులతో తమ అనుభవాలను పంచుకున్నారు, ఇతర కారణాలు, సమస్యల వల్ల ఎన్నో ప్రాజెక్టులను అమలు చేయలేక పోవడం గురించి వివరించారు. దేశంలోని అన్ని పార్టీల వారూ కలసి వస్తే మన నదులను రక్షించవచ్చు అని అంటూ ‘ దేవుడు సద్గురుకి శక్తినిచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అన్నారు.

సరైన పిలుపుని విని, అన్ని పార్టీలకూ చెందిన రాజకీయ నాయకులు కలసి వచ్చి ఈ  కార్యక్రమానికి మద్దత్తు నిస్తున్నారని చెప్పారు. తాము ప్రయాణం చేస్తున్న 16 రాష్ట్రాలలో చాలామంది ముఖ్యమంత్రులు వెంటనే ఈ కార్యక్రమానికి మద్దత్తు తెలిపారని, వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు.

AdityaWonStateLevelCamlinEssayWritingCompetition-300x400

 

 

 

 

 

 

 

 

 

 

 

పుదుచ్చేరీలోని ఆదిత్య విద్యాశ్రమానికి చెందిన 5వ, తరగతి విద్యార్థి ఆదిత్య, కామ్లిన్ వారు నిర్వహించిన రాష్ట్ర వ్యాసరచన పోటీల్లో ‘పర్యావరణాన్ని ఎలా రక్షించాలో‘ నని తన వ్యాసంలో సలహాలిచ్చి బహుమతి పొందాడు. ‘మనం చెరువుల్నీ, వాగులనీ దత్తత తీసుకోవాలనీ, పరిసరాల్లో ఎన్నో మొక్కలు నాటి ప్రాంతమంతా పచ్చగా చేయాలని’ అన్నాడు. ఈ సందేశానికి అభివాదాలు.

పుదుచ్చేరీకి సంబంధించి సద్గురు కొన్ని ప్రత్యేక  ప్రతిపాదనలు చేశారు...

ప్రతి కార్యక్రమంలో, మనం చేయబోయే పాలసీ ప్రతినాదనలలో, దేశమంతటకీ ఉపయోగపడే కొన్ని పాయింట్లు సద్గురు వివరిస్తున్నారు. పాండిచేరి గురించి కొన్ని ప్రత్యేక పాయింట్లు ప్రస్తావించారు.

నదుల రాలీ, నదులకు ఇరుప్రక్కలా కనీసం ఒక కి.మీ. వరకు చెట్లు నాటుదామని ప్రస్తావిస్తోంది. మొత్తం భూమిలో దాదాపు 25 శాతం ప్రభుత్వానిది, దానిలో 6 నుంచి 8 శాతం భూమి డెల్టా, దానిని ఎలాగూ మార్చము, మిగతాది రైతులది. పుదుచ్చేరి లో  ఈ ప్రతిపాదలను అమలు పరచడం తేలిక ఎందుకంటే అక్కడ చాలా భాగం డెల్టా భూమి, రాష్ట్రం కూడా చాలా చిన్నది కావడం వల్ల మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అమలు చేయడం తేలిక. అందువల్ల సద్గురు, ముఖ్యమంత్రి తిరు. నారాయణ సామి గారితో ‘మిగతా దేశానికి పుదచ్చేరి ఒక ప్రదర్శన రాష్ట్రం కావాలి, మిగతా దేశమంతా దీనిని అనుసరించాలి’ అని ప్రతిపాదించారు.

దేశంలో వాడే నీటిలో 84% నీరు వ్యవసాయానికే వాడుతున్నారు. కొత్త సాంకేతికతను ఉపయోగించుకుని ప్రస్తుదం వాడుతున్న నీటిలో కేవలం 10-20 % నీరు మాత్రమే వాడి అంతే మొత్తం ఆహార ధాన్యాలను పండించవచ్చు.

యూరోప్ లో ముఖ్యంగా ఫ్రాన్స్ లో వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిందని చెప్పారు.

పుదుచ్చేరి రాష్ట్రానికి ఎలాగూ ఫ్రాన్స్ తో మంచి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. దీనివల్ల ఆ దేశంతో భాగస్వామ్యం ఏర్పరచుకుని, మిగతా భారత దేశానికి ఈ రాష్ట్రం మోడల్ గా అభివృద్ధి కావాలని ప్రతిపాదించారు.